ఐఆర్ఎన్ఎస్ఎస్ 1సి కౌంట్డౌన్ మొదలు
చెన్నై: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో భారతీయ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్ 1సి(ఇండియన్ రీజినల్ నేవిగేషన్ సెటిలైట్ సిస్టమ్) కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 6.32 గంటలకు ప్రారంభమైంది. 67 గంటలపాటు కౌంట్‌డౌన్ సాగిన అనంతరం 16వ తేదీ తెల్లవారు జామున
1.32గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఈ సిరీస్లోని ఏడు సెటిలైట్స్లో మూడవదైన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1సిని ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 10న ప్రయోగించవలసి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 16న నింగిలోకి పంపుతున్నారు.
**