శ్రీహరికోట అంతరిక్షా కేంద్రం ఆధ్వర్యంలో కర్నూలులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 7, 8 తేదీల్లో అంతరిక్ష ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
7,8 తేదీల్లో అంతరిక్ష ప్రదర్శనశాల
Published Tue, Oct 4 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీహరికోట అంతరిక్షా కేంద్రం ఆధ్వర్యంలో కర్నూలులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 7, 8 తేదీల్లో అంతరిక్ష ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రదర్శనలో రాకెట్ల వివిధ నమూనాలు, అంతరిక్ష ఉపయోగాలు తెలిపే వీడియోలు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రదర్శన ఉంటుందని, జిల్లాలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement