
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ ప్యానెల్ గదులు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. యూపీఎస్‌లో సాంకేతిక లోపంతోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment