ఇస్రో రికార్డు.. జీఎస్ఎల్వీ గ్రాండ్ సక్సెస్ | Indian Space Agency's GSLV Rocket Successfully Launches | Sakshi
Sakshi News home page

ఇస్రో రికార్డు.. జీఎస్ఎల్వీ గ్రాండ్ సక్సెస్

Published Thu, Sep 8 2016 5:22 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

ఇస్రో రికార్డు.. జీఎస్ఎల్వీ గ్రాండ్ సక్సెస్

ఇస్రో రికార్డు.. జీఎస్ఎల్వీ గ్రాండ్ సక్సెస్

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత దక్కించుకుంది. జీఎస్ఎల్వీ ఎఫ్-05 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. ముందు నిర్ణయించిన సమయం కన్నా 40 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం చేసిన ఇస్రో మరో విజయాన్ని అందుకుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఇప్పటి వరకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించి విజయంసాధించిన ఇస్రో.. అదేమాదిరిగా జియోసింక్రనైజ్ షాటిలైట్ లాంచింగ్ వెహికిల్ ద్వారా ఇన్శాట్ -3డీఆర్ ఉపగ్రహాన్ని ప్రయోగించి సక్సెస్ సాధించింది. 17 నిమిషాల్లో నిర్ణీత కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది.

తొలుత రాకెట్ ప్రయోగాన్ని సాయంత్రం 4.10గంటలకు అనుకోగా కొంత సాంకేతిక సమస్య తలెత్తి 40 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగాన్ని ప్రారంభించారు. ఇంధనం నింపే ట్యూబులు తెరుచుకోకపోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. అది కాస్త పరిష్కారం కావడంతో సరిగ్గా 4.50 నిమిషాలకు ప్రయోగం ప్రారంభించారు. వాతావరణాన్ని మెరుగ్గా అధ్యయనం చేసేందుకు ఇన్ శాట్ -3డీఆర్ అనే ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా నింగిలోకి పంపిస్తున్నారు.

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్‌ దశతో మూడోసారి చేసిన ప్రయోగం అయినందున శాస్త్రవేత్తలు చాలా అప్రమత్తంగా ఉండి ఈ ప్రయోగం పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారని అన్నారు. అలాగే, ఈ విజయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరిన్ని భవిష్యత్లోనూ సాధించాలని ఆకాంక్షించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement