శ్రీహరికోట: జీఎస్ఎల్వీ ఎఫ్-05 రాకెట్ ప్రయోగంలో చిన్న అవాంతరం ఎదురైంది. ముందు నిర్ణయించిన సమయం కన్నా 40 నిమిషాలు ఆలస్యంగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ ఆలస్యానికి కారణం అని ఇస్రో ప్రకటించింది.
ఈ రోజు సాయంత్రం 4:10 గంటలకు ప్రయోగం ప్రారంభించాల్సి ఉండగా 4.50గంటలకు మొదలవనుంది. ఇంధనం నింపేక్రమంలో దానికి సంబంధించిన ట్యూబులు తెరుచుకోకపోవడం వల్ల సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. వాతావరణాన్ని మెరుగ్గా అధ్యయనం చేసేందుకు ఇన్ శాట్ -3డీఆర్ అనే ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా నింగిలోకి పంపిస్తున్నారు.
జీఎస్ఎల్వీ ప్రయోగం ఆలస్యం
Published Thu, Sep 8 2016 3:55 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
Advertisement
Advertisement