Chandrayaan 3 Ready For Launch Take Off On July 13, ISRO Chief Shares Complete Information - Sakshi
Sakshi News home page

విభిన్నం, వినూత్నం.. చంద్రయాన్‌–3

Published Wed, Jun 28 2023 8:42 PM | Last Updated on Thu, Jun 29 2023 10:00 AM

Chandrayaan 3 ready for Launch Take off On July 13 - Sakshi

చల్లని వెన్నెలను ఇచ్చే చందమామను మనం చూసేది కేవలం ఒకవైపే. కంటికి కనిపించని అవతలి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు కొంతవరకు విజయం సాధించాయి. అంతరిక్ష నౌకలను క్షేమంగా పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై ఆయా అంతరిక్ష నౌకలు కాలుమోపాయి. ఈ జాబితాలో చేరాలని భారత్‌ సైతం ఉవి్వళ్లూరుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్‌–3 ప్రయోగానికి సన్నద్ధమవుతోంది.

వచ్చే నెలలో జరిగే ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రుడిపైకి రోవర్‌ను పంపించి, అక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడ మే ఈ మిషన్‌ లక్ష్యం. చంద్రయాన్‌–3 స్పేస్‌క్రాఫ్ట్‌ను జీఎస్‌ఎల్‌వీ–ఎంకే–3 రాకెట్‌ ద్వారా చందమామపైకి పంపించనున్నారు. చంద్రయాన్‌–3 మిషన్‌ను కచి్చతంగా సఫలం చేయాలని, చంద్రుడిపై ప్రయో గాల్లో మనదైన ముద్ర వేయాలని ఇస్రో సైంటిస్టులు అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి పంపించడానికి ఈ ప్రయోగం కీలకం అవుతుందనడంలో సందేహం లేదు.  

మీకు గుర్తుందా? చంద్రయాన్‌–2 ప్రయోగం దేశ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిలి్చంది. విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్, ఆర్బిటార్‌తో వెళ్లిన చంద్రయాన్‌–2 స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రు డి ఉపరితలంపై క్షేమంగా దిగలేకపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 2019 సెపె్టంబర్‌ 6న క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ప్రయోగం విఫలం కావడంతో అప్పటి ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ప్రధాని మోదీ సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. దేశ ప్రజలంతా సానుభూతి ప్రదర్శించారు. చంద్రయాన్‌–2తో పోలిస్తే చంద్రయాన్‌–3 ప్రయోగం చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. రెండింటి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని అంటున్నారు.     

అవేమిటో తెలుసుకుందాం...
► ఆర్బిటార్, మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్‌ కెమెరా చంద్రయాన్‌–2లో కేవలం ఒక్కటే ఉంది. చంద్రయాన్‌–3లో ఇలాంటివి రెండు కెమెరాలు అమర్చుతున్నారు. చంద్రుడిపై ల్యాండర్‌ భద్రంగా దిగడానికి ఇవి ఉపకరిస్తాయి.  

► చంద్రయాన్‌–2లో 9 కీలక పరికరాలు ఉన్నాయి. ఇవి చంద్రుడి కక్ష్యలో ఇంకా చక్కగా పనిచేస్తూనే ఉన్నాయి. చంద్రయాన్‌–3 ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లో కేవలం స్పెక్ట్రో–పోలారీమెట్రీ ఆఫ్‌ హ్యాబిటబుల్‌ ప్లానెట్‌ ఎర్త్‌(ఎస్‌హెచ్‌ఏపీఈ) అనే పేలోడ్‌ కూడా ఉంటుంది. ఇతర గ్రహాలపై మానవ నివాస యోగ్యమైన ప్రదేశాల అన్వేషణకు అవసరమైన సమాచారాన్ని ఈ పరికరం అందజేస్తుంది.  

► చంద్రయాన్‌–3లో ల్యాండర్‌తోపాటు లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌ అరే(ఎల్‌ఆర్‌ఏ)ను సైతం పంపించ బోతున్నారు. జాబిల్లిపై పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడం ఖాయమని సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో ఒక కీలకమైన మైలురాయి కానుంది.

► చంద్రయాన్‌–2లో జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3 రాకెట్‌ ఉపయోగించారు. చంద్రయాన్‌–3లోనూ ఇలాంటి రాకెట్‌ను వాడుతున్నారు. చంద్రయాన్‌–2 రాకెట్‌లో ల్యాండర్, రోవర్, ఆర్బిటార్‌ ఉన్నాయి. మూడో ప్రయోగంలో ల్యాండర్, రోవర్‌ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్‌–2లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటార్‌ను ఈ తాజా ప్రయోగంలోనూ ఉపయోగించుకుంటారు. ఈ ఆర్బిటార్‌ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో క్షేమంగా ఉంది. సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి, ఉపరితలంపై మ్యాపింగ్‌ కోసం ఆర్బిటార్‌ను వాడుకుంటారు.

► చంద్రయాన్‌–2 వైఫల్యం నుంచి సైంటిస్టులు పాఠాలు నేర్చుకున్నారు. అందుకే చంద్రయాన్‌–3లో కొన్ని మార్పులు చేశారు.
 
  
చదవండి: మెట్రోలో యువకుల పిడిగుద్దులు.. వీడియో వైరల్..

జూలై 13న చంద్రయాన్‌–3 ప్రయోగం!  
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్‌–3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జూలై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ఈ ప్రయోగం ప్రారంభించనున్నట్లు సీనియర్‌ శాస్త్రవేత్త ఒకరు బుధవారం చెప్పా రు. అయితే, ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. జూలై12 నుంచి 19వ తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రయోగం చేపట్టే అవకాశముందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. చంద్రయాన్‌–1 ప్రయోగం 2008 అక్టోబర్‌22న, చంద్రయాన్‌–2 ప్రయోగం 2019 జూలై 22న ప్రయోగం నిర్వహించారు. చంద్రయాన్‌–1 విజయవంతమైంది. జాబిల్లి ఉపరితలంపై నీడ జాడ లను గుర్తించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ 312 రోజులపాటు సేవలందించింది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement