పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం విజయవంతం | ISRO succesfully Launched Remote Sensing Satellite by PSLV-C36 | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 7 2016 11:44 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-36 విజయవంతంగా నింగికి దూసుకెళ్లింది. సోమవారం రాత్రి 10.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 36 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 17.9 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా 321 టన్నుల బరువును తీసుకుని రాకెట్ భూమి నుంచి నింగికి పయనమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement