కోహినూర్‌ను వెనక్కి తెమ్మనలేం
ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి వెనక్కి తెమ్మని, దాన్ని వేలం వేయకుండా ఆపాలని తాము ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విదేశాల్లోని ఆస్తులకు సంబంధించి తాము ఆదేశాలివ్వలేమంది.
కోహినూర్ వజ్రాన్ని వెనక్కు తెచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను ఓ ఎన్జీవో సంస్థ గత ఏడాది దాఖలు చేసింది. విచారణ సందర్భంగా.. అమెరికా, యూకేల్లోని ఆస్తులపై వ్యాజ్యాలు దాఖలు చేయడమేమిటో అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను ప్రస్తావిస్తూ కోహినూర్ విషయంలో భారత ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలిపింది.