కోహినూర్‌పై వివరాలు అందించలేం: కేంద్రం | Central government comments on Koh-i-Noor | Sakshi
Sakshi News home page

కోహినూర్‌పై వివరాలు అందించలేం: కేంద్రం

Published Mon, May 2 2016 1:59 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Central government comments on Koh-i-Noor

న్యూఢిల్లీ: కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యల సమాచారాన్ని అందించలేమని కేంద్రం పేర్కొంది. లండన్‌లోని బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న వజ్రాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుపై ప్రభుత్వం ఈ అభిప్రాయం వెల్లడించింది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున ఎటువంటి సమాచారాన్ని అందించలేమని పురావస్తు శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement