ఆ బహుమతి అపురూపం
ఆభరణాలను ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. ఏ కొంతమందో ఇందుకు మినహాయింపుగా ఉంటారు. కానీ, శ్రద్ధాకపూర్ వంటి అమ్మాయిలకు మాత్రం ఎన్ని నగలున్నా తనివి తీరదు. ‘‘నా సగం సంపాదన నగలకే పోతుంది’’ అని శ్రద్ధాకపూర్ చెబుతూ -‘‘నా చిన్నప్పుడు మా అమ్మగారు నాకో నెక్లెస్ ఇచ్చారు. అది మా అమ్మమ్మది. ఆమె గుర్తుగా మా అమ్మగారు చాలా భద్రంగా దాచుకున్నారు. తర్వాత నాకు అప్పగించారు. చాలా అందమైన నెక్లెస్ అది. అమ్మ ఇచ్చిన ఆ అపురూపమైన బహుమతిని నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నా. ఇప్పటివరకూ నేను ఎన్నో నగలు కొనుకున్నా. మా అమ్మగారికి మాత్రం కోహినూర్ డైమండ్ ఇవ్వాలన్నది నా ఆకాంక్ష. కానీ, అది విదేశీయుల వశమైపోయింది. సో.. నా కోరిక తీరే అవకాశం లేదు. ఆ బాధ నన్నెప్పటికీ వెంటాడుతుంది’’ అని చెప్పారు.