
తిరుపతి: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం రాకెట్ ప్రయోగం జరిగింది.
దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందిన మొదటి రాకెట్ విక్రమ్-ఎస్. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ ఈ ప్రైవేట్‌రాకెట్‌ను రూపొందించింది. ‘మిషన్ ప్రారంభ్’ విజయవంతమైందని ప్రకటించారు సైంటిస్టులు.
భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్‌రంగంలో రూపొందిన తొలి రాకెట్ విక్రమ్–ఎస్. రాకెట్‌కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు.స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు.
మిషన్ ప్రారంభ్ విజయోత్సాహంతో.. ఇది కొత్త ప్రారంభం అని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ ప్రకటించారు. మన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment