జీఎస్‌ఎల్‌వీ ఎఫ్11 ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్11) ప్రయోగించనున్నారు. మంగళవారం ఉదయాన్నే సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి వద్ద పూజలు చేయించుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాకెట్‌లోని రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మంగళవారం రాత్రి చేపట్టారు.