cryogenic stage test
-
సీఈ20 ఇంజన్ పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్ దశలో ఉపయోగపడే కొత్త ఇంజన్‌ను(సీఈ–20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. సీఈ–20 ఇంజన్ భూస్థిర పరీక్షను నిర్వహించినట్టుగా ఇస్రో శనివారం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్(ఐపీఆర్సీ) ఈ పరీక్షకు వేదికగా నిలిచింది. ఈ నెల 22న నిర్వహించిన ఎల్వీఎం3–ఎం2 రాకెట్ ప్రయోగం ద్వారా లండన్ శాటిలైట్ కమ్యూనికేషన్ల సంస్థ ‘వన్‌వెబ్’కు చెందిన 36 ఉపగ్రహాలను భూమికి 601 కిలోమీటర్లు ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వన్‌వెబ్‌కు చెందిన మరో 36 శాటిలైట్లను వచ్చే ఏడాది జనవరి–ఫిబ్రవరిలో ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి ఉంది. ఈ ఉపగ్రహాలను వదిలిపెట్టాల్సిన కక్ష్య తక్కువ దూరంలో ఉండడంతో క్రయోజనిక్ దశలో నింపే 25 టన్నుల ఇంధనంలో 5 టన్నుల భారాన్ని, ఖర్చును తగ్గించేందుకు సీఈ–20 పేరిట నూతనంగా క్రయోజనిక్ ఇంజన్‌ను డిజైన్ చేశారు. సుమారు 25 సెకండ్లపాటు మండించి ఈ ఇంజన్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీన్ని ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగాల కోసమే రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ప్రయోగాలకు సీఈ–12.5, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాలకు సీఈ–25, వాణిజ్యపరంగా ఎల్వీఎం3 ప్రయోగాలకు సీఈ–20.. అనే మూడు రకాల క్రయోజనిక్ ఇంజన్లు అందుబాటులోకి రావడం విశేషం. -
క్రయోజనిక్ హాట్ టెస్ట్ విజయవంతం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ఏడాది డిసెంబర్లో ప్రయోగించబోయే జీఎస్ఎల్వీ ఎఫ్–11కు సంబంధించి క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెప్ట్ హాట్ టెస్ట్ విజయవంతంగా ముగిసింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కేంద్రంలో ఆగస్టు 27న చేపట్టిన ‘హాట్ టెస్ట్’ సక్సెస్ అయ్యిందని ఇస్రో శనివారం ప్రకటించింది. క్రయోజనిక్ ఇంజిన్‌ను సుమారు 200 సెకన్లపాటు పనిచేయించి పరీక్షించారు. జీఎస్ఎల్వీ రాకెట్‌కు సంబంధించి కీలకమైన క్రయోజనిక్ దశ అత్యంత సంక్లిష్ట పరిజ్ఞానంతో కూడుకున్నది కావడంతో ఈ దశలో ఎప్పటికప్పుడు నూతనంగా పలు పరీక్షలు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. -
విజయవంతంగా క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశో ధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగిం చబోయే జీఎస్ఎల్వీ మార్క్–3లో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్ (సీ–25) పరీక్షను ఇస్రో శాస్త్రవే త్తలు శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. తమిళనా డులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో వున్న ఇస్రో ప్రపొల్షన్ సెంటర్లో క్రయోజనిక్ ఇంజి న్ను రూపొందించి చేసిన పరీక్ష సక్సెస్ కావడంతో ఇక ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. జీఎస్ఎల్వీ మార్క్ 3 భారీ రాకెట్ ద్వారా సుమారు 4 టన్నుల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచారం ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. షార్కు చేరుకున్న ఎల్–40: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి మార్చి నెలాఖరులోపు ప్రయోగించాలనుకున్న జీఎస్ఎల్వీ ఎఫ్–09 రాకెట్‌కు సంబంధించిన ఎల్–40 దశ శనివారం షార్కు చేరుకుంది. ఈ దశను జీఎస్ఎల్వీ ఎఫ్–09 కోర్‌అలోన్ దశలో ఉపయోగిస్తారు.