లండన్ : యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు రావాలంటే (బ్రెగ్జిట్) కచ్చితంగా పార్లమెంటులో చట్టం చేయాల్సిందేనని ఆ దేశ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో లిస్బన్ ఒప్పందం (ఈయూ రాజ్యాంగం) లోని ఆర్టికల్ 50 ప్రకారం మార్చి చివరి లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న బ్రిటిష్ ప్రధాని థెరిసా మేకు చుక్కెదురైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ న్యూబెర్జర్ మంగళవారం తీర్పు వెలువరించారు.
బ్రిటన్ ఎంపీలు, మంత్రులు బ్రెగ్జిట్‌కు మద్దతు తెలిపేంత వరకు బ్రిటిష్ ప్రధాని ఈయూతో అధికారి కంగా చర్చలు జరప కూడదన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ.. బ్రిటిష్ ప్రజలు ఈయూ నుంచి వైదొలగాలని తీర్పు ఇచ్చారని, ఆర్టికల్ 50 ద్వారా మార్చి చివరిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయ డంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా కేసు వేసి ఉద్యమం నడిపిన భారత సంతతి మహిళ గినా మిల్ల ర్ సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.