శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశో ధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగిం చబోయే జీఎస్‌ఎల్‌వీ మార్క్–3లో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్ (సీ–25) పరీక్షను ఇస్రో శాస్త్రవే త్తలు శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. తమిళనా డులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో వున్న ఇస్రో ప్రపొల్షన్ సెంటర్‌లో క్రయోజనిక్ ఇంజి న్‌ను రూపొందించి చేసిన పరీక్ష సక్సెస్ కావడంతో ఇక ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 భారీ రాకెట్ ద్వారా సుమారు 4 టన్నుల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచారం ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.
షార్‌కు చేరుకున్న ఎల్–40: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి మార్చి నెలాఖరులోపు ప్రయోగించాలనుకున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–09 రాకెట్‌కు సంబంధించిన ఎల్–40 దశ శనివారం షార్‌కు చేరుకుంది. ఈ దశను జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–09 కోర్‌అలోన్ దశలో ఉపయోగిస్తారు.
విజయవంతంగా క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష
Published Sun, Feb 19 2017 2:51 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
Advertisement