
ల్యాండర్ విక్రమ్ తీసిన మొదటి ఫొటోలో చంద్రునిపై ఉన్న బిలాలను కూడా ఇస్రో గుర్తించింది.
బెంగళూరు: చంద్రునిపై పరిశోధనల కోసం చంద్రయాన్-3.. ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. ఈ మేరకు ల్యాండర్ విక్రమ్ మొదటిసారి చంద్రుని ఫొటోలను పంపించింది. స్పేస్‌క్రాఫ్ట్ నుంచి గురువారమే విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుని కక్ష‍్యలో పరిభ్రమిస్తూ జాబిల్లి ఉపరితలాన్ని క్లిక్‌మనిపించింది. ఆ ఫొటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ల్యాండర్ విక్రమ్ తీసిన మొదటి ఫొటోలో చంద్రునిపై ఉన్న బిలాలను కూడా ఇస్రో గుర్తించింది. గార్డియానో బ్రూనో క్రేటర్ అనే పేరు కలిగిన బిలాన్ని గుర్తించారు. ఇటీవలే గుర్తించిన ఈ బిలం వ్యాసం దాదాపు 43 కిలోమీటర్లు ఉంటుంది. అయితే.. శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ మరింత విజయవంతమైనట్లు తెలిపారు.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 18, 2023
View from the Lander Imager (LI) Camera-1
on August 17, 2023
just after the separation of the Lander Module from the Propulsion Module #Chandrayaan_3 #Ch3 pic.twitter.com/abPIyEn1Ad
ఒకసారి ల్యాండర్ చంద్రున్ని తాకిన తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడివడుతుందని ఇస్రో తెలిపింది. అనంతరం రోవర్ కీలక సమాచారాన్ని సేకరిస్తుందని వెల్లడించింది. చంద్రుని ఆకృతి, శిథిలాలు, నీటి జాడ వంటి అనేక విషయాలను శోధిస్తుంది.