gslv
-
మార్చిలో నింగిలోకి నిసార్ ఉపగ్రహం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మిని్రస్టేషన్ (నాసా) సంయుక్తంగా 2,800 కిలోల బరువు కలిగిన నిసార్ (నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోపు సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్16) ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఉపగ్రహాన్ని లోయర్ ఎర్త్ అర్బిట్ (లియో)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది పూర్తి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూర పరిశీలనా ఉపగ్రహం) కావడం విశేషం. ఈ ఉపగ్రహం భూగోళం మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాప్ చేస్తుంది. ఈ ఉపగ్రహంలోని పేలోడ్స్‌తో భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద జీవసంపద, సముద్రమట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడడం వంటి విపత్తుల గురించి స్థిరమైన డేటాను అందిస్తుంది. నిసార్ ఉపగ్రహంలో ఎల్ మరియు ఎస్ డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (ఎస్ఏఆర్)ని కలిగి వుంటుంది. ఇది అధిక రిజల్యూషన్ డేటాతో పెద్ద స్వాత్‌ను స్వీప్ సార్ టెక్నిక్‌తో పని చేస్తుంది. ఈ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్, సిం«థటిక్ ఆపార్చర్ రాడార్‌ను ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్‌ను నాసా సమకూర్చాయి. ఈ రెండు దేశాలకు చెందిన సింథటిక్ ఆపార్చర్ రాడార్లు సుమారు 12 మీటర్లు వ్యాసార్థంలో వున్న రిఫ్లెక్టర్ యాంటెన్నాను ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా నాసా మిషన్ కోసం ఇంజినీరింగ్ పేలోడ్స్‌ను అందిస్తుంది. ఇందులో పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్, హై–రేట్సైన్స్ డౌన్‌లింక్ సిస్టమ్, జీపీఎస్ రిసీవర్లు మరియు సాలిడ్ స్టేట్ రికార్డర్ ఉన్నాయి. ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్లలో ఇది మొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ మిషన్ అవుతుంది. నాసా వారి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సైంటిఫిక్ పరికరాలతో బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్ఎస్సీ)లో నిసార్ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. మార్చి నెలాఖరులోపు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. -
29న షార్ నుంచి వందో ప్రయోగం
సూళ్లూరుపేట: జీఎస్ఎల్వీ– ఎఫ్ 15తో ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని అనుసంధానించడం పూర్తయిందని ఆదివారం షార్ డైరెక్టర్ రాజరాజన్ చెప్పారు. దేశీయంగా రూపుదిద్దుకున్న క్రయోజనిక్ జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ఎన్వీఎస్–02ను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. శ్రీహరి కోటలోని షార్ నుంచి ఇది 100వ మిషన్ కానుందన్నారు. రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి చేపట్టే ప్రయోగంలో ఎన్వీఎస్–02ను జియో సిక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం ఆయన మీడియాకు వివరించారు. జీఎస్ల్వీఎల్ ఎప్15 రాకెట్ ప్రయోగానికి 27 గంటల ముందు అంటే 28వ తేదీ తెల్లవారు జామున 3.23 గంటలకు కౌంట్‌డౌన్ మొదలయ్యే అవకాశం ఉందన్నారు. 29న ఉదయం 6.23 గంటలకు ప్రయోగం ఉంటుందని చెప్పారు. అయితే, కౌంట్‌డౌన్ సమయాన్ని సోమవారం అధికారికంగా ఫ్రకటిస్తామని చెప్పారు. మూడో లాంచ్‌ప్యాడ్‌కు నెలలో శంకుస్థాపన సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్)లో మరో ప్రయోగ వేదిక నిర్మాణానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.3,984 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని రాజరాజన్ గుర్తు చేశారు. ఇందుకు అవసరమైన స్థలం ఎంపిక పూర్తయిందని, నెల రోజుల్లోనే భూమిపూజ ఉంటుందని వివరించారు. దీనికి అనుసంధానంగానే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్‌ను రూపొందించనున్నామన్నారు. భవిష్యత్తులో దీనిద్వారానే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టనున్నామని తెలిపారు. కొత్త తరం లాంచింగ్ వెహికల్తో 20 నుంచి 25 టన్నుల ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి పంపించొచ్చని చెప్పారు. తమిళనాడులోని కులశేఖర్‌పట్నంలో నిర్మిస్తున్న రాకెట్ ఫ్రయోగ వేదిక డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందన్నారు. -
ఇస్రోకు ‘వంద’నం!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆరు దశాబ్దాలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎంతోమంది మహామహుల కృషి ఫలితంగా నేడు 99 ప్రయోగాలను పూర్తిచేసి వందో ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. నాటి ఆర్యభట్ట నుంచి చంద్రుడిపై రోవర్‌తో పరిశోధనలు, డాకింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చుకున్న స్పేడెక్స్ ఉపగ్రహ ప్రయోగాలతో భారత అంతరిక్ష యాత్ర అప్రతిహతంగా సాగుతోంది.ఈ నేపథ్యంలో.. శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఈనెల 29న ప్రయోగించబోయే జీఎస్ఎల్వీ ఎఫ్15 ప్రయోగంతో సెంచరీ పూర్తిచేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ ప్రయోగంతో ఇస్రో సొంతంగా 100 ప్రయోగాలను పూర్తిచేసిన జాబితాలో చేరనుంది. ఎస్ఎల్వీ రాకెట్లు 4, ఏఎస్ఎల్వీలు 4, పీఎస్ఎల్వీలు 62, జీఎస్ఎల్వీలు 16, ఎల్వీఎం3– 7, ఎస్ఎస్ఎల్వీలు 3, స్క్రామ్‌జెట్ 1, ఆర్ఎల్వీ టీడీ 1, క్రూ ఎస్కేప్ సిస్టం 1 మొత్తం కలిపి 99 ప్రయోగాలు చేశారు. ఈ రాకెట్ల ద్వారా 129 స్వదేశీ ఉపగ్రహాలు, 18 స్టూడెంట్ ఉపగ్రహాలు, 9 రీఎంట్రీ మిషన్లు, 433 విదేశీ ఉపగ్రహాలు, రెండు ప్రైవేట్ ఉపగ్రహాలు, ఒక గగన్‌యాన్ టెస్ట్ వెహికల్–డీ1 పేర్లతో 592 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించారు. ఇక ఈ 99 ప్రయోగాల్లో 89 విజయవంతమయ్యాయి. ఉపగ్రహాలతో ఉపయోగాలు.. సముద్రాలు, భూమిపై అధ్యయనం చేసేందుకు.. భూమి పొరల్లో దాగివుండే నిధి నిక్షేపాలను తెలియజేసేందుకు.. పట్టణ ప్రణాళికాభివృద్ధి, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం.. రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాల కోసం దూర పరిశీలనా ఉపగ్రహాలు (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్), రేడియో, టెలివిజన్, డీటీహెచ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసన్, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ లాంటి ఎన్నో ప్రసారాలను మెరుగుపరిచేందుకు సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్ శాటిలైట్స్)ను పంపించారు.విశ్వంలోని చంద్రుడు, సూర్యుడు, అంగారక గ్రహాల మీద పరిశోధనకు చంద్రయాన్–1, 2, 3 మంగళ్యాన్–1, సూర్యయాన్–1 అనే మూడు ఉపగ్రహాలతో పరిశోధనలు చేస్తున్నారు. ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్థారించుకునేందుకు ఎక్స్పరిమెంట్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలు, ఖగోళం, వాతావరణం గురించి తెలియజేసేందుకు స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్ శాటిలైట్స్ అన్నీ కలుపుకుంటే ఇప్పటివరకూ 159 ఉపగ్రహాలను పంపారు. ఇస్రో చరిత్రలోకి వెళ్తే.. 1961లో డాక్టర్ హోమీ జే బాబా అనే శాస్త్రవేత్త అంతరిక్ష ప్రయోగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)ని ప్రారంభించారు. ఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌గా ఉద్భవించింది. దీనికి అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. 1963 నవంబర్ 21న 5 దేశాల సాయంతో దిగుమతి చేసుకున్న ‘నైక్ అపాచి’ అనే 2 దశల సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించారు. సారాభాయ్ ఆధ్వర్యంలో.. దేశంలో సొంతంగా రాకెట్ కేంద్రం, ఉపగ్రహాల తయారీ కేంద్రం ఏర్పాట్లు చేసుకోవాలని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ముందుకు సాగారు. ఆయన చేసిన ప్రయత్నాలకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో తుంబాలో సౌండింగ్ రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకుని 1967 నవంబర్ 20న రోహిణి–75 అనే సౌండింగ్ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయంతంగా ప్రయోగించారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా పేరు మార్చారు.1970లో డిపార్ట్మెంట్ స్పేస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1963లో తుంబా నుంచి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో మన అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది. తూర్పు తీర ప్రాంతాన.. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఇందిరాగాంధీ 1969లో ముందుగా అరేబియా సముద్ర తీర ప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ముందుగా గుజరాత్లో చూసి అక్కడ గ్రావిటీ పవర్ ఎక్కువగా ఉండడంతో తూర్పున బంగాళాఖాతం తీర ప్రాంతంలో స్థలాన్వేషణ చేస్తున్న సమయంలో పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చదరపు కిలోమీటర్లు విస్తరించిన శ్రీహరికోట దీవి ప్రాంతం కనిపించింది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడం, గ్రావిటీ పవర్ తక్కువగా ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని సారాభాయ్ శ్రీహరికోటను ఎంపిక చేశారు. ఇక్కడున్న సుమారు 56 గ్రామాలను ఖాళీ చేయించి రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దురదృష్టవశాత్తూ 1970 డిసెంబరు 30న డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మృతిచెందడంతో ఆ బాధ్యతలను వెంటనే ప్రొఫెసర్ సతీష్ ధవన్‌కు అప్పగించారు. ఆర్యభట్టతోనే అడుగులు.. ఒకవైపు శ్రీహరికోటలో రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తూనే మరోవైపు బెంగళూరులో శాటిలైట్ తయారీ కేంద్రంలో 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారుచేసుకుని రష్యా నుంచి ప్రయోగించి మొదటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం పూర్తిస్థాయిలో రూపాంతరం చెందాక మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్ఎల్వీ–3 ఇ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం.. ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లను అభివృద్ధిచేశారు. ఇండియన్ రాకెట్ల ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలనా ఉపగ్రహాలు), ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (భారత క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు), వాతావరణ పరిశోధనలకు ఆస్రోనాట్ ఉపగ్రహాలు, గ్రహంతర ప్రయోగాలు (చంద్రయాన్–1, మంగళ్యాన్–1, చంద్రయాన్–1), అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం సేడెక్స్ ఉపగ్రహాలతో డాకింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకుని నాలుగో దేశంగా భారత్ ఖ్యాతి గడించింది. అలాగే, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల అంతరిక్ష సంస్థల నుంచి రాకెట్ల ద్వారా 30 ఉపగ్రహాలను పంపించిన ఇస్రో ఇప్పుడు 37 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలను పంపించి రికార్డు నెలకొల్పింది. షార్‌లో అత్యాధునిక సౌకర్యాలు.. ఇక శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో సౌండింగ్ రాకెట్లు, ఆ తరువాత చిన్నపాటి లాంచ్ప్యాడ్ల మీద ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించారు. చిన్నచిన్న ప్రయోగాల్లో రాటుదేలడంతో పెద్ద ప్రయోగాలు చేయడానికి మొదటి ప్రయోగ వేదికను నిర్మించారు. దీనిపై 1990 నంచి 2005 దాకా ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు. ఆ తరువాత భవిష్యత్తులో అత్యంత బరువైను ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మరో ప్రయోగ వేదిక అవసరాన్ని 2002లో గుర్తించారు. అంచెలంచెలుగా ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.ఇస్రో చైర్మన్లు వీరే.. 1963–71: డాక్టర్ విక్రమ్ సారాభాయ్ 1972లో 9 నెలలు పాటు ఎంజీకే మీనన్ 1973–84 : ప్రొఫెసర్ సతీష్ ధవన్ 1984–94 : డాక్టర్ యూఆర్ రావు 1994–2003 : డాక్టర్ కస్తూరి రంగన్ 2003–2009 : ఈకే మాధవన్ నాయర్ 2009–2014 : డాక్టర్ కే రాధాకృష్ణన్ 2015లో 11 రోజులపాటు శైలేష్ నాయక్ 2015–2018 : ఏఎస్ కిరణ్‌కుమార్ 2018–2022 : డాక్టర్ కైలాసవాడివో శివన్ 2022–2025 : డాక్టర్ ఎస్ సోమనాథ్ 2025 జనవరి 14 నుంచి : డాక్టర్ వీ నారాయణన్షార్ డైరెక్టర్లు.. 1969–76 : వై జనార్థన్‌రావు 1977–85 : కల్నల్ ఎన్ పంత్ 1985–89 : ఎంఆర్ కురూప్. 1989–94 : ఆర్. అరవాముదన్ 1994లో : (6 నెలలు) శ్రీనివాసన్ 1994–99 : డాక్టర్ ఎస్ వసంత్1999–2005 : డాక్టర్ కాటూరి నారాయణ 2005–2008 : ఎం అన్నామలై 2008–2012 : ఎం చంద్రదత్తన్ 2013–2015 : ఎంవైఎస్ ప్రసాద్ 2015–2018 : పీ కున్హికృష్ణన్ 2018–2019 : ఎస్ పాండ్యన్ 2019 నుంచి : ఎ.రాజరాజన్ -
జీఎస్ఎల్వీ–ఎఫ్14 సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జియో సింక్రనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్14) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 27.30 గంటల అనంతరం నిర్దేశిత సమయానికి రాకెట్ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగంలోని మొత్తం మూడు దశలు విజయవంతమయ్యాయి. 2,275 కిలోల బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు(పెరిజీ), భూమికి దూరంగా 36,647 కిలోమీటర్ల(అపోజీ) జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఇన్శాట్–3డీఎస్‌లో నింపిన 1,250 కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండించి, మరో రెండు మూడు రోజుల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్(భూ స్థిరకక్ష్య)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. ఏమిటీ ఇన్శాట్–3డీఎస్? దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు, విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది. దీంతో వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత రానుంది. ఇన్శాట్–3, ఇన్శాట్–3ఆర్ ఉపగ్రహాలకు అనుసంధానంగా మూడో తరం ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహం పని చేస్తుంది. ఇప్పటిదాకా ఇన్శాట్ శ్రేణిలో 23 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ శాటిలైట్లకు కొనసాగింపుగా ఇన్శాట్–3డీఎస్‌ని అభివృద్ధి చేశారు. ఇందులో ఆరు చానెల్ ఇమేజర్స్, 19 చానెల్ సౌండర్స్తోపాటు మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను అమర్చారు. వాతావరణ పరిశీలనతోపాటు భూమి, సముద్ర ఉపరితలాల అధ్యయనం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా సేవలు అందించనుంది. త్వరలో నిస్సార్ ప్రయోగం: సోమనాథ్ నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్(నిస్సార్) మిషన్ అనే జాయింట్ ఆపరేషన్ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జూన్‌లో జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. పీఎస్ఎల్వీ–సీ59, ఎస్ఎస్ఎల్వీ–డి3, జీఎస్ఎల్వీ–ఎఫ్15 ప్రయోగాలతో పాటు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ఆర్ఎల్వీ–టీడీ–2 ప్రయోగం కూడా నిర్వహించబోతున్నట్లు ఎస్.సోమనాథ్ తెలిపారు. -
జీఎస్ఎల్వీ ఎఫ్14 గ్రాండ్ సక్సెస్.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: జీఎస్ఎల్వీ ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇన్శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన ఇస్రో బృందాన్ని సీఎం అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపించారు. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ఇదీ చదవండి: చంద్రబాబులోని చీకటి కోణమే ఇది! -
ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
GSLV F-14 కౌంట్ డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది: ఇస్రో ఛైర్మన్
-
ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి మారుస్తారు. -
రేపు జీఎస్ఎల్వీ ఎఫ్–14 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): స్థానిక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో గురువారం మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయో గ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యా బ్) వారికి అప్పగించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజ రాజన్ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్ సమావేశం నిర్వహించారు.శుక్రవా రం మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగిస్తారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ఇది షార్ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా, జీఎస్ఎల్వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషం. -
2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో ఆరు పీఎస్ఎల్వీ మిషన్లు, మూడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు, ఒక లాంచ్ వెహికల్ మార్క్–3 వాణిజ్య ప్రయోగం ఉందని తెలియజేసింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇస్రో అభివృద్ధి చేసిన నూతన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపించనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకొనేందుకు రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని ఇస్రో భావిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
జీఎస్ఎల్వీ -ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
జీఎస్ఎల్వీ ప్రయోగం సక్సెస్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): రెండోతరం నావిగేషన్ ఉపగ్రహ సిరీస్‌లో మొదటిదైన ఎన్వీఎస్–01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లోని రెండో లాంచింగ్ప్యాడ్ వేదికైంది. 27.5 గంటల కౌంట్‌డౌన్ ముగిశాక సోమవారం ఉదయం 10.42 గంటలకు ఎన్వీఎస్–01 ఉపగ్రహాన్ని 51 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువైన జీఎస్ఎల్వీ రాకెట్ భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు (పెరీజి), భూమికి దూరంగా 36,568 కిలోమీటర్లు (అపోజీ) దీర్ఘవృత్తాకార భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 2,232 కేజీల ఉపగ్రహం అక్కడ స్ధిరంగా ఉన్నట్లు బెంగళూరు దగ్గర్లోని హసన్‌లోని గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందాయి. జీఎస్ఎల్వీ వాహకనౌకను వాడటం ఇది 15వ సారి. 2021 ఆగస్టులో ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్10 అపజయం పాలవడంతో ఆనాటి క్రయోజనిక్ స్థాయి తప్పిదాలను సరిచేసి ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో మూడు దశల్లో పెరీజీని పెంచుతూ అపోజీని తగ్గిస్తూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరుస్తారు. అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్ తరహాలో భారత సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావ్ఐసీ(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్– గతంలో భారత క్షేత్రియ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ)ను బలోపేతం చేసే దిశగా ఈ కొత్త తరం ఉపగ్రహాన్ని ఒక పాత ఉపగ్రహం స్థానంలో భర్తీ చేస్తున్నారు. అయితే ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లోని మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడారు. ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని అన్నారు. భారతదేశ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ ఉపగ్రహాలను ఆరు నెలకొకసారి ప్రయోగిస్తామని తెలిపారు. GSLV-F12/ NVS-O1 Mission is accomplished. After a flight of about 19 minutes, the NVS-O1 satellite was injected precisely into a Geosynchronous Transfer Orbit. Subsequent orbit-raising manoeuvres will take NVS-01 into the intended Geosynchronous orbit. — ISRO (@isro) May 29, 2023 తొలిసారిగా దేశీ అణుగడియారం ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ కొత్త ఉపగ్రహాలు ఎంతగానో దోహదపడతాయి. గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్–బ్యాండ్, కె–బ్యాండ్, కేయూ–బ్యాండ్ లాంటి ఉపకరణాలను అమర్చారు. ఈసారి నావిక్–01 ఉపగ్రహంలో ఎల్–1, ఎల్–5, ఎస్–బ్యాండ్ సిగ్నల్స్ వ్యవస్థను అమర్చారు. ఎల్–1లో పౌరులకు ఉపయోగపడే సివిలియన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను పరిచయం చేశారు. సమయం, స్థానం అత్యంత ఖచ్చితంగా తెలిపే తొలిసారిగా దేశీయంగా తయారుచేసిన రుబీడియం అణుగడియారాన్ని ఉపగ్రహంలో అమర్చారు. ఆటమిక్ క్లాక్‌ను తయారుచేస్తే సత్తా ప్రపంచంలో చాలా తక్కువదేశాలకే ఉంది. నావిగేషన్ ఉపగ్రహాల వ్యవస్థలో ఇప్పటికే ఏడు ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థను అందిస్తున్నారు. ఇందులో నాలుగు ఉపగ్రహాలకు కాలపరిమితి ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవాటిని పంపుతున్నారు. కొత్త ఉపగ్రహాలతో భూ, జల, వాయు మార్గాల్లో పొజిషన్‌ను 20 మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో, 50 నానోసెకన్ల రియల్‌టైమ్‌తో చూపించడం, అత్యవసర సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశా నిర్ధేశం, ఇంటర్నెట్తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. దేశానికి ఆవల సైతం 1,500 కిలోమీటర్లదాకా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. -
సాకారం దిశగా గగనయానం.. ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట: ఇస్రో గండరగండులు ఇకపై అంతరిక్షంలో విహరించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత ప్రయోగాలే లక్ష్యంగా ఈ ఏడాది చివరికి లేదా 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్–1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేసేందుకు పలు రకాల భూస్థిర పరీక్షలు చేసి రాకెట్ సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇస్రో సన్నద్ధమవుతోంది. గగన్‌యాన్–1కు సంబంధించి తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని స్ప్రాబ్ విభాగంలో ఈ నెల 13న ఎస్–200 (ఘన ఇంధన మోటార్) భూస్థిర పరీక్షను ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. భారీ రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు, రెండో దశలో ఉపయోగించే ఎల్–110 సామర్థ్యంతో పాటు సుమారు 3.5 టన్నుల బరువు గల క్రూ మాడ్యూల్ (వ్యోమనాట్స్ గది)ను పంపించి మళ్లీ దాన్ని తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో సొంతంగా తయారు చేసుకుంది. క్రూ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రయోగించి పారాచూట్ల సాయంతో తిరిగి తీసుకొచ్చే విషయంలోనూ విజయం సాధించారు. దిగ్విజయంగా.. ప్యాడ్ అబార్ట్ టెస్ట్.. మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ అనే ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగంలో 259 సెకన్ల పాటు రాకెట్‌ను నాలుగు దశల్లో మండించి రెండు కిలోమీటర్ల మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి పారాచూట్ల ద్వారా క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 720 సెకన్లపాటు మండించి.. గగన్‌యాన్–1 ప్రయోగానికి సంబంధించి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో ఈ ఏడాది జనవరి 12న భూస్థిర పరీక్ష నిర్వహించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. క్రయోజనిక్ మోటార్లో 12 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకన్ల పాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించారు. ఈ ఇంజన్‌ను మరోమారు 1,810 సెకన్ల పాటు మండించి పరీక్షించేందుకుగాను మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఆర్ఎల్వీ టీడీ ప్రయోగమూ విజయవంతం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్(ఆర్ఎల్వీ–టీడీ)ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ తరహా రాకెట్ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువుగల హైపర్ సోనిక్ ఫ్లైట్‌ను విడుదల చేసింది. ఆ ఫ్లైట్ 65 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి వచ్చేందుకు రన్ వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 450 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు. దానికి ఇండియన్ కోస్టల్ గార్డ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. వ్యోమనాట్స్‌ను రోదసిలో వదిలిపెట్టి మళ్లీ క్షేమంగా తెచ్చేందుకు ఉపయోగపడే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు. (క్లిక్: తమిళనాడులో సబ్‌వేరియంట్ బీఏ.4 రెండో కేసు) -
జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలం
-
EOS-03: సిద్ధమవుతున్న 'జీఎస్ఎల్వీ ఎఫ్10'
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 12న తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ప్రయోగానికి సన్నద్ధం చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా కరోనా కారణంగా షార్‌లో ప్రయోగాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక పీఎస్ఎల్వీ ప్రయోగం తరువాత షార్ కేంద్రంలో కరోనా విజృంభించడంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. 2020లో నాలుగు సార్లు వాయిదా పడిన జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగం ఐదో ప్రయత్నంలో విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేయనున్నారు. – సూళ్లూరుపేట కొత్త అధ్యాయానికి నాంది.. జీఎస్ఎల్వీ ఎఫ్10 (జీఎస్ఎల్వీ మార్క్2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–03) అనే ఈ నూతన ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి దాకా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. ఈసారి ఈవోఎస్–03 అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రత్యేకతలు.. ► శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇది 79వ ప్రయోగం. ► జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల సిరీస్‌లో 14వ ప్రయోగం. ► సొంత క్రయోజనిక్ టెక్నాలజీలో ఇది 8వ ప్రయోగం. ► దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్–03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ► ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (6 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (158 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ షార్ట్ వేవ్–ఇన్ఫ్రారెడ్ (256 బాండ్స్) పేలోడ్స్‌గా అమర్చారు. ► ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. సుమారు 10 సంవత్సరాలు ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తుంది. -
ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానున్న ఇస్రో ప్రయోగం..!
బెంగుళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది.ఆగస్టు 12 న జిఎస్ఎల్వి-ఎఫ్ 10 రాకెట్ ద్వారా జియో ఇమేజింగ్ ఉపగ్రహం జిశాట్ -1 కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప్రయోగం 2021 వ సంవత్పరంలో ఇస్రో జరపబోయే రెండో ప్రయోగం. బ్రెజిల్‌కు చెందిన ఎర్త్ ఆబ్సర్వేషన్ శాటిలైట్ అమెజోనియా -1తో పాటుగా మరో 18 శాటిలైట్లను పీఎస్ఎల్వీ- సీ51 రాకెట్ తో ఫిబ్రవరి 28 రోజున ప్రయోగించింది. ఈ ప్రయోగంలో కొంతమంది విద్యార్థులు తయారుచేసిన శాటిలైట్లు కూడా ఉన్నాయి. 2,268 కిలోల బరువున్న జిశాట్-1 ఉపగ్రహాన్ని గత ఏడాది మార్చి 5 న ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో జీశాట్-1 ప్రయోగం ఆలస్యమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 12 న ఉదయం 05.43 గంటలకు జీఎస్ఎల్వి-ఎఫ్ 10 లాంచ్ వెహికిల్తో జీశాట్-1ను ప్రయోగిస్తామని ఇస్రో అధికారులు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. GISAT-1 ప్రయోగంతో భారత ఉపఖండ పరిశీలనకు దోహదపడుతుందని తెలిపారు. GISAT-1 ను GSLV-F10 రాకెట్‌తో జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం దేశ సరిహద్దుల రియల్ టైం చిత్రాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలను త్వరగా పర్యవేక్షించటానికి వీలు కల్పిస్తుంది. ఆన్‌బోర్డ్ హై రిజల్యూషన్ కెమెరాలతో, భారతీయ భూభాగం, మహాసముద్రాలను, ముఖ్యంగా దాని సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతోందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. -
గగన్‌యాన్ మిషన్ మరింత ఆలస్యం
సాక్షి, బెంగళూరు: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి ఆర్బిటల్ వ్యోమనౌకలో భారతీయ వ్యోమగాములను పంపనుంది. ఇండియన్ హ్యుమన్ స్పెస్ క్రాఫ్ట్ ప్రొగ్రామ్‌లో భాగంగా 2022 నాటికి భారతీయ వ్యోమగాములతో కూడిన ఆర్బిల్ స్పేస్ క్రాఫ్ట్‌ను కనీసం 7 రోజులు అంతరిక్షానికి పంపించడమే గగన్ యాన్ ప్రయోగం ఉద్దేశమని ఇస్రో తెలిపింది. తాజాగా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష మిషన్ గగన్‌యాన్ ఒక సంవత్సరం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారులు తెలిపారు.(చదవండి: దేశీయంగా వ్యాక్సిన్‌కు అనుమతించండి) రెండు మానవ రహిత మిషన్లను డిసెంబర్ 2020, జూలై 2021లో నిర్వహిస్తామని... వ్యోమగాములతో కూడిన మిషన్ ను డిసెంబర్ 2021లో నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. గగన్‌యాన్ మిషన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లో భాగంగా ప్రాజెక్ట్ కోసం ఎంపికైన మనుషులకి ఈ మిషన్ ప్రయోగానికి ముందు రెండు అన్‌క్రూవ్డ్ మిషన్లు చేపడుతారు. కానీ "కోవిడ్ కారణంగా ఈ మిషన్ మరింత ఆలస్యం అవుతుంది" అని ఇస్రో చైర్మన్ కె.శివన్ స్పష్టం చేశారు. "మేము వచ్చే ఏడాది చివరలో లేదా తర్వాతి సంవత్సరంలో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అతను తెలిపారు. గగన్‌యాన్ మిషన్ లో భాగంగా ముగ్గురు సిబ్బందితో కూడిన వ్యోమనౌకని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (LEO)కు కక్ష్యలో ప్రవేశపెట్టడంతో పాటు, మిషన్ తరువాత వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం గగన్ యాన్ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. బెంగళూరు ప్రధాన కార్యాలయం ఇస్రో గత నెలలో హెవీ లిఫ్ట్ లాంచర్, జిఎస్ఎల్వి ఎంకెఐఐఐని గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రయోగించినట్లు తెలిపారు. జిఎస్ఎల్వి ఎంకెఐఐఐలో హై థ్రస్ట్ సాలిడ్ ప్రొపెల్లెంట్ స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ S200 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
నేడే కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్10) నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం 3.43 గంటలకు కౌంట్ డౌన్ ♦ ఇస్రో చైర్మన్ డాక్టర్ కే.శివన్ చేతులు మీదుగా బుధవారం సాయంత్రం 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం. 10 గంటలకు ఎంఆర్ఆర్ సమావేశం ♦ బుధవారం ఉదయం 10 గంటలకు షార్‌లోని బ్రహ్మ ప్రకాష్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం. ♦ రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు ప్రయోగ పనులు. ♦ ‘ల్యాబ్’ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్. ♦ జీఐశాట్–1 ఉపగ్రహాల్లో ఇది మొట్టమొదటిది ♦ బుధవారం సాయంత్రం నుంచి రాకెట్ రెండోదశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియ ♦ గురువారం ఉదయం నుంచి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియకు ఏర్పాట్లు. ♦ గురువారం సాయంత్రం 5.43 గంటలకు 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ ఎఫ్–10 రాకెట్ నింగికి దూసుకు వెళ్తుంది. ♦ ఇది షార్ కేంద్రం నుంచి 76వ ప్రయోగం. ♦ జీఎస్ఎల్వీ మార్క్–2 సిరీస్‌లో 14వ ప్రయోగం. ♦ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్లతో నిర్వహిస్తున్న 8వ ప్రయోగం. ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం జీఎస్ఎల్వీ ఎఫ్10 (జీఎస్ఎల్వీ మార్క్ 2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లో ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు)ను భూమికి 506 – 830 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవకక్ష్య)లోకి మాత్రమే పంపేవారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు), నావిగేషన్ శాటిలైట్స్ (దిక్సూచి ఉపగ్రహాలు)ను భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి పంపేవారు. ఈసారి జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపి పని చేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం. దీని తరువాత జూలైలో జీఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ద్వారా జీఐశాట్–2 రెండో ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థతో అనుసంధానం, విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ రెండు భారీ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. -
విదేశీ ఉపగ్రహ మార్కెట్‌పై ఇస్రో దృష్టి
సాక్షి, అమరావతి: ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం గమనార్హం. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 1999లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీఎల్ఆర్–టబ్‌సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్‌ను విజయవం తంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇస్రో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇస్రో స్వయం ప్రతిపత్తి... విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో 2018–19లో రికార్డు స్థాయిలో రూ.324.19 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2017–18లో రూ.232.56 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రూ.1,245.17 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహా ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1992లో ఏర్పాటైన ఈ సంస్థ గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా రూ.6,280 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎస్ఎల్వీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు పీఎస్ఎల్వీ 52.7 టన్నుల శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. గత నెలలోనే పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహలను నింగిలోకి పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. పదేళ్లలో రూ.20,300 కోట్లు రానున్న పదేళ్లలో అంతర్జాతీయ శాటిలైట్ మార్కెట్ వేగంగా విస్తరించనుందని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17,000కుపైగా మినీ శాటిలైట్లను ప్రయోగిస్తారని చెబుతోంది. ప్రస్తుతం రూ.3,591 కోట్లుగా ఉన్న శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20,300 కోట్లకు చేరుతుందని బీఐఎస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఇస్రో వాటా కేవలం 2 శాతమే. ఈ వ్యాపార అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఆంట్రిక్స్కు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) పేరిట 2019లో మరో సంస్థను ఇస్రో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విదేశాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధి వ్యాపారంపై దృష్టి సారిస్తుంది. -
అంతరిక్షం..10000 కోట్లు
పది వేల కోట్ల రూపాయలు.. ముగ్గురు వ్యోమగాములు..వారం రోజుల అంతరిక్ష ప్రయోగం.. 2022 కల్లా కల సాకారం దిశగా అడుగులు... విజయం సాధిస్తే భారత్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి... అంతరిక్షాన్ని అందుకున్న అమెరికా, రష్యా, చైనాల సరసన సగర్వంగా నిలిచే అవకాశం..అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగంలో ఉపాధి కల్పనకు ఊతం.. ఇదీ ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టు ప్రణాళిక. స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షయానం కోసం ఇస్రో భుజానికెత్తుకున్న ఈ బృహత్తర ప్రాజెక్టు విశేషాలు స్థూలంగా.. 2004 లోనే గగన్‌యాన్‌కు శ్రీకారం.. అంతరిక్షంలోకి మనుషులను పంపించాలన్న ఆలోచనకు సూత్రప్రాయ అంగీకారం తెలపడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్లానింగ్ కమిటీ 2004లో గగన్‌యాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రయోగం ఎప్పుడు? ఎలా? అనే అంశాలపై మాత్రం స్పష్టత లేకపోయింది. 2015కల్లా ప్రయోగం చేపట్టాలన్నది తొలినాళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యం. రెండేళ్ల క్రితం కూడా మానవసహిత అంతరిక్ష ప్రయోగ ప్రణాళిక ఏదీ లేదని ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే అంటూ వచ్చిన ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం ద్వారా శుక్రవారమే గగన్‌యాన్‌ను ధ్రువీకరించింది. సంక్లిష్టమైన ప్రయోగం... ఇస్రో ఇప్పటివరకూ ఎన్నో రాకెట్లను, వాటి ద్వారా మరెన్నో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినా మానవసహిత అంతరిక్ష ప్రయోగం వాటన్నింటికంటే భిన్నమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రయాన్, మంగళ్‌యాన్‌లతో పోల్చినా గగన్‌యాన్ చాలా సంక్లిష్టమైన, భారీ ప్రయోగమనే చెప్పాలి. మళ్లీమళ్లీ వాడుకోగల రాకెట్‌ను తయారు చేయడం ఒక ఎత్తైతే.. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు అనువైన మాడ్యూల్‌ను తయారు చేయడం ఇంకో ఎత్తు. వ్యోమగాములు తినేదేమిటి? ఒక్కమాటలో చెప్పాలంటే మెనూ ఇంకా రెడీ కాలేదు. కాకపోతే మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) ఈ మెనూపై ఏళ్లుగా పనిచేస్తోంది. దక్షిణాది వ్యోమగాములైతే మనవాళ్ల ఫేవరెట్ ఆహారం పులిహోర లేదంటే దోసలు. ఉత్తరాది వారికి చపాతీ ముక్కలు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కొన్నేళ్ల క్రితమే సీఎఫ్టీఆర్ఐ ఉన్నతాధికారులు ప్రకటించారు. వీలైనంత వరకూ భారతీయులు ఇష్టపడే మసాలా నిండిన వెజ్, నాన్‌వెజ్ ఆహారాన్ని గిన్నెల్లోనే ప్యాక్ చేసి ఇస్తామని, కాకపోతే వ్యోమగాములు ఈ ఆహారాన్ని గొట్టాల ద్వారా పీల్చుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారరహిత స్థితిలో నీళ్లుతాగడమైనా, ఆహారం తీసుకోవడమైనా చాల ఇబ్బందితో కూడుకున్న విషయమన్నది తెలిసిందే. వాటితోపాటు ఫ్రూట్బార్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గ్రనోలా బార్లు కూడా వ్యోమగాములకు ఇస్తామని సీఎఫ్టీఆర్ఐ డైరెక్టర్ చెప్పారు. ప్రాజెక్టు డైరెక్టర్‌గా మహిళా శాస్త్రవేత్త... అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే గగన్‌యాన్ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ వి.ఆర్. లలితాంబిక. ఉపగ్రహ ప్రయోగాల్లో 30 ఏళ్ల అనుభవమున్న ఈ శాస్త్రవేత్త గతేడాది ఒకే రాకెట్ ద్వారా 104 రాకెట్ల ప్రయోగంలోనూ కీలకపాత్ర పోషించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తన తాత స్ఫూర్తితో ఇస్రోలో చేరానని, తిరువనంతపురంలో ఇస్రో తొలి సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని పసిపిల్లగా చూసిన తాను సైన్స్పట్ల ఆసక్తి పెంచుకుని ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు లలితాంబిక చెబుతారు. పది వేల కోట్ల రూపాయలు పోసి అంతరిక్షంలోకి మనుషులను పంపడం అవసరమా? అని ప్రశ్నిస్తే కచ్చితంగా అవసరమేనని.. అంతరిక్ష ప్రయోగాలను శాంతియుత, సామాజిక ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత్ ఉద్దేశాలకు తగ్గట్లుగానే ఇది కూడా ఉంటుందని ఆమె వివరించారు. జీఎస్ఎల్వీనే ఎందుకంటే? ఇస్రో అత్యంత విజయవంతంగా ప్రయోగించిన రాకెట్లలో ముందు వరసలో నిలిచేది పీఎస్ఎల్వీనే. అయితే వాటి సామర్థ్యం తక్కువ. అంటే ఇవి మోసుకెళ్లగల బరువు గరిష్టంగా రెండు టన్నులు మాత్రమే. భూ ఉపరితలం నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఇవి తిరగ్గలవు. ఈ కారణం వల్లే గగన్‌యాన్‌లో జీఎస్ఎల్వీని ఉపయోగిస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 విషయాన్నే తీసుకుంటే దీని ద్వారా ఐదు నుంచి ఆరు టన్నుల బరువును అంతరిక్షంలోకి చేర్చవచ్చు. ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లే రాకెట్, అంతరిక్షంలో వారం రోజులు గడిపేందుకు ఉపయోగించే మాడ్యూల్ల బరువు 7.8 టన్నులు ఉంటుందని అంచనా. క్రయోజెనిక్ ఇంజిన్లతో కూడిన జీఎస్ఎల్వీని తొలిసారి 2014 డిసెంబర్లో విజయవంతంగా ప్రయోగించగా మూడో ప్రయోగం ఈ నెలలోనే పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గగన్‌యాన్ కూడా సక్సెస్ అవుతుందనే అంచనా. పూర్తయినవి ఇవీ.. గగన్‌యాన్ కోసం ఇస్రో ఇప్పటికే బోలెడన్ని టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. 2014లో జీఎస్ఎల్వీ ప్రయోగం సందర్భంగా ఇస్రో వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మాడ్యూల్ అట్మాస్ఫరిక్ రీ ఎంట్రీ ఎక్స్పరిమెంట్ (కేర్) భూమికి 126 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి తిరిగి వచ్చింది. అండమాన్ నికోబార్ ద్వీపాల సమీపంలో సముద్రంలో పడిపోయిన ఈ మాడ్యూల్‌ను కోస్ట్‌గార్డ్ సిబ్బంది రికవర్ చేయగలిగారు. దీన్నే 2022లో జరిగే గగన్‌యాన్‌లోనూ వాడతారని అంచనా. రాకెట్ ప్రయోగం సందర్భంగా అనుకోని అవాంతరం ఏర్పడితే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు కూడా ఇస్రో ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసింది. అత్యవసర పరిస్థితుల్లో క్రూ మాడ్యూల్‌ను సురక్షిత దూరానికి తీసుకెళ్లడం.. కొంత సమయం తరువాత పారాచూట్ల సాయంతో ల్యాండ్ కావడం దీని ప్రత్యేకత. ఈ ఏడాది జూలైలో ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. క్రూ మాడ్యూల్ లోపల భూమిని పోలిన వాతావరణం ఉండేలా చూసేందుకు ఇస్రో సిద్ధం చేసిన వ్యవస్థ డిజైనింగ్ ఇప్పటికే పూర్తికాగా త్వరలో పరీక్షించనున్నారు. వ్యోమగాముల శిక్షణ కోసం బెంగళూరులో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో ఆలోచించినా ఇప్పటివరకూ ఈ దిశగా జరిగింది కొంతే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నింగిలోకి సగర్వంగా...
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత వాయుసేనకు విశేష సమాచార సేవలందించేందుకు ఉద్దేశించిన జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ రంగానికి సాంకేతికంగా కీలకమైన ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్–11 రాకెట్ ద్వారా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో షార్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం నింగిలోకి పంపింది. 19 నిమిషాల 20 సెకన్లలో ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. ఇస్రోకు ఈ ఏడాదిలో ఇది ఏడో విజయం కాగా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన వాటిలో 69వ విజయవంతమైన ప్రయోగం. 2,250 కిలోల బరువు కలిగిన మిలటరీ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఈ జీశాట్–7ఏ. క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో పరిపూర్ణత సాధించి ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని అంతరిక్ష ప్రయోగాలు చేసే శక్తిగా ఎదిగిందని మరోసారి నిరూపించారు. 18 ఏళ్లు కఠోర శ్రమ ఫలితమే ఇస్రో 18 ఏళ్లు కఠోరశ్రమ ఫలితమే తాజా వరుస విజయాలకు బాటవేసిందని చెప్పొచ్చు. సాయంత్రం 4.10 గంటలకు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పెద్ద శబ్దంతో జీఎస్ఎల్వీ ఎఫ్–11 రాకెట్ నిప్పులు చిమ్ముతూ జీశాట్–7ఏను మోసుకుని నింగికేగింది. ఒక్కొక్క దశ విజయవంతంగా ప్రయాణం సాగిస్తుంటే మిషన్ కంట్రోల్ సెంటర్లోని శాస్త్రవేతల ముఖాల్లో విజయగర్వం తొణికిసలాడింది. రాకెట్‌కు మొదటి దశలో నాలుగు వైపులా అమర్చిన నాలుగు ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లతో పాటు కోర్ అలోన్ దశ విజయవంతంగా పనిచేసింది. రెండు, మూడు దశలు కూడా సమర్థవంతంగా పనిచేయడంతో ఈ భారీ ప్రయోగాన్ని సునాయాసంగా నిర్వహించారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసి మూడో దశలో అమర్చిన 14,996 టన్నుల క్రయోజనిక్ ఇంజిన్ల సాయంతో రాకెట్ శిఖరభాగంలో అమర్చిన జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని 19.20 నిమిషాలకు నిర్దేశిత సమయంలో నిర్ణీత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో 3.5 టన్నుల నుంచి 5 టన్నుల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలతోపాటు చంద్రయాన్–2 ప్రయోగంలో రోవర్‌ను, ల్యాండర్‌ను, అలాగే స్పేస్ షటిల్ ప్రోగ్రాంలో భాగంగా మానవుడిని అంతరిక్షంలోకి పంపేందుకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ (ఉపగ్రహాల నియంత్రణా కేంద్రం) వారు దానిని తమ అధీనంలోకి తీసుకుని, అంతా సవ్యంగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. 2019లో 32 మిషన్లు లక్ష్యం: శివన్ ప్రయోగం విజయానంతరం మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తల కఠోర శ్రమ ఫలించిదన్నారు. ఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే జీఎస్ఎల్వీ ప్రయోగాలు మాత్రం ఎవరెస్ట్ అంత ఎత్తు అని శివన్ అన్నారు. సమాచార ఉపగ్రహాలను మనం పంపుకోవడమే కాకుండా విదేశాలకు చెందిన భారీ ఉపగ్రహాలను పంపేస్థాయికి ఎదిగామని విజయగర్వంతో చెప్పారు. ఇస్రో 2019 ఏడాదిలో 32 మిషన్లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2019 ప్రథమార్ధంలో చంద్రయాన్–2 ప్రయోగం చేపడతామన్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎప్పుడు లేని విధంగా జీఎస్ఎల్వీ ఎఫ్11 రాకెట్‌లోని రెండోదశలోని ద్రవ ఇంధనాన్ని 2.5 టన్నులు పెంచడంతో ఆ దశ సక్సెస్ అయ్యిందన్నారు. తర్వాత క్రయోజనిక్ దశలో 3 టన్నులు ఇంధనం పెంచడంతో ఈ దశ కూడా విజయవంతం అయ్యిందన్నారు. ఈ రెండు ప్రత్యేకతలను ఒకే ప్రయోగంలో సాధించామని గర్వంగా చెప్పారు. 35 రోజుల్లో 3 ప్రయోగాలు సైతం ఇస్రో చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం భరత జాతికి కొత్త ఏడాదికి కానుక అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్, సీఎం అభినందనలు జీఎస్ఎల్వీ ఎఫ్–11 రాకెట్లో పంపిన జీశాట్–7ఏ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్తవేత్తల బందానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్తవేత్తలు పనితీరు దేశానికి గర్వకారణమని వారు కొనియాడారు. శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు జీశాట్–7ఏను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుతమైన విజయాలను ఇస్రో సాధించాలని ఆయన ఆకాంక్షించారు. వాయుసేనకు అండదండ జీశాట్–7ఏ బరువు: 2,250 కేజీలు ఉపగ్రహ జీవితకాలం: 8 ఏళ్లు వ్యయం: రూ.500–800 కోట్లు ట్రాన్స్పాండర్లు: కేయూ బ్యాండ్. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అతిచిన్న యాంటెన్నాతోనైనా సిగ్నల్స్‌ను గ్రహిస్తాయి. ఇతర బ్యాండ్లతో పోల్చి చూస్తే విస్తృతమైన కవరేజ్ ఉంటుంది. వర్షాలు, ఇతర వాతావరణమార్పుల్ని బాగా తట్టుకోగలవు. బెంగళూరు: ఇస్రో ప్రయోగించిన జీశాట్–7ఏ ఉపగ్రహంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జీశాట్–7ఏని ప్రత్యేకంగా భారతీయ వైమానిక దళ, ఆర్మీ అవసరాల కోసమే రూపొందించారు. వాయుసేనకు చెందిన రాడార్ స్టేషన్లు, వైమానిక స్థావరాలను ఈ ఉపగ్రహానికి అనుసంధానిస్తారు. తద్వారా కదనరంగంలో భారత వైమానిక దళ సామర్థ్యం పెరుగుతుంది. సమాచార సరఫరా వేగవంతం అవుతుంది. ఎంతో దూరంలో ఉండే ప్రత్యర్థుల విమానాలను కూడా గుర్తించడానికి వీలు కలుగుతుంది. యుద్ధ విమానాల పర్యవేక్షణ కూడా ఈ ఉపగ్రహం సాయంతో చేయవచ్చు. రాడార్ల కంటే అత్యంత శక్తిమంతమైన సిగ్నల్స్‌ను కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్ ద్వారా ఈ ఉపగ్రహం అందిస్తుంది. దీంతో గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరమవుతుంది. డ్రోన్ల పనితీరు సులభం జీశాట్–7ఏతో వాయుసేనలో డ్రోన్ల నిర్వహణ సులభమవనుంది. యూఏవీ (గాలిలో ఎగిరే మానవరహిత వాహనం)లను భూస్థావరం నుంచి కాకుండా ఉపగ్రహం ద్వారా నియంత్రించవచ్చు. డ్రోన్లు ఎప్పటికప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి సమాచారం పంపడానికి సాయపడుతుంది. అమెరికా నుంచి సముద్ర గస్తీ డ్రోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్న తరుణంలో జీశాట్–7ఏ ఉపగ్రహంతో వాటి పనితీరు మరింత సులభం కానుంది. అత్యంత ఎత్తులో ప్రయాణించే డ్రోన్లు సుదూరం నుంచి కూడా నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించగలవు. గతంలో రుక్మిణి ప్రయోగం 2013లో ఇస్రో జీశాట్–7ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని రుక్మిణి అని పిలుస్తారు. ఈ రుక్మిణి హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావికాదళ కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగపడింది. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, సముద్ర తీర గస్తీ విమానాల కదలికలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని రుక్మిణి ఉపగ్రహం ద్వారా తెలుసుకునే వీలు కలిగింది. ఇప్పుడు రుక్మిణిని మరింత అధునీకరించి జీశాట్–7ఏను ప్రయోగించారు. ఇందులో ఏ అంటే అడ్వాన్స్డ్ అని అర్థం. జీశాట్–7ఏతో వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు రానున్నాయి. మరికొన్నేళ్లలో జీశాట్–7సీ ఉపగ్రహాన్ని ప్రయోగించి నెట్వర్క్ ఆపరేషన్లను బలోపేతం చేయడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలో 320 మిలటరీ ఉపగ్రహాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 320 మిలటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో సగం అమెరికాకు చెందినవే. ఆ తరవాత అత్యధిక సైనిక ఉపగ్రహాలు కలిగిన దేశాల్లో రష్యా, చైనా ఉన్నాయి. ఈ విషయంలో చైనాయే మనకి అతి పెద్ద శత్రువు. సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎన్నో ఉపగ్రహాల్ని చైనా ప్రయోగించింది. చివరికి యాంటీ శాటిలైట్ ఆయుధాలు.. అంటే ఉపగ్రహాల్నే కూల్చే ఆయుధాల్ని కూడా పరీక్షించింది. భారత్‌కు ఇప్పటివరకు 13 మిలటరీ ఉపగ్రహాలే ఉన్నాయి. భూమిపై నిఘా, యుద్ధనౌకలకు దిక్సూచి, కమ్యూనికేషన్లకి ఉపయోగపడుతున్నాయి. మిలటరీ ఉపగ్రహాల సహకారంతోనే పాకిస్తాన్‌పై లక్షిత మెరుపుదాడుల సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయగలిగాం. ఉపయోగాలివీ... సమాచార ఉపగ్రహాల్లో జీశాట్–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. సమాచార ఉపగ్రహాలను ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. ఈసారి మాత్రం పూర్తిగా వాయుసేన, ఆర్మీ కోసం దీనిని ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలో కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో అభివృద్ధి చేశారు. శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును కనిపెడుతుంది. మిలటరీకి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఇప్పటిదాకా పంపిన 35 సమాచార ఉపగ్రహాల్లోకెల్లా ఇది ప్రత్యేకమైనది. మిలటరీ, ఎయిర్‌ఫోర్స్ అవసరాల కోసమే దీన్ని రూపొందించినట్టు ఇస్రో ప్రకటించింది. -
నింగిలోకి ఎగిసిన జీశాట్-7ఏ ఉపగ్రహం
-
జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 ప్రయోగం విజయవంతం
సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): వరుస ప్రయోగాలు, విజయాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దూసుకెళ్తోంది. నెల రోజుల వ్యవధిలోనే చేపట్టిన మూడు ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. సమాచార వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన జీశాట్-7ఏ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. దీంతో ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు విమానయాన వ్యవస్థకు సేవలు అందించనుంది. భారత కాలమాన ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్11) ప్రయోగించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జీఎస్ఎల్వీ వెహికల్ నింగిలోకి దూసుకెళ్లింది. 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లింది. అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–7ఏ: కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్–7ఏ మాత్రం అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్ ట్రాన్స్పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో రూపొందించారు. సిబ్బంది, శాస్త్రవేత్తల అంకితభావంతోనే విజయాలు సిబ్బంది సమష్టి కృషి వల్లే జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 ప్రయోగతం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ కె శివన్ పేర్కొన్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ప్రయోగించిన జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్11) విజయవంతం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజుల నుంచి వాతావరణం అనుకూలించకపోయినా సిబ్బంది, శాస్త్రవేత్తలు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. శ్రీహరికోట నుంచి 35 రోజుల్లో మూడు ప్రయోగాల విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాదిని ఇస్రో విజవంతంగా ముగించిందని, వచ్చే ఏడాది మరిన్ని ప్రయోగాలు చేస్తామని శివన్ తెలిపారు. వైఎస్ జగన్ అభినందనలు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. జీఎస్ఎల్వీ–ఎఫ్11 ప్రయోగం విజయవంతమవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేపట్టి దేశాభివృద్దికి కృషి చేయాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
నేడు నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్11
-
జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్11) ప్రయోగించనున్నారు. మంగళవారం ఉదయాన్నే సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి వద్ద పూజలు చేయించుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాకెట్‌లోని రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మంగళవారం రాత్రి చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. 26 గంటల కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం సాయంత్రం 4.10 గంటలకు 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లేందుకు షార్‌లోని రెండో ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–7ఏ: కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్–7ఏ మాత్రం అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్ ట్రాన్స్పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో రూపొందించారు. -
చీకట్లను చీల్చుకుంటూ....
దేశమంతా చీకట్లు కమ్ముకుంటున్న వేళ, నా సమయమైందే అని చంద్రుడు ఎదురొస్తున్న వేళ బంగారు వర్ణపు నిప్పులు కక్కుతూ జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్న వేళ తీసిన అపురూప సుందర చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. చంద్రుడికి అభిముఖంగా జీఎస్ఎల్వీ దూసుపోతున్న ఫొటోను చూసి కుంచెపై గీచిన చిత్రంలా అందంగా ఉందంటూ నెటిజన్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ద్వారా జీశాట్–29 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్–29లో కేఏ, కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజల ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ రాకెట్ 43.43 మీటర్ల పొడవుతో 640 టన్నుల బరువుంటుంది. జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారి ఆలయంలో రాకెట్ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి శివన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
సూపర్ సిక్సర్
డిజిటల్ ఇండియాదే! ఇస్రో సూపర్ సిక్సర్ కొట్టింది. రెండు దశాబ్దాలుగా అవిరళ కృషితో ఐదు జీఎస్ఎల్వీలను విజయవంతంగా నింగిలోకి పంపిన శాస్త్రవేత్తలు విజయగర్వంతో ఆరో ప్రయోగాన్ని సఫలీకృతం చేశారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్3 డీ2 ప్రయోగం విజయవంతం కావడంతో డిజిటల్ ఇండియా ఆవిష్కృతానికి కీలక అడుగు వేసినట్టయింది. అత్యాధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారత సైనిక అవసరాలకు కూడా దోహదపడుతుంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ అండ్ కశ్మీర్ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని అనుసంధానం చేస్తుంది. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. జయహో ఇస్రో. నెల్లూరు ,సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్న రాకెట్ల ద్వారా అత్యంత తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాల నుంచి పెద్ద ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టి దేశ ప్రజలకు అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా నిరంతరాయంగా కృషి చేస్తోంది. జీఎస్ఎల్వీ రాకెట్‌కు సంబం«ధించి మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశను దేశీయ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో రూపొందించే ప్రక్రియలో భాగంగా సాంకేతికపరమైన ఇబ్బందులన్నీ ఎదుర్కొని పరిపక్వతను సాధించారు. మామూలు జీఎస్ఎల్వీ రాకెట్‌లోని మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అదే జీఎస్ఎల్వీ మార్క్–3 తరహా రాకెట్లో 25 టన్నుల క్రయో ఇంధనం అవసరమవుతుంది. దీన్ని రూపొందించేందుకు కొంత కాలం సమయం తీసుకుంది. వరుసగా ఐదు జీఎస్ఎల్వీ రాకెట్లు విజయవంతం చేయడంతో పాటు బుధవారం నాటి జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ప్రయోగంలో సీ–25 అద్భుతంగా పని చేయడంతో క్రయోజనిక్ టెక్నాలజీలో పరిపక్వతను సాధించారు. సౌండింగ్ రాకెట్ల స్థాయి నుంచి ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ల స్థాయికి ఎదిగి, 40 కిలోల ఉపగ్రహం నుంచి అంచెలంచెలుగా 3,500 కిలోల బరువు కలిగిన భారీ ఉపగ్రహం జీశాట్–29 ప్రయోగించి విజయం సాధించడంతో అగ్రదేశాలతో సమాన స్థాయిలో నిలిచింది. సమాచారం రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను దేశవాళికి అందించేందుకు అత్యంత బరువైన సమాచార ఉపగ్రహలను పంపేందుకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడుతోంది. ఇందులో భాగంగా 2 వేల నుంచి 5 వేల కిలోల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచి అంతరిక్ష పరిశోధనా సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి వాళ్ల రాకెట్ల ద్వారా కక్ష్యలోకి పంపిస్తూ వచ్చారు. ఇక నుంచి ఐదు టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా ఇక్కడి నుంచే పంపించే వెసులు బాటు కలిగింది. జీఎస్ఎల్వీ ప్రయోగాలకు అప్పర్ స్టేజీలో రష్యా దేశం సహకారంతో క్రయోజనిక్ ఇంజిన్లు ఉపయోగించి ఆరు ప్రయోగాలు చేశారు. జీఎస్ఎల్వీ డీ2 పేరుతో 2001 ఏప్రిల్ 18న మొట్ట మొదటి ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో 2 వేల కిలోల బరువు కలిగిన జీశాట్–01 సమాచారం ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. ఆరు ప్రయోగాలకు రష్యా దేశపు క్రయోజనిక్ ఇంజిన్లను వాడుకున్నారు. ఒక్క ప్రయోగానికి మాత్రం ఇస్రో శాస్త్రవేత్తలు సొంతంగా తయారు చేసిన క్రయోదశను ఉపయోగించగా దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. 2010 ఏప్రిల్ 15న జీఎస్ఎల్వీ డీ3 ప్రయోగంలో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్లుతో చేసిన ప్రయోగం ఘోర పరాజయం పాలైంది. మళ్లీ అదే ఏడాది డిసెంబర్ 25న రష్యా సాంకేతిక సహకారంతో కొనుగోలు చేసిన క్రయోజనిక్ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం కూడా ఘోర పరాజయం పాలైంది. దీంతో రెండేళ్లు జీఎస్ఎల్వీ ప్రయోగాల జోలికే పోలేదు. 2001 నుంచి 2010 వరకు చేసిన ఏడు ప్రయోగాల్లో నాలుగు ప్రయోగాలు విజయవంతం కాగా మూడు ప్రయోగాలు అపజయం పాలయ్యాయి. ఈ ఇంజిన్‌లో ఉపయోగించే లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనం మైనస్ 220, 270 డిగ్రీల అతి శీతలమైన వాతావరణంలో తయారు చేయాల్సి ఉండడంతో ఇందులో బాలారిష్టాలను దాటేందుకు మన శాస్త్రవేత్తలు అవిరళ కృషి చేశారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్లతో చేసిన ఐదు ప్రయోగాలు వరుసగా విజయాలనే నమోదు చేసుకున్నాయి. బుధవారం చేసిన జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ప్రయోగం కూడా విజయవంతం కావడంతో ఇస్రో తిరుగులేని శక్తిగా మారింది. జీఎస్ఎల్వీ మార్క్–3డీ1, డీ2 రాకెట్లు వరుసగా పూర్తి స్థాయిలో విజయం సాధించడం, ఎస్–200, ఎల్–110, సీ–25 దశలన్నీ అద్భుతంగా పనిచేయడంతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుని అంతరిక్ష విజయాల వినువీధిలో విజయకేతనం ఎగుర వేశారు. ఇక నుంచి అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాలను ఇతర దేశాల మీద ఆధార పడకుం డా మనమే పంపించడమే కాకుండా మానవ సహితయాత్ర చేసే అంతరిక్ష దేశంగాభారత్ ఆవిర్భవించనుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. సూళ్లూరుపేట: భారత అంతరిక పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్థానంలో బుధవారం సాయంత్రం 5,08 గంటలకు నిర్వహించిన జీఎస్ఎల్వీ మార్క్3డీ2 ప్రయోగం చరిత్రాత్మకమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు అన్నారు. ఈ ప్రయోగంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఉద్యోగులు పాత్ర ఉన్నప్పటికీ ముఖ్యంగా కొద్దిమంది శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రయోగం జరిగింది. ఇస్రో చరిత్రలో రెండో సారి అతి భారీ ప్రయోగాన్ని నిర్వహించి గ ‘ఘన’ విజయం సాధించిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరేమన్నారంటే.. ఇస్రోకు చరిత్రాత్మకమైన విజయం ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. ఇస్రో చరిత్రలో అతి పెద్ద ప్రయోగాన్ని చేపట్టి తొలిప్రయత్నంలోనే రెండు భారీ విజయాలను సాధించినందుకు ఇస్రో టీంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జీఎస్ఎల్వీ మార్క్3డీ2 విజయంలో ప్రముఖపాత్ర పోషించిన క్రయోజనిక్ దశ అత్యంత అద్భుతంగా పనిచేయడంతో పాటు ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు, ఎల్–110 ద్రవ ఇంధనం దశలు అత్యంత సమర్థవంతంగా పనిచేయడంతో మార్వ్‌లెస్ ప్రయోగంగా అభివర్ణించారు. ఈ విజయం ఇస్రోలో పనిచేస్తున్న అందరికి దక్కుంతుంది. – డాక్టర్ కైలాసవాడివో శివన్, ఇస్రో చైర్మన్ ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం ఇస్రో చరిత్రలో బుధవారం నిర్వహించిన జీశాట్–29 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించాం. రాకెట్‌లోని అన్ని దశలు అత్యంత అద్భుతంగా పనిచేయడంతో ఇంత గొప్ప విజయం. సాధించిగలిగాం. ఈ విజయం షార్‌లో పనిచేసిన అందరికీ దక్కుతుంది. దేశంలోని అన్ని ఇస్రో సెంటర్లు కలిసి కట్టుగా 18 ఏళ్లు శ్రమించి చేసిన పరిశోధనలు ఫలించి రెండు భారీ ప్రయోగాలను వరుసగా విజయం సాధించినందుకు సంతోషంగా వుంది.– ఎస్ పాండ్యన్, షార్ డైరెక్టర్ రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేశాయి జీఎస్ఎల్వీ మార్క్3డీ2 రాకెట్లో ఎస్–200, ఎల్–110, సీ–25 దశలు అద్భుతంగా పని చేయడంతో ఇస్రో చరిత్రలో తిరుగులేని విజయాన్ని సాధించాం. ఇన్ని రోజులు సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం మనం ప్రపంచం వైపు చూశాం. ఈ ప్రయోగంతో ప్రపంచమే మన వైపు చూడడం ప్రారంభించింది. వెహికల్ ముందుగా నిర్ణయించిన మేరకు సక్రమంగా పని చేసింది. 3,423 కిలోల బరువు కలిగిన అతిపెద్ద ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టి చరిత్రను సృష్టించాం.– బీ జయకుమార్, వెహికల్ డైరెక్టర్ చరిత్రలో నిలిచిపోయే విజయమిది చరిత్రలో నిలిచిపోయే విజయమిది. రాకెట్ సంబం«ధించిన అన్ని దశలను వీఎస్ఎస్సీలోనే రూపొందించాం. ఇస్రో చరిత్రలో అతిపెద్ద ప్రయోగాన్ని నిర్వహించి చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పని చేశాయి. నిర్ణీత సమయానికే జీశాట్ 29 ఉపగ్రహా అత్యంత జాగ్రత్తగా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశ పెట్టగలిగాం. భవిష్యత్ తరాలకు అత్యంత ఆధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు అడ్వాన్స్డ్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీశాట్ 29 ఉపగ్రహాన్ని అందుబాటులోకి తెచ్చాము. దీంతో క్రయోజనిక్ టెక్నాలజీలో పూర్తి సాంకేతిక పరమైన పరిపక్వతను సాధించాము. రాకెట్ విడిభాగాలు అందించడంలో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యాన్ని అయన అభినందించారు.– ఎస్ సోమనాథ్. వీఎస్ఎస్సీ డైరెక్టర్ చరిత్రలో నిలిచిపోయిన రోజు ఇది జీఎస్ఎల్వీ మార్క్3డీ2 ప్రయోగ విజయం చరిత్రలో నిలిచిపోయిన రోజు ఇది. అత్యంత బరువు కలిగిన జీశాట్ 29 ఉపగ్రహాన్ని క్రయోజనిక్ దశ (సీ25) సునాయాసంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మార్క్–3 ప్రాజెక్ట్ కోసం పదిహేడేళ్లుగా శ్రమించాం. 2014 నుంచి క్రయోజనిక్ దశను రూపొందించేందుకు అనేక రకాలు ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో క్రయో ఇంజిన్లను తయారు చేసుకున్నాం. ఈ దశ ఎంతో సంక్లిష్టమైంది కావడంతో 2014 నుంచి అనేక రకాలుగా భూస్థిర పరీక్షలు చేసి సామర్థ్యాన్ని నిర్థారించుకున్నాక పూర్తిస్థాయి ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఈ రాకెట్‌కు సంబంధించి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించుకున్నాం.– టీ మూకయ్య, ఐపీఆర్సీ డైరెక్టర్ ఉపగ్రహాన్ని అత్యంత అధునాతనంగా తయారు చేశాం బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలోని ఉపగ్రహాన్ని తయారు చేశాం. ఇస్రో చరిత్రలో ఇదే అతి పెద్ద ఉపగ్రహం కావడం విశేషం. ఈ ఉపగ్రహంలో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను అమర్చి పంపాం. ఈ పేలోడ్స్‌తో దేశంలో మారుమూల గ్రామాల్లో ఇంటర్కెట్ కనెక్టివిటిని అనుసంధానం చేసేందుకు ఉపకరిస్తుంది. -
ఇస్రో విజయపరంపరలో తాజా కలికితురాయి!
చంద్రయాన్–2కు, అంతరిక్ష మానవ సహిత ప్రయోగాలకు అందివస్తుందని భావిస్తున్న జీఎస్ ఎల్వీ మార్క్3–డీ2 రాకెట్ ద్వారా బుధవారం మన శాస్త్రవేత్తలు జీ శాట్–29 భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. గగనవీధుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నమోదు చేసుకుంటున్న విజయ పరంపరలో తాజా ప్రయోగం కలికితురాయి అని చెప్పాలి. అంతా ముందనుకున్నట్టే సాయంత్రం 5–08 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం లోని ప్రయోగవేదిక నుంచి మార్క్3–డీ2 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్ డౌన్ పూర్తయి రాకెట్ నిప్పులు చిమ్మడం మొదలైన దగ్గరనుంచి నిర్దేశిత కక్ష్యకు ఉపగ్రహం చేరు కోవడం వరకూ చూస్తే... మొత్తం 16 నిమిషాల 43.5 సెకన్ల సమయం పట్టింది. ప్రయోగం విజయ వంతమయ్యాక ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ చెప్పినట్టు ఇన్నాళ్లూ చేసిన ప్రయోగాలతో పోలిస్తే ఇది నిస్సందేహంగా ఎవరెస్టు శిఖరం వంటిది. చాలామంది దీన్ని ‘బాహుబలి’గా అభివర్ణించారు కూడా. రాకెట్ మొదటి దశకు రెండువైపులా 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్లుంటే, రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధన బూస్టర్లున్నాయి. మూడో దశ కోసం 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం బూస్టర్‌ను వాడారు. ఈ మూడూ శాస్త్రవేత్తలిచ్చిన కమాండ్లకు అనుగుణంగా సక్రమంగా పనిచేసి వారిలో ఆత్మసై్థర్యాన్ని నింపాయి. ఇస్రో ఈ ఏడాది చేసిన వరస ప్రయోగాల్లో ఇది అయిదవది. మార్క్3 రాకెట్‌ను ఉపయోగించడం ఇది రెండోసారి. 2014 జూన్‌లో మార్క్ 3 రాకెట్ద్వారా జీశాట్–19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. చెన్నై–శ్రీహరికోట మధ్య తీరం దాటుతుందని అంచనావేసిన పెను తుపాను ‘గజ’ దారి మార్చుకోవడంతో అనుకున్న సమయానికే ప్రయోగం సాధ్యపడింది. మన శాస్త్రవేత్తలకు పీఎస్ఎల్వీ రాకెట్ మాదిరి జీఎస్ఎల్వీ చాన్నాళ్లు కొరుకుడు పడలేదు. జీఎస్ఎల్వీని ప్రయోగించినప్పుడల్లా వైఫల్యాలే ఎదురయ్యాయి. కానీ రెండు దశాబ్దాలపాటు ఆ రాకెట్ విషయంలో అకుంఠిత దీక్ష బూని పనిచేయడం ఫలితంగా అది సైతం పట్టుబడింది. ప్రయోగం విఫలమైనప్పుడల్లా కూలంకషంగా అధ్యయనం చేసి సూక్ష్మ స్థాయిలో జరిగిన పొర పాట్లను సైతం గుర్తించడం, డిజైన్‌లో దానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేసుకోవడం, మళ్లీ ప్రయోగానికి సిద్ధపడటం విడవకుండా కొనసాగింది. ఒక దశలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొం దించిన ఇంజిన్ విఫలం కాగా, మరో దశలో రష్యా తయారీ ఇంజిన్ సైతం మొరాయించింది. కానీ మన శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేశారు. విసుగూ, విరామం లేకుండా శ్రమిం చారు. ఫలితంగా జీఎస్ఎల్వీ కూడా సులభగ్రాహ్యమైంది. సుదూర కక్ష్యల్లోకి అధిక బరువుండే ఉప గ్రహాలను పంపాలంటే క్రయోజెనిక్ సాంకేతికతను వినియోగించే జీఎస్ఎల్వీ ఆసరా తప్పనిసరి. జీఎస్ఎల్వీలో మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని, మూడో దశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని వినియోగించాల్సివస్తుంది. మొదటి రెండు దశల విషయంలో శాస్త్రవేత్త లకు ఎప్పుడూ సమస్యలేదు. మూడోదైన క్రయోజెనిక్ సాంకేతికతే చాన్నాళ్లు ఇబ్బంది పెట్టింది. ఇందులో వాడే హైడ్రోజన్‌నూ, దాన్ని మండించడానికి ఉపయోగించే ఆక్సిజన్‌ను ద్రవరూపంలోకి మార్చడం సాధారణమైన పని కాదు. అందుకోసం ఆ రెండు ఇంధనాలనూ నిర్దిష్ట స్థాయికి శీతలీ కరించాలి. ఈ క్రమంలో ఎక్కడ లోపం జరిగినా ఆ రెండు ఇంధనాలూ నేరుగా వాయు రూపంలోకి మారిపోతాయి. పైగా హైడ్రోజన్ ద్రవరూపంలోకి మారాలంటే మైనస్ 253 డిగ్రీల సెల్సియస్ వద్ద, ఆక్సిజెన్ ద్రవరూపంలోకి మారడానికి మైనస్ 183 డిగ్రీల వద్ద ఉండాలి. ఇందుకు తగినట్టుగా ఇంజిన్‌లోని పరికరాలు, పైపులూ శీతల స్థితిలో ఉండాలి. అడుగడుగునా ఎదురయ్యే ఈ సవాళ్లను అధిగమించే మార్గంలో ఎన్నో అడ్డంకులు! ఈ సాంకేతికతను ఇవ్వడంపై అమెరికా ఆంక్షలు విధిం చగా, రష్యా అత్యధిక మొత్తాన్ని డిమాండు చేసింది. కనుకనే ఇందుకోసం దేశీయ సాంకేతి కతను అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరని మన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతటి అపారమైన కృషి వల్లనే జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ప్రయోగం విజయవంతమైంది. పదేళ్లపాటు సేవలందించగల జీశాట్–29లో అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోకి రాగలిగేందుకు అనువైన ఉపకరణాలను అమర్చారు. ప్రపంచంలో మరే దేశమూ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఈ మాదిరి ఉపకరణాలు ఇంతవరకూ వినియోగించలేదు. దేశంలోని మారుమూల పల్లెల్లో ఉండే వనరులు, అక్కడుండే సదుపాయాలు సులభంగా తెలుసుకోవడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ, ఇటు జమ్మూ–కశ్మీర్‌లోనూ మూల మూలలకూ ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకొస్తాయి. ఈ ఉపగ్రహంలోని ఆప్టికల్ కమ్యూ నికేషన్ పేలోడ్ వల్ల డేటా బదిలీ అత్యంత వేగవంతంగా ఉండగలదని చెబుతున్నారు. ఈ ప్రయో గానికి వినియోగించిన జీఎస్ఎల్వీ మార్క్3–డీ2 రాకెట్ రకాన్నే వచ్చే జనవరిలో చంద్రయాన్–2 ప్రయోగానికీ, 2022లో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమానికీ వినియోగించాలని భావిస్తున్నారు. మొత్తానికి అంతరిక్ష రంగంలో గుత్తాధిపత్యాన్ని నెరపాలన్న అగ్రరాజ్యాల కలను మన శాస్త్రవేత్తలు చెదరగొట్టారు. ఈ వరస విజయాలు వాణిజ్యపరంగా కూడా దేశానికి లాభదా యకమవుతాయి. మన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రూపొందే రాకెట్లు, ఉపగ్రహాలు, వాటిల్లో విని యోగించే ట్రాన్స్పాండర్లు, ఇతర పరికరాలు అంతర్జాతీయంగా విశ్వసనీయతను సాధించాయి. పైగా అగ్రరాజ్యాలతో పోలిస్తే రాకెట్ ప్రయోగాల వ్యయం చాలా తక్కువ అవుతోంది. అందువల్లే అంతరిక్ష రంగంలో భారత్ సేవలు వినియోగించుకోవడానికి పలు దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరికొన్ని ప్రయోగాల తర్వాత మార్క్3 కూడా అరియాన్, అట్లాస్ తరహాలో వాణిజ్యపరమైన రాకెట్‌గా రూపుదిద్దుకోవడం ఖాయం. -
మిషన్ హీలియం–3
సూళ్లూరుపేట: అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో బృహత్తర మిషన్‌కు సిద్ధమైంది. చంద్రుడిపై అన్వేషణకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే ఇప్పటి వరకు చేసిన పరిశోధనలన్నీ చంద్రుడి మధ్యరేఖపై మాత్రమే జరిగాయి. చంద్రగోళంలోని దక్షిణ భాగంలోకి ఇంత వరకూ ఏ దేశం వెళ్లిన దాఖలా లేదు. జాబిల్లి దక్షిణ భాగంలో లక్షలాది కోట్ల విలువైన హీలియం–3 అనే ఇంధన వనరుపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో చేపట్టబోయే చంద్రయాన్–2 ప్రయోగాన్ని వినియోగించుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఇస్రో చంద్రుడి దక్షిణ భాగంలో ఒక రోవర్‌ను దించనుంది. ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపై నమూనాలను సేకరించి హీలియం–3, నీటి జాడను అన్వేషిస్తుంది. భూమిపై పరిమితంగా లభ్యమయ్యే హీలియం–3 ఐసోటోప్ చంద్రుడిపై పుష్కలంగా ఉందని ఇటీవల పలు పరిశోధనల్లో వెల్లడైంది. చంద్రయాన్–1 ద్వారా చంద్రుడిపై నీటి పరమాణువులున్న విషయాన్ని కనుగొన్న ఇస్రో..ఇప్పుడు చంద్రయాన్–2తో మరో అద్భుత విజయాన్ని అందుకోవాలనే ఆలోచనలో ఉంది. మూడు ప్రయోగాలతో సమానం.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్–2 ప్రయోగం చేపట్టాలని ఇస్రో ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించుకుంది. జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్10) ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మూడు పరికరాలను ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందించడం విశేషం. ఆర్బిటర్‌ను చంద్రుడి మధ్య కక్ష్యలో, ల్యాండర్, రోవర్‌ను దక్షిణ ధ్రువానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో దించుతారు. ఆరు చక్రాలతో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే రోవర్ హీలియం–3పై ప్రయోగాలు చేసి, ఆ సమాచారాన్ని అక్కడికక్కడే విశ్లేషిస్తుంది. కనీసం 14 రోజుల పాటు 400 మీటర్లు వ్యాసార్థం పరిధిలో పరిభ్రమిస్తూ సమాచారాన్ని సేకరిస్తుంది. రోవర్ నుంచి సమాచారం ఆర్బిటర్ ద్వారా మాస్టర్ కంట్రోల్ సెంటర్(భూకేంద్రం)కు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్క మిషన్ మూడు ప్రయోగాలకు సమానమని ఇస్రో పరిశోధకులు చెబుతున్నారు. -
క్రయోజనిక్ హాట్ టెస్ట్ విజయవంతం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ఏడాది డిసెంబర్లో ప్రయోగించబోయే జీఎస్ఎల్వీ ఎఫ్–11కు సంబంధించి క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెప్ట్ హాట్ టెస్ట్ విజయవంతంగా ముగిసింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కేంద్రంలో ఆగస్టు 27న చేపట్టిన ‘హాట్ టెస్ట్’ సక్సెస్ అయ్యిందని ఇస్రో శనివారం ప్రకటించింది. క్రయోజనిక్ ఇంజిన్‌ను సుమారు 200 సెకన్లపాటు పనిచేయించి పరీక్షించారు. జీఎస్ఎల్వీ రాకెట్‌కు సంబంధించి కీలకమైన క్రయోజనిక్ దశ అత్యంత సంక్లిష్ట పరిజ్ఞానంతో కూడుకున్నది కావడంతో ఈ దశలో ఎప్పటికప్పుడు నూతనంగా పలు పరీక్షలు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. -
ఆందోళనలో ఇస్రో..అసలేం ఏం జరిగింది?
-
శాటిలైట్‌తో లింక్ కట్; ఆందోళనలో ఇస్రో
న్యూఢిల్లీ: ఉపగ్రహ ప్రయోగాల్లో అనేక రికార్డులను సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల కిందట నింగిలోకి పంపిన జీశాట్-6ఏ ఉపగ్రహంతో సంబంధాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఇస్రో ప్రతినిధులు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. మార్చి 29న నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి పంపిన ఉపగ్రహం తొలిదశ విజయవంతంకాగా, తుది దశలో మాత్రం సాంకేతిక లోపాలు తలెత్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఉపగ్రహంతో లింక్ కోల్పోవడం ఆందోళనకరమే అయినా, సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఇస్రో తెలిపింది. అసలేం ఏం జరిగింది?: భారత సమాచార వ్యవస్థకు పదునుపెట్టే లక్ష్యంతో గత గురువారం ఇస్రో జీశాట్6–ఏ ప్రయోగాన్ని చేపట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్08) ఉపగ్రహ వాహకనౌక 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే మొదటి విడత కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు శుక్రవారం విజయవంతంగా పొడిగించారు. కాగా, శనివారం నాటికి అనూహ్య రీతిలో ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీతో ఉపగ్రహానికి సంబంధాలు తెగిపోయాయి. మరింతలోతుకు వెళితే..: జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 170 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. హసన్(కర్ణాటక)లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పెరిజీని 36 వేల కిలోమీటర్ల ఎత్తుకు పెంచే ప్రక్రియను దశల వారీగా చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం పెరిజీని 170 కిలో మీటర్ల నుంచి 5,054 కిలోమీటర్ల ఎత్తుకు, అపోజీని 35,975 కిలోమీటర్లు నుంచి 36,412 ఎత్తుకు పెంచారు. శనివారం.. చివరిదైన మూడో లామ్ ఇంజిన్‌ను మండించిన సమయంలోనే ఉపగ్రహంలో లోపాలు తలెత్తాయి. అప్పటి నుంచి జీశాట్6ఏ భూమితో అనుసంధానం కోల్పోయింది. -
నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్08
-
జీఎస్ఎల్వీ-ఎఫ్08 ప్రయోగం విజయవంతం
-
జీఎస్ఎల్వీ ఎఫ్–08 ప్రయోగం విజయవంతం
సాక్షి, నెల్లూరు : షార్ అంతరిక్షం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈరోజు సాయంత్రం 4.29 గంటలకు జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్08 రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-6ఏను ప్రయోగించింది. ప్రయోగం చేపట్టిన 17 నిమిషాల 46.50 సెకన్ల కాలంలో 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6ఏ ఉపగ్రహం చేరుకుంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ తోటి శాస్త్రవేత్తలను అభినందించారు. జీ ఉపగ్రహాల్ని జీఎస్ఎల్వీ వాహకనౌకల ద్వారా ప్రయోగించడం ఇది 12వ సారి కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్ అమర్చిన జీఎస్ఎల్వీని వినియోగించడం ఇది ఆరోసారి. జీఎస్ఎల్వీ-ఎఫ్ 08 పొడవు 49.1 మీటర్లు కాగా, బరువు 415.6 టన్నులు. శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ మరోవైపు జీఎస్ఎల్వీ-ఎఫ్08 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు. -
ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, నెల్లూరు : జీఎస్ఎల్వీ -ఎఫ్8 రాకెట్ ప్రయోగం విజవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ డా.శివన్ బుధవారం చెంగాల పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల పాటు కౌంట్‌డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 4 గంటల 56 నిమిషాలకు జీఎల్‌ఎస్‌వీ-ఎఫ్8 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్రవేత్తలతో డా. శివన్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది చివర్లో చంద్రయాన్-2 ప్రయోగం చేయాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగంచనున్నట్లు తెలిపారు. కాగా ఇస్రో చైర్మన్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. శివన్‌కు ఇది తొలి ప్రయోగం. -
నేడు జీఎస్ఎల్వీ ఎఫ్08 రాకెట్ కౌంట్‌డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురు వారం సాయంత్రం 4.56కు ప్రయో గించనున్న జీఎస్ఎల్వీ ఎఫ్08 బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారం భించేందుకు మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆ«ధ్వర్యంలో షార్‌లోని బ్రహ్మప్రకాశ్ హాల్లో మంగళవారం సమావేశం జరిగింది. 27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం సాయంత్రం 4.56 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించనున్నామని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్ఆర్ సమావేశం అనంతరం ప్రయోగ బాధ్యతలను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) చైర్మన్ పి.కున్హికృష్ణన్కు అప్పగించారు. బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. -
29న జీఎస్ఎల్వీ ఎఫ్08 ప్రయోగం
-
29న జీఎస్ఎల్వీ ఎఫ్08 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 29న సాయంత్రం 4.56 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్08 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ మొదలుకానుంది. ఈ ప్రయోగంలో 2,140 కిలోల బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. దీనిపై మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్ఆర్) చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రయోగతేదీని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. -
29న జీఎస్ఎల్వీ ఎఫ్–08 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరా ములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 29న సాయంత్రం 4.29 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–08 ప్రయోగా న్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. దీనికి సంబంధించి మంగళవారం 2,140 కిలోలు బరువు ఉన్న జీశాట్–6ఏ ఉపగ్రహాన్ని రాకెట్ శిఖరభాగాన అమర్చే పనులను పూర్తి చేశారు. 21, 22 తేదీల్లో రాకెట్‌కు గ్లోబల్ చెకింగ్ చేయనున్నారు. అనంతరం ఈ నెల 23 తేదీన ఉదయాన్నే జీఎస్ఎల్వీ ఎఫ్–08 రాకెట్‌ను అనుసందాన భవనం నుంచి ప్రయోగవేదిక వద్దకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. వారం రోజులపాటు అన్ని తనిఖీలు నిర్వహించి 29న ప్రయోగించడమే లక్ష్యం గా శాస్త్రవేత్తలు పనులు పూర్తి చేస్తున్నారు. -
మార్చి 15కు జీఎస్ఎల్వీ ఎఫ్–08 వాయిదా
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’నుంచి ఈ నెల 26న ప్రయోగించ తలపెట్టిన జీఎస్ఎల్వీ ఎఫ్–08 ప్రయోగం మార్చి 15వ తేదీకి వాయిదా పడింది. మార్చి 15న జీఎస్ఎల్వీ ఎఫ్–08, 22న పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగాలు చేసేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–08 రాకెట్ ద్వారా జీశాట్–6ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. అయితే, ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతో ఈ నెల 26న చేయాలనుకున్న ప్రయోగం మార్చికి వాయిదా పడింది. జీఎస్ఎల్వీ రాకెట్ రెండో దశ అనుసంధానం పనులు సోమవారం చేపట్టారు. 12 నుంచి పీఎస్ఎల్వీ సీ41 క్యాంపెయిన్ పనులు మరోవైపు.. ఈ నెల 12న మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ41 రాకెట్ క్యాంపెయిన్ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇదిలా ఉండగా మార్చి 10న వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్) నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–08 రాకెట్‌ను ఊంబ్లికల్ టవర్ మీదకు తరలించిన వెంటనే వ్యాబ్‌లో జీఎస్ఎల్వీ ఎఫ్10 రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారానే చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే ఏప్రిల్ రెండో వారంలో జీఎస్ఎల్వీ ఎఫ్10 ద్వారా చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేసేందుకు సమాయత్తమవుతున్నారు. -
2018లో చంద్రయాన్-2
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్ మిషన్.. చంద్రయాన్-2పై కేంద్ర అంతరిక్షం, అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. చంద్రయాన్-2 ప్రయోగం వచ్చే ఏడాది మార్చిలో ఉంటుందని ఆయన ప్రకటించారు. జీఎస్ఎల్వీ ఎంకే-2రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రాయోగాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచే ప్రయోగం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
ఇస్రో ‘బాహుబలి రాకెట్’ సెల్ఫీలు చూశారా..!
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రయోగాన్ని చేపట్టి విజయపతాకాన్ని ఎగరేసిన ఇస్రో ‘బాహుబలి’ రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1 రాకెట్ మరో అద్భుతం చేసింది. తాను నింగిలోకి దూసుకెళ్లే క్రమంలో టకటకా సెల్ఫీలు తీసి పంపించింది. సెల్ఫీలు సాధారణంగా మనుషులు మాత్రమే తీసుకోవడం జరుగుతుండగా ఇలా రాకెట్లు స్వీయచిత్రాలు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. దేశ చరిత్ర నలుదిశలా వ్యాపింపజేసేలా నిప్పులు చిమ్ముకుంటూ జీఎస్ఎల్వీ మార్క్3డీ1 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 3,136 కిలోల బరువున్న భారీ ఉపగ్రహం జీశాట్–19ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రెండు రోజుల కిందట ఈ ప్రయోగం పూర్తికాగా తాజాగా సెల్ఫీ చిత్రాలు తీసి పంపించింది. అయితే, ప్రయోగం ప్రారంభమైన తర్వాత కూడా సోమవారం కొన్ని సెల్ఫీలు తీసుకుంది. బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌తో ఇన్ఫ్రారెడ్ కలర్లో కనిపిస్తూ 200 టన్నుల బూస్టర్లు ఎర్రగా మండిపోతున్న దృశ్యాలు, అనంతరం జీశ్యాట్ ఉపగ్రహాన్ని ఆర్బిట్‌లో ప్రవేశపెడుతున్నప్పటి చిత్రాలను తానే స్వయంగా చిత్రించి బుధవారం ఇస్రో శాస్త్రవేత్తలకు పంపించింది. -
గ'ఘన' విజయం
జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 ప్రయోగం సక్సెస్ కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం జీశాట్–19 16.20 నిమిషాల్లో పూర్తయిన ప్రయోగం ఇస్రోకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): క్షణాలు కరిగిపోతున్నాయి.. 3, 2, 1, 0.. ఉత్కంఠకు తెరదించుతూ.. మువ్వన్నెల పతాకను మరోసారి సగర్వంగా ఎగరేస్తూ.. నిప్పులు చిమ్ముకుంటూ జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది! 3,136 కిలోల బరువున్న భారీ ఉపగ్రహం జీశాట్–19ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా ఒదిగిపోయింది. ప్రయోగం సాగిందిలా.. జీఎస్ఎల్వీ మార్క్–3డీ1న ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో పదిహేడేళ్ల కఠోర శ్రమ ఫలించింది. బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 ప్రయోగానికి ఆదివారం సాయంత్రం 3.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారం సరిగ్గా సాయంత్రం 5.28 గంటలకు రాకెట్ నింగికేగింది. ఒక్కో దశ విజయవంతం అయ్యేకొద్దీ శాస్త్రవేత్తల ముఖాల్లో విజయగర్వం తొణికిసలాడింది. రాకెట్‌కు మొదటి దశలో రెండు వైపులా అమర్చిన రెండు ఘన ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లు (ఎస్–200), రెండో దశలో అమర్చిన 110 టన్నుల ద్రవ ఇంధనం (ఎల్–110) దశలు సమర్థంగా పనిచేశాయి. కీలకమైన మూడో దశలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం (సీ–25) మండి రాకెట్‌ను 175 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. తర్వాత రాకెట్‌పై భాగంలో అమర్చిన 3,136 కిలోల జీశాట్–19 సమాచార ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టారు. ప్రయోగం మొత్తం 16.20 నిమిషాల్లో పూర్తయింది. ఈ విజయంతో భవిష్యత్‌లో 3 టన్నుల నుంచి 5 టన్నుల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాల (కమ్యూనికేషన్ శాటిలైట్స్)తో పాటు చంద్రయాన్–2 ప్రయోగంలో రోవర్‌ను, అలాగే స్పేస్ షటిల్ ప్రోగ్రాంలో భాగంగా మానవుడిని అంతరిక్షంలోకి పంపగలమని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ (ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం) నుంచి అంతా సవ్యంగా ఉన్నట్టు ప్రకటన వెలువడింది. ప్రయోగం విజయవంతం కాగానే మిషన్ కంట్రోల్ సెంటర్లోని శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ప్రపంచదేశాల్లో తిరుగులేని శక్తిగా.. తాజా ప్రయోగంతో ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. పదిహేడేళ్లుగా ఇస్రో ఎస్–200 ఘన ఇంధన బూస్టర్లు, ఎల్–100 ద్రవ ఇంధన దశ, సీ–25 క్రయోజనిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసింది. 2014 డిసెంబర్ 14న జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి ఎస్–200, ఎల్–110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో సీ–25 లేకుండా డమ్మీని ఉపయోగించారు. తాజాగా సీ–25కు అనేక రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎవరెస్ట్‌లాంటిది జీఎస్ ఎల్వీ మార్క్–3డీ1 విజయం పదిహేడేళ్ల కఠోర శ్రమకు గుర్తింపు అని, ఇది ఊహలకందని విజయ మని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ పేర్కొ న్నారు. ‘‘ఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్త యితే ఈ ప్రయోగం ఎవరెస్ట్ అంత ఎత్తు’’ అని అన్నారు. భారత్ ప్రపంచం వైపు చూసే స్థాయి నుంచి నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూసే స్థాయికి చేరుకోగలిగామని.. ఈ విజయం ప్రతి భారతీయుడిని తలెత్తెకునేలా చేసిం దని చెప్పారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో ఏటా 12 పీఎస్ఎల్వీ ప్రయోగాలు, 2 జీఎస్ఎల్వీ మార్క్–2, మార్క్–3 ప్రయోగాలు చేయగలమన్న నమ్మకం కుదిరింద న్నారు. జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతమైన తరువాత శ్రీహరికోటలోని షార్‌లో మీడియాతో మాట్లాడారు. మార్క్–3 రాకెట్‌ను రెండింతలు బలోపేతం చేసి భారీ ప్రయోగాలకు సిద్ధమవుతామన్నారు. ఇంతటి ఘన విజయం సాధించడానికి అహర్నిశలు కృషి చేసిన ఇస్రో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా క్రయోజనిక్ దశను రూ పొందించడంలో ఎంతో పరిణతిని సా«ధించా మని, ప్రపంచంలో అతి తక్కువ దేశాలకే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెప్పారు. ఈ రాకెట్ ద్వారా పంపిన ఉపగ్రహంలో అమర్చిన కే–బ్యాండ్, కేయూ బ్యాండ్ హైఫ్రీక్వెన్సీ ట్రాన్స్పాండర్లు.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిం చేందుకు దోహదపడతాయని చెప్పారు. వ్యయం తగ్గిస్తున్నాం.. రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ వ్యవస్థల ను అభివృద్ధి చేసి, ఉపగ్రహాల బరువును తగ్గిస్తా మని.. తద్వారా రాకెట్ బరువును తగ్గించి ప్రయో గ వ్యయాన్ని బాగా తగ్గిస్తామని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే పరిశోధన ముమ్మరం చేశామని తెలిపారు. ఇక భవిష్యత్తు అంతా భారీ ప్రయోగాలే లక్ష్యంగా చేసుకోనున్నామని.. అందులో భాగంగా పీఎస్ఎల్వీ రాకెట్ సామర్థ్యాన్ని పెంచి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది చంద్రయాన్–2 ఈ నెల 23న పీఎస్ఎల్వీ సీ38, ఆ వెంటనే మరో జీఎస్ఎల్వీ మార్క్–2 ప్రయోగం ఉంటుందని తెలిపారు. 5.5 టన్నుల బరువుండే జీశాట్–11 ఉపగ్రహాన్ని తయారుచేస్తున్నామని.. దానిని ఫ్రాన్స్‌లోని గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నామని వెల్లడించారు. 2018 ప్రథమార్థంలో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఉపగ్రహాన్ని, చంద్రుడిపై పరిశోధనకు చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని పంపనున్నామని చెప్పారు. జీశాట్–19 ఉపగ్రహంతో ఉపయోగాలివీ.. దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికాం రంగంలో విస్తృత సేవలు, ఇంటర్నెట్ వేగవంతం అవడమే కాకుండా అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఇంటర్నెట్ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఉపగ్రహంలో కేయూ బ్యాండ్ హైయర్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తో పాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్స్ అమర్చి పంపారు. ఇప్పటికే ఇస్రోకు చెందిన 14 సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 275 ట్రాన్స్పాండర్లతో దేశవాళి డీటీహెచ్ ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి. అయితే దేశంలో 400 ట్రాన్స్పాండర్లు దాకా డిమాండ్ ఉంది. తాజా విజయంతో రాబోయే రెండుమూడేళ్లలో జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 450 టాన్స్‌పాండర్లను అందుబాటులోకి తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 850 టీవీ చానళ్లు ఉంటే అందులో 650 చానళ్లను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 300 చానళ్లకు మాత్రమే వీశాట్ లింక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇస్రో అంతర్గతంగా వాణిజ్యపరంగా 120 ట్రాన్స్పాండర్లను ఉపయోగించుకుంటోంది. జీశాట్–19 ఉపగ్రహంతో సమాచార వ్యవస్థలో అత్యంత అధునాతమైన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. పదిహేడేళ్ల శ్రమ ఫలితమిది సూళ్లూరుపేట: భారీ ఉపగ్రహాలను నింగి లోకి తీసుకెళ్లగల జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ అభివృద్ధి, విజయం వెనుక ఇస్రో పదిహేడేళ్లు కఠోర శ్రమ, నిరంతర కృషి దాగుంది. సుమారు 3 నుంచి 5 టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాలను ప్ర యోగించేందుకు.. మనుషులను అంత రిక్షంలోకి తీసుకెళ్లేందుకు.. చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల కోసం రోవర్లను పంపేందుకు భారీ రాకెట్లు అవసరం. ఇస్రో 2000లో దీనిపై ప్రతిపా దన చేయగా కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. దాంతో మార్క్–3 తరహా భారీ రాకెట్ అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. 2003లో ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆ నిధుల్లో రూ.700 కోట్లతో షార్‌లో ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. అన్ని దశలూ భారీగానే..: పీఎస్ఎల్వీ, సాధారణ జీఎస్ఎల్వీ రాకెట్లలోని మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు. అయి తే భారీ రాకెట్ రూపకల్పనలో భాగంగా మార్క్3 ప్రయోగం మొదటి దశలో 200 టన్నుల చొప్పున ఘన ఇంధనాన్ని నింపిన రెండు స్ట్రాపాన్ (ఎస్–200) బూస్టర్లు అవసరమని గుర్తించారు. వీటిని షార్‌లోని ఘన ఇంధనం తయారీ విభాగం(స్ప్రాబ్)లోనే తయారు చేశారు. 2010 జనవరి 24న ఈఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. రెండో దశలో సాధారణంగా 40 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తుండగా.. మార్క్ 3 తరహా కోసం 110 టన్నుల ఇంధనాన్ని నింపిన బూస్టర్ల(ఎల్–110) ను వినియోగించారు. వీటిని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రొపెల్లెంట్ స్పేస్ సెంటర్లో తయారు చేశారు. మూడోదశలో అత్యంత శక్తివంత మైన క్రయోజనిక్ ఇంజన్లను వినియోగిస్తారు. సాధారణ జీఎస్ఎల్వీలో ఈ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని వినియోగించగా.. మార్క్3 కోసం 25 టన్నులు వినియోగించాల్సి వచ్చింది. 12.5 టన్నుల క్రయోజనిక్ దశ రూపకల్పన కోసమే అప్పట్లో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కష్టపడ్డారు. తాజాగా 25 టన్నుల క్రయోదశ (సీ–25) అభివృద్ధి కోసం రెండేళ్లు పట్టింది. అయితే మొత్తంగా పూర్తిస్థాయిలో క్రయోజనిక్ దశ అభివృద్ధిలో ఇస్రో విజయం సాధించింది. 59 ప్రయోగాలు.. విజయాలు 51 ఇస్రో సోమవారం నిర్వహించిన జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 ప్రయోగంతో 59 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. ఇందులో 51 ప్రయోగాలు విజయవంతం కావడం గమనార్హం. వీటిల్లో ఇప్పటివరకు ఎక్కువగా పీఎస్ఎల్వీ ప్రయోగాలే విజయవంతంకాగా.. తాజాగా జీఎస్ఎల్వీ సిరీస్‌లోనూ వరుస విజయాలు ప్రారంభమయ్యాయి. క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో జీఎస్ఎల్వీ డీ5, డీ6, మార్క్–3 ప్రయోగాత్మక ప్రయోగం, ఎఫ్–09 ప్రయోగాలతో పాటు తాజాగా మార్క్–3డీ1 ప్రయోగం కూడా వరుసగా విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఆరేళ్లుగా అపజయమే లేదు.. 2011 నుంచి ఇప్పటిదాకా వరుస విజయాల బాటలో సాగుతున్న ఇస్రో, షార్ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆరు పీఎస్ఎల్వీ రాకెట్లు, ఒక జీఎస్ఎల్వీ, ఆర్ఎల్వీ–టీడీ, ఏటీవీ వంటి రెండు ప్రయోగాత్మక ప్రయోగాలు విజయం సాధించి 2016 సంవత్సరమంతా విజయాల బాటలో నడవగా... 2017లోనూ మూడో విజయాన్ని అందుకున్నారు. అగ్రదేశాల సరసన - జీఎస్ఎల్వీ–మార్క్3ని ప్రయోగించడం ద్వారా భారత్ భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటిదాకా భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకు మాత్రమే ఉంది. - 3 వేల కిలోల బరువు దాటితే దాన్ని భారీ ఉపగ్రహంగా పరిగణిస్తారు. - పాతతరం ఉపగ్రహాలతో పోలిస్తే జీశాట్–19 సామర్థ్యం చాలా ఎక్కువ. ఇది ఆరేడు పాత ఉపగ్రహాలకు సమానం. - ఇతర దేశాలతో పోలిస్తే భారీ ఉపగ్రహ ప్రయోగానికి భారత్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువ. మిగతా వాళ్లకంటే 60 నుంచి 70 శాతం తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. - సమాచార ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో సింహభాగం వాటా ప్రైవేటు సంస్థలు స్పేస్ ఎక్స్, అరియేన్‌లదే. 10 టన్నుల ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లగల రాకెట్లు వీటి వద్ద ఉన్నాయి. - 5 టన్నుల దాకా బరువుండే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి స్పేస్ ఎక్స్ సంస్థ తమ ఫాల్కన్–9 రాకెట్‌ను వాడుతుంది. దీనికి రూ.400 కోట్లు ఛార్జి చేస్తుంది. - భారత్ ఇప్పటిదాకా 21 దేశాలకు చెందిన 79 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే అంతర్జాతీయ విపణిలో భారత్ వాటా 0.6 శాతం మాత్రమే. - భవిష్యత్తులో మనుషులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.12,500 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఈ మిషన్‌లో జీఎస్ఎల్వీ– మార్క్3 రాకెటే కీలకం కానుంది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపగల సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలకే ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ దేశం గర్విస్తోంది: ప్రణబ్ జీఎస్ఎల్వీ–మార్క్ 3 ప్రయో గం విజయవంతమైనందుకు దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖ ర్జీ అన్నారు. ఇస్రో చైర్మన్ కిరణ్‌కు ప్రణబ్ అభినందన లేఖ పంపారు. ఈ విజయం చరిత్రాత్మకమైనదనీ, బృందంలోని శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణు లకు.. ఈ ప్రయోగంలో భాగమైన వారికి తన తరఫున శుభా కాంక్షలు తెలియజేయాలని ఇస్రో చైర్మన్‌ను కోరారు. శాస్త్రవేత్తలకు అభినందనలు ఉపగ్రహ ప్రయోగం విజయం పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంతో తర్వాతి తరం ఉపగ్రహా సామర్థ్యానికి మనం మరింత చేరువయ్యామన్నారు. ‘అంకితభావంతో పని చేసి జీఎస్ఎల్వీ–మార్క్3 డీ1/జీశాట్– 19 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. దేశం గర్వించే విజయం: సోనియా జీఎస్ఎల్వీ ప్రయోగం సక్సెస్ కావడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశం గర్వించేలా ఇస్రో సాధించిన మరో ప్రధాన విజయమిది’ అని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అభినందనలు ఇస్రోకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో తర్వాతి తరం ఉపగ్రహాల ప్రయోగానికి మరింతగా దగ్గరైందని కొనియాడారు. ఈ రోజు సాధించిన విజయం పట్ల దేశం గర్వపడుతోందన్నారు. మరో అరుదైన ఘనత: చంద్రబాబు ఇస్రో చరిత్రలో ఇది మరో అరుదైన ఘనతని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. శ్రీహరికోట నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం భారతావని గర్వించదగ్గ విజయమన్నారు. అగ్రదేశాల సరసన నిలిపారు: జగన్ జీఎస్ఎల్వీ– మార్క్3డీ1 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ విజయం కమ్యూనికేషన్ల రంగంలో కొత్త శక్తి ఇస్తుందని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక భారీ ప్రయోగంతో మన దేశం అంతరిక్ష రంగంలోని అగ్రగామి దేశాల సరసన చేరిందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
క్రయోజనిక్ దశపై ఇస్రో పట్టు!
- కీలకమైన ఇంజిన్, ఇంధనం సొంతంగా అభివృద్ధి - ఇకపై భారీ రాకెట్లు, బరువైన ఉపగ్రహాల ప్రయోగం ఇస్రో నుంచే శ్రీహరికోట (సూళ్లూరుపేట): మూడు, నాలుగు టన్నుల బరువుండే భారీ ఉపగ్రహాలను అంత రిక్షంలోకి తీసుకెళ్లగలిగిన ‘జీఎస్ఎల్వీ (జియో సింక్రనస్ లాంచ్ వెహికిల్)’రాకెట్లో అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశపై ఇస్రో పట్టుబిగించింది. క్రయోజనిక్ దశను పూర్తిస్థాయిలో అభి వృద్ధి చేసే ప్రక్రియలో సాంకేతికపరమైన ఇ బ్బందులన్నింటినీ అధిగమించి విజయం సాధించింది. సాధారణ జీఎస్ఎల్వీ రాకెట్ లోని మూడో దశలో ఉండే క్రయోజనిక్ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అదే జీఎస్ఎల్వీ మార్క్–3 తరహా భారీ రాకెట్లో 25 టన్నుల క్రయో ఇంధనం అవస రమవుతుంది. కొన్నేళ్ల కింద జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో ఈ క్రయో వ్యవస్థను పకడ్బందీగా రూపొందించేందుకు కొంత సమయం తీసుకుంది. తాజాగా జీఎస్ఎ ల్వీ మార్క్–3డీ1 ప్రయోగం విజయవంతం కావడంతో క్రయోజనిక్ టెక్నాలజీలో ఇస్రోకు పట్టు చిక్కింది. ఇక భారీ ఉపగ్రహాలు ఇస్రో నుంచే.. గతంలో భారీ ఉపగ్రహాలను ఫ్రెంచిలోని గయా నా కౌరూ అంతరిక్ష పరి శోధన కేంద్రం నుంచి వాళ్ల ఏరియాన్ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తూ వచ్చారు. కానీ తాజాగా విజ యంతో ఇక నుంచి ఐదు టన్నుల వరకు బరువైన ఉప గ్రహాలను షార్ నుంచే పంపించే వెసు లుబాటు కలిగింది. ఇటీవలి వరకు జీఎస్ఎల్వీ ప్రయోగాల కోసం రష్యా తయారు చేసిన క్రయోజ నిక్ ఇంజన్లు ఉపయోగించి ఆరు ప్రయో గాలు, సొంతంగా తయారు చేసిన ఒక క్రయో జనిక్ ఇంజన్‌తో ఒక ప్రయోగం చేశారు. ఇందు లో జీఎస్ఎల్వీ–డీ1 పేరుతో 2001 ఏప్రిల్ 18న చేసిన మొట్ట మొదటి ప్రయోగంలో 2 వేల కిలోల బరువైన జీశాట్–01 సమాచార ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఈ ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో రెండు విఫలమ య్యాయి. 2010 ఏప్రిల్ 15న సొంత క్రయోజనిక్ ఇంజన్లతో కూడిన జీఎ స్ఎల్వీ–డీ3ని ప్రయోగించగా విఫలమైంది. అదే ఏడాది డిసెంబర్ 25న రష్యా క్రయోజనిక్ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం కూడా విఫలమైంది. దీంతో ఇస్రో దాదాపు రెండేళ్లపాటు జీఎస్ఎల్వీ ప్రయోగాల జోలికే వెళ్లలేదు. అనంతరం సొంతంగా పూర్తిస్థాయి క్రయోజనిక్ దశ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రెండేళ్లకుపైగా కృషి.. క్రయోజనిక్ ఇంజన్లో ఇంధనంగా ఉపయో గించే లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్‌లను మైనస్ 220, మైనస్ 270 డిగ్రీల అతి శీతల పరిస్థితుల్లో ఉంచాల్సి ఉంటుంది. అతి సున్నితమైన ఈ క్రయోజనిక్ ప్రక్రియలో బాలారిష్టాలను దాటేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అవిరళ కృషి చేశారు. చివరికి విజయం సాధిం చారు. సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్లతో చేసిన నాలుగు ప్రయోగాలు వరు సగా విజయాలు సాధించాయి. సోమవారం చేసిన జీఎస్ఎల్వీ మార్క్–3డీ1తో ఇందులో ఇస్రో పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. మామూలు జీఎస్ఎల్వీలో మూడో దశలో ఉండే క్రయోజనిక్ దశలో 12.5 టన్నుల క్రయో ఇంధనాన్ని వాడతారు. అదే జీఎస్ఎల్వీ మార్క్–3లో క్రయోజనిక్ దశలో 25 టన్నులు (సీ–25) ఇంధనం ఉపయోగించారు. ఈ క్రయోజనిక్–25 వ్యవస్థను అభివృద్ధి చేయడా నికి దాదాపు రెండేళ్లు పట్టింది. పకడ్బందీగా బందోబస్తు జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 ప్రయోగం సందర్భంగా షార్ వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. షార్ మొదటిగేట్లో అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అటకానితిప్ప వద్ద ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నుంచి షార్ వరకు ప్రతి కిలోమీటరుకు ఇద్దరు చొప్పన భద్రతా సిబ్బందిని మోహరిం చారు. షార్ కేంద్రానికి చుట్టూరా, సము ద్రం వైపు నుంచి కూడా బందోబస్తు ఏర్పా టు చేశారు. మరోవైపు మెరైన్ సిబ్బంది కూడా తీర గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహించారు. -
జయహో.. జీశాట్
జీఎస్ఎల్వీ–ఎఫ్09 వాహక నౌక ద్వారా నింగిలోకి ► సాకారమైన ప్రధాని నరేంద్ర మోదీ కల ► దక్షిణాసియా దేశాలకు సమాచార, విపత్తు రంగాల్లో సాయం ► తొలిసారి ప్రాంతీయ సహకారం బలోపేతానికి ఉపగ్రహ సాయం శ్రీహరికోట(సూళ్లూరుపేట), బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం మరో అరుదైన ఘనత సాధించింది. సార్క్ దేశాలకు సమాచార, విపత్తు నిర్వహణ రంగాల్లో సేవలందించే జీశాట్–9 (దక్షిణాసియా ఉపగ్రహం) ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. పూర్తిగా భారత ఆర్థిక సాయంతో నిర్మించిన ఈ ఉపగ్రహం సార్క్ సభ్య దేశాలైన భారత్, శ్రీలంక, భూటాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులకు 12 ఏళ్ల పాటు సేవలందించనుంది. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ఈ ప్రయోగాన్ని చరిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఇస్రో నిర్మించిన జీశాట్–9ని శుక్రవారం సాయంత్రం 4.57 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్09 వాహక నౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 28 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే శ్రీహరికోటలో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. అనంతరం మూడు దశలను విజయవంతంగా అధిగమించి నిర్ణీత కక్ష్యలోకి జీశాట్–9ను ప్రవేశపెట్టింది. భూమి నుంచి బయల్దేరిన 17 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది. జీఎస్ఎల్వీ సిరీస్‌లో 11 ప్రయోగాలు చేయగా ఇస్రో శాస్త్రవేత్తలు ఎనిమిది సార్లు విజయం సాధించారు. అత్యంత బరువైన ఉపగ్రహాల్ని ప్రయోగించేందుకు ఇతర దేశాలపై ఆధారపడకుండా మనమే ప్రయోగించే సామర్థ్యం జీశాట్–9తో ఇస్రో సొంతమైంది. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం సక్రమంగా పనిచేస్తున్నట్లు హసన్‌లోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించిందని ఇస్రో తెలిపింది. ప్రాజెక్టు కోసం రూ.450 కోట్ల ఖర్చు జీశాట్–9 మొత్తం బరువు 2230 కిలోలు. ఇక జీఎస్ఎల్వీ–ఎఫ్9 పొడవు 49 మీటర్లు కాగా బరువు 415 టన్నులు. జీశాట్–9లోని కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్ల ద్వారా దక్షిణాసియా దేశాలకు టెలి కమ్యునికేషన్స్, టెలివిజన్, డీ2హెచ్, వీశాట్స్, టెలి–ఎడ్యుకేషన్, టెలిమెడిసన్ వంటి రంగాల్లో పూర్తి స్థాయి సేవలు అందుతాయి. ఇక భూకంపాలు, తుపాన్లు, వరదలు, సునామీలు వంటి సమయంలో దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయం కోసం హాట్‌లైన్ సంభాషణలకు వీలు కల్పిస్తుంది. జీశాట్–9 తయారీకి భారత ప్రభుత్వం మొత్తం రూ. 235 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం ప్రాజెక్టుకు రూ.450కోట్లు వెచ్చించారు. క్రయోజనిక్ ఇంజిన్‌తో వరుసగా నాలుగోసారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమవడంతో ఇక జీఎస్ఎల్వీ ప్రయోగాలకు తిరుగు ఉండదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2010లో రెండు జీఎస్ఎల్వీ ప్రయోగాలు విఫలమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగేళ్లు శ్రమించి క్రయోజనిక్ ఇంజిన్లను మరింత అభివృద్ధి చేశారు. అనంతరం 2014 జనవరి, 2015 ఆగస్టు, 2016 సెప్టెంబర్‌లో చేసిన మూడు ప్రయోగాలతో హ్యాట్రిక్ సాధించింది. 2014లోనే ఉపగ్రహ ప్రయోగానికి నాంది 2014లో తన ప్రమాణ స్వీకారానికి సార్క్ కూటమి దేశాధినేతల్ని ప్రధాని మోదీ ఆహ్వానించారు. అనంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ఉపగ్రహాన్ని కానుకగా ప్రకటించారు. ప్రధాని ఆకాంక్షను ఇస్రో విజయవంతంగా నిజం చేసింది. మొదట దీనికి సార్క్ ఉపగ్రహం అని పేరు పెట్టినా.. ప్రాజెక్టులో చేరేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో దక్షిణాసియా ఉపగ్రహంగా పేరు మార్చారు. సమష్టి విజయం : ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఇది సమష్టి విజయమని పేర్కొన్నారు. క్రయోజనిక్ దశను రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి ప్రశంసనీయమైందని అభివర్ణించారు. ప్రధాని కోరిన మేరకు సార్క్‌దేశాలకు ఉపయోగపడే విధంగా ఒక ఉపగ్రహాన్ని తయారు చేయాలని ఆకాంక్షను నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో భారీ ప్రయోగాలు సైతం చేయగలమన్న నమ్మకం ఏర్పడిందని, వాణిజ్యపరంగా కూడా భవిష్యత్తులో మరెన్నో భారీ ప్రయోగాలు చేస్తామన్నారు. -
నేడు అంతరిక్షంలోకి జీఎస్ఎల్వీ
-
నేడు అంతరిక్షంలోకి జీఎస్ఎల్వీ
శ్రీహరికోట(సూళ్లూరుపేట)/సాక్షి,తిరుమల: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్ ఎల్వీ ఎఫ్09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి గురువారం మధ్యా హ్నం 12.57 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభ మైంది. ఈ రాకెట్ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్ర హంలో 12 కేయూ బ్రాండ్ ట్రాన్స్ఫార్మర్స్ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటివరకు నిర్వహిం చిన 10 ప్రయోగాల్లో 3 విఫలం కాగా 7 విజయవం తమయ్యాయి. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. 3 సార్లు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వరుసగా ప్రయోగాలు నిర్వహించిన శాస్త్రవేత్తలు నాలుగోసారి ప్రయోగా నికి సిద్ధమవుతున్నారు. ఉపగ్రహ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ చెన్నైలో విలేకర్లతో మాట్లాడుతూ ప్రయోగ పనులన్నీ సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం జరిగే ప్రయోగానికి మీడియాకు ఎలాంటి ప్రవేశం లేదని ఇస్రో వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కాగా ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం లో గురువారం ఇస్రో డైరెక్టర్లు, సిబ్బంది జీఎస్ఎల్ వీ ఎఫ్09 నమూనా రాకెట్‌తో పూజలు చేశారు. మార్క్–3 పనులపై ఎంఆర్ఆర్ సమావేశం సతీష్‌ధావన్ స్పేస్‌సెంటర్ (షార్)లోని కల్పన అతిథి భవనంలో జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగ పనులపై ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ఆధ్వ ర్యంలో మిషన్ సంసిద్ధతా సమావేశం(ఎంఆర్ఆర్) నిర్వహించారు. ఈ నెల 30న ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రయోగ పనులపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన సాలిడ్ స్టేజ్ అసెంబ్లీ బిల్డింగ్ (ఎస్‌ఎస్‌ఏబీ)లో రెండు దశల రాకెట్ అనుసం« దానాన్ని ఆయన పరిశీలించారు. జీఎస్ ఎల్వీ ఎఫ్09 ప్రయోగం ముగిసిన వెంటనే మార్క్–3 ప్రయోగానికి సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఈ సమావేశంలో షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కె.శివన్, ఐసాక్ డైరెక్టర్ ఎం.అన్నాదొరై, ఎల్పీఎస్ఈ డైరెక్టర్ ఎస్.సోమ నాథ్‌తో పాటు పలు సెంటర్ల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
విజయవంతంగా క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశో ధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగిం చబోయే జీఎస్ఎల్వీ మార్క్–3లో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్ (సీ–25) పరీక్షను ఇస్రో శాస్త్రవే త్తలు శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. తమిళనా డులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో వున్న ఇస్రో ప్రపొల్షన్ సెంటర్లో క్రయోజనిక్ ఇంజి న్ను రూపొందించి చేసిన పరీక్ష సక్సెస్ కావడంతో ఇక ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. జీఎస్ఎల్వీ మార్క్ 3 భారీ రాకెట్ ద్వారా సుమారు 4 టన్నుల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచారం ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. షార్కు చేరుకున్న ఎల్–40: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి మార్చి నెలాఖరులోపు ప్రయోగించాలనుకున్న జీఎస్ఎల్వీ ఎఫ్–09 రాకెట్‌కు సంబంధించిన ఎల్–40 దశ శనివారం షార్కు చేరుకుంది. ఈ దశను జీఎస్ఎల్వీ ఎఫ్–09 కోర్‌అలోన్ దశలో ఉపయోగిస్తారు. -
ఇస్రో రికార్డు.. జీఎస్ఎల్వీ గ్రాండ్ సక్సెస్
-
ఇస్రో రికార్డు.. జీఎస్ఎల్వీ గ్రాండ్ సక్సెస్
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత దక్కించుకుంది. జీఎస్ఎల్వీ ఎఫ్-05 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. ముందు నిర్ణయించిన సమయం కన్నా 40 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం చేసిన ఇస్రో మరో విజయాన్ని అందుకుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఇప్పటి వరకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించి విజయంసాధించిన ఇస్రో.. అదేమాదిరిగా జియోసింక్రనైజ్ షాటిలైట్ లాంచింగ్ వెహికిల్ ద్వారా ఇన్శాట్ -3డీఆర్ ఉపగ్రహాన్ని ప్రయోగించి సక్సెస్ సాధించింది. 17 నిమిషాల్లో నిర్ణీత కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. తొలుత రాకెట్ ప్రయోగాన్ని సాయంత్రం 4.10గంటలకు అనుకోగా కొంత సాంకేతిక సమస్య తలెత్తి 40 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగాన్ని ప్రారంభించారు. ఇంధనం నింపే ట్యూబులు తెరుచుకోకపోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. అది కాస్త పరిష్కారం కావడంతో సరిగ్గా 4.50 నిమిషాలకు ప్రయోగం ప్రారంభించారు. వాతావరణాన్ని మెరుగ్గా అధ్యయనం చేసేందుకు ఇన్ శాట్ -3డీఆర్ అనే ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా నింగిలోకి పంపిస్తున్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ దశతో మూడోసారి చేసిన ప్రయోగం అయినందున శాస్త్రవేత్తలు చాలా అప్రమత్తంగా ఉండి ఈ ప్రయోగం పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారని అన్నారు. అలాగే, ఈ విజయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరిన్ని భవిష్యత్‌లోనూ సాధించాలని ఆకాంక్షించారు. -
జీఎస్ఎల్వీ ప్రయోగం ఆలస్యం
శ్రీహరికోట: జీఎస్ఎల్వీ ఎఫ్-05 రాకెట్ ప్రయోగంలో చిన్న అవాంతరం ఎదురైంది. ముందు నిర్ణయించిన సమయం కన్నా 40 నిమిషాలు ఆలస్యంగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ ఆలస్యానికి కారణం అని ఇస్రో ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 4:10 గంటలకు ప్రయోగం ప్రారంభించాల్సి ఉండగా 4.50గంటలకు మొదలవనుంది. ఇంధనం నింపేక్రమంలో దానికి సంబంధించిన ట్యూబులు తెరుచుకోకపోవడం వల్ల సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. వాతావరణాన్ని మెరుగ్గా అధ్యయనం చేసేందుకు ఇన్ శాట్ -3డీఆర్ అనే ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా నింగిలోకి పంపిస్తున్నారు. -
8న జీఎస్ఎల్వీ ఎఫ్05 ప్రయోగం
ఇన్శాట్–3డీ స్థానంలో ఇన్శాట్–3డీఆర్ శ్రీహరికోట (సూళ్లూరుపేట) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈనెల 8న సాయంత్రం 4.10 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్05 ద్వారా 2061 కిలోలు బరువు కలిగిన ఇన్శాట్–3డీఆర్ అనే సమాచార ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సమయాత్తమైంది. షార్‌లోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో అనుసంధానం పనులు పూర్తి చేసుకుని గురువారం ఉదయం 6.10 గంటలకు వ్యాబ్నుంచి పట్టాలు లాంటి ట్రాక్‌పై ఊంబ్లికల్టవర్ (ప్రయోగవేదిక) ఉదయం 8.15 గంటలకు అనుసంధానించారు. గత నెల 29న ఇన్శాట్–3డీఆర్‌ను మరో వ్యాబ్‌లో హీట్‌షీల్డ్‌లో అమర్చి క్లోజ్ చేసి రాకెట్ శిఖరభాగాన అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు. రెండురోజుల పాటు అక్కడ తుదివిడత తనిఖీలు నిర్వహించి రాకెట్‌ను ప్రయోగవేదిక మీదకు తరలించారు. 2013 జులై 26న ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ రాకెట్ ద్వారా రోదసీలోకి ప్రవేశపెట్టిన ఇన్శాట్–3డీ ఉపగ్రహం సాంకేతిక పరమైన కారణాలతో సేవలు నిలిచిపోవడంతో దాని స్థానంలో ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేశారు. 2000 కిలోలు బరువు కలిగిన ఇన్శాట్–3డీ ఉపగ్రహానికి సోలార్ ప్యానెల్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో దాని నుంచి సేవలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అందుకే దాని స్థానంలో జీఎస్ఎల్వీ ఎఫ్05 రాకెట్ ద్వారా ఇన్శాట్ –3డీఆర్ పంపేందుకు ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. ఇన్శాట్–3డీ స్థానంలో రీప్లేస్ చేస్తున్నారు. కాబట్టి దీనికి ఇన్శాట్–3డీఆర్ నామకరణం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. -
రెండు ప్రయోగాలకు సిద్ధమవుతోన్న ఇస్రో
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగస్టులో రెండు ప్రయోగాలకు సిద్ధమవుతోంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ లో జూన్ 30 నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-06 అనుసంధానం పనులను ప్రారంభించారు. తొలి దశలో అమర్చే 5 సెగ్మెంట్లులో ఇప్పటికే నాజల్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్ అనుసంధానం చేయగా, సోమవారం మిడిల్-2 సెగ్మెంట్‌ను అనుసంధానం చేయనున్నారు. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి పీఎస్ఎల్వీ సీ35 అనుసంధానం పనులను మొదటి ప్రయోగవేదికపై ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.