Satish Dhawan Space Center (SHAR)
-
మార్చిలో నింగిలోకి నిసార్ ఉపగ్రహం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మిని్రస్టేషన్ (నాసా) సంయుక్తంగా 2,800 కిలోల బరువు కలిగిన నిసార్ (నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోపు సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్16) ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఉపగ్రహాన్ని లోయర్ ఎర్త్ అర్బిట్ (లియో)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది పూర్తి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూర పరిశీలనా ఉపగ్రహం) కావడం విశేషం. ఈ ఉపగ్రహం భూగోళం మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాప్ చేస్తుంది. ఈ ఉపగ్రహంలోని పేలోడ్స్‌తో భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద జీవసంపద, సముద్రమట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడడం వంటి విపత్తుల గురించి స్థిరమైన డేటాను అందిస్తుంది. నిసార్ ఉపగ్రహంలో ఎల్ మరియు ఎస్ డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (ఎస్ఏఆర్)ని కలిగి వుంటుంది. ఇది అధిక రిజల్యూషన్ డేటాతో పెద్ద స్వాత్‌ను స్వీప్ సార్ టెక్నిక్‌తో పని చేస్తుంది. ఈ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్, సిం«థటిక్ ఆపార్చర్ రాడార్‌ను ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్‌ను నాసా సమకూర్చాయి. ఈ రెండు దేశాలకు చెందిన సింథటిక్ ఆపార్చర్ రాడార్లు సుమారు 12 మీటర్లు వ్యాసార్థంలో వున్న రిఫ్లెక్టర్ యాంటెన్నాను ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా నాసా మిషన్ కోసం ఇంజినీరింగ్ పేలోడ్స్‌ను అందిస్తుంది. ఇందులో పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్, హై–రేట్సైన్స్ డౌన్‌లింక్ సిస్టమ్, జీపీఎస్ రిసీవర్లు మరియు సాలిడ్ స్టేట్ రికార్డర్ ఉన్నాయి. ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్లలో ఇది మొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ మిషన్ అవుతుంది. నాసా వారి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సైంటిఫిక్ పరికరాలతో బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్ఎస్సీ)లో నిసార్ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. మార్చి నెలాఖరులోపు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. -
నేడు నింగిలోకి అగ్నిబాన్ రాకెట్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అగ్నికుల్ కాస్మోస్ ప్రయివేట్ లిమిటెడ్ (చెన్నై) అనే ప్రయివేట్ అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ ఎస్ఓఆర్ టీఈడీ మిషన్–01 అనే చిన్న తరహా రాకెట్‌ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని అగ్నికుల్ ప్రయోగవేదిక నుంచి శనివారం ఉదయం 6గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని షార్ శుక్రవారం మీడియాకు తెలిపింది. ఇస్రోలోని వాణిజ్యవిభాగమైన ఇన్‌స్పేస్ సంస్థ ఆహ్వానం మేరకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ లాంచ్పాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగంలో సుమారు వంద కిలోలు బరువు కలిగిన పేలోడ్ (ఉపగ్రహం)ను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి పంపించనున్నారు. అయితే రాకెట్‌కు సంబంధించిన అన్ని విషయాలను అగ్నికుల్ సంస్థ చూసుకుంటుండగా, షార్ అధికారులు, ఇంజినీర్లు ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈ రాకెట్‌కు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదు. అయితే షార్ వేదికగా ప్రయివేట్ అంతరిక్ష సంస్థల్లో స్కైరూట్, అగ్నికుల్ అనే రెండు సంస్థలకు చెందిన చిన్న తరహా ప్రయోగాలకు ఇస్రో వీలు కల్పిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రయోగ వేదికలను కూడా కల్పించి మరీ ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అందుకే అగ్నికుల్ సంస్థకు షార్కేంద్రంలో ఒక ప్రయోగవేదికను కూడా కేటాయించారు. అగ్నిబాన్ రాకెట్ వివరాలివి పేటెంట్ పొందిన అగ్నిలెట్ ఇంజన్లతో ఈ రాకెట్ నడవడం విశేషం. ఇది త్రీడీ–ప్రింటెడ్ 6 కేఎన్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ సాయంతో నిలువునా నింగిలోకి ఎగురుతుంది. అగ్నికుల్ రాకెట్ 18 మీటర్లు ఎత్తు కలిగి 1.3 మీటర్లు వెడల్పు ఉంది. ప్రయోగ సమయంలో 14వేల కిలోల బరువు కలిగి ఉంటుంది. ఈ అగ్నిలెట్ ఇంజిన్లలో ద్రవ ఆక్సిజన్, ద్రవ ఆక్సిడైజర్ అనే ఇంధనం సాయంతో మూడు దశలుగా రాకెట్‌ను ప్రయోగిస్తారు. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ గతేడాది ఆగస్టు 15న ఒకసారి ప్రయోగాన్ని నిర్వహించగా, రెండోసారి శనివారం ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. -
రైతులకు ఉపగ్రహ ఊతం
ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయ మైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్శాట్–1ఏ) ప్రయోగం జరిగింది. మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లారిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనా లను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది. 1992లో ప్రయోగించిన ఇన్శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది. సమాచార వినిమయానికి కూడా... ఇన్శాట్–1, ఇన్శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్‌కాస్టింగ్ రంగా లకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉప గ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్లు అసలు లేకపోవడం గమ నార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగ మించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్శాట్ను ప్రయోగించింది. తరు వాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్నాల్ (హరియాణా)లో పుట్టి, ‘నాసా’ వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్‌షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట! ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతా వరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పూణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమా చారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూ టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ– డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థ లను అభివృద్ధి చేసే పనిలో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మా ణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరి శోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పూణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీతోపాటు మారుతూ... వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్ట్ ఎస్ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది. అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశ పెట్టగలుగుతున్నాము. సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరా లను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ , ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబ నకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జీఎస్ఎల్వీ–ఎఫ్14 సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జియో సింక్రనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్14) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 27.30 గంటల అనంతరం నిర్దేశిత సమయానికి రాకెట్ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగంలోని మొత్తం మూడు దశలు విజయవంతమయ్యాయి. 2,275 కిలోల బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు(పెరిజీ), భూమికి దూరంగా 36,647 కిలోమీటర్ల(అపోజీ) జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఇన్శాట్–3డీఎస్‌లో నింపిన 1,250 కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండించి, మరో రెండు మూడు రోజుల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్(భూ స్థిరకక్ష్య)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. ఏమిటీ ఇన్శాట్–3డీఎస్? దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు, విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది. దీంతో వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత రానుంది. ఇన్శాట్–3, ఇన్శాట్–3ఆర్ ఉపగ్రహాలకు అనుసంధానంగా మూడో తరం ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహం పని చేస్తుంది. ఇప్పటిదాకా ఇన్శాట్ శ్రేణిలో 23 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ శాటిలైట్లకు కొనసాగింపుగా ఇన్శాట్–3డీఎస్‌ని అభివృద్ధి చేశారు. ఇందులో ఆరు చానెల్ ఇమేజర్స్, 19 చానెల్ సౌండర్స్తోపాటు మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను అమర్చారు. వాతావరణ పరిశీలనతోపాటు భూమి, సముద్ర ఉపరితలాల అధ్యయనం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా సేవలు అందించనుంది. త్వరలో నిస్సార్ ప్రయోగం: సోమనాథ్ నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్(నిస్సార్) మిషన్ అనే జాయింట్ ఆపరేషన్ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జూన్‌లో జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. పీఎస్ఎల్వీ–సీ59, ఎస్ఎస్ఎల్వీ–డి3, జీఎస్ఎల్వీ–ఎఫ్15 ప్రయోగాలతో పాటు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ఆర్ఎల్వీ–టీడీ–2 ప్రయోగం కూడా నిర్వహించబోతున్నట్లు ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి మారుస్తారు. -
ISRO: నేడే జీఎస్ఎల్వీ సీ14 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్–3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎఫ్14 ఉపగ్రహ వాహక నౌకను నేడు ఇస్రో ప్రయోగించనుంది. ఇందుకోసం శుక్రవారం మధ్యాహ్నమే కౌంట్‌డౌన్ మొదలైందని తెలిసిందే. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగిస్తారు. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి మారుస్తారు. -
ఆదిత్య–ఎల్1 మొదటి కక్ష్య పెంపు విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మొదటిసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇ్రస్టాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) లాంటి భూనియంత్రత కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. శనివారం ప్రయోగం చేసినపుడు భూమికి దగ్గరగా 235 కిలోమీటర్లు, దూరంగా 19,500 కిలోమీటర్లు ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొదటి విడత కక్ష్య దూరం పెంపుదలలో భూమికి దగ్గరగా 235 కిలోమీటర్ల నుంచి 245 కిలోమీటర్లకు పెంచారు. భూమికి దూరంగా ఉన్న 19,500 కిలోమీటర్ల దూరాన్ని 22,459 కిలోమీటర్లకు పెంచారు. అంటే ప్రస్తుతం 245‘‘22459 కిలోమీటర్లు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూరా పరిభ్రమిస్తూ ఉంది. రాబోయే 15 రోజుల్లో మరో నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచుతూ ఈనెల 18న భూ మధ్యంతర కక్ష్య నుంచి సూర్యుని వైపునకు మళ్లిస్తారు. అక్కడి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు 1 వద్దకు చేర్చడానికి 125 రోజులు సమయం తీసుకుంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ‘ఇస్రో’ శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇది కూడా చదవండి: మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు? -
నేడే పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్ సాగుతుంది. శుక్రవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ షార్కు చేరుకున్నారు. శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాకెట్‌కు నాలుగో దశలో 0.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శనివారం రాత్రికి రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింõపుతారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. -
మామా.. మేమొస్తున్నాం...!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అది శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ (షార్) కేంద్రం. అటు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇటు యావద్దేశం ఊపిరి కూడా బిగబట్టి మరీ అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలైంది. 25.3 గంటల కౌంట్‌డౌన్‌కు నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు తెర పడింది. ఆ వెంటనే ఇస్రో బాహుబలి ఎల్వీఎం3–ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. గత వైఫల్యాల నేపథ్యంలో అంతటా ఉది్వగ్న వాతావరణం. అందరిలోనూ మరింత ఉత్కంఠ. మనసు మూలల్లో ఎక్కడో కాసింత అనుమానం. కానీ, ఉత్కంఠకు తెర దించుతూ, అనుమానాలను పటాపంచలు చేస్తూ మన బాహుబలి దిగి్వజయంగా రోదసి చేరింది. అంతరిక్ష సీమలో విజయనాదం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పదేళ్ల కల నెరవేరింది. చంద్రయాన్–1, 2 ప్రయోగాలు నిరాశ పరిచినా పట్టు వీడకుండా మొక్కవోని దీక్షతో మన శాస్త్రవేత్తల బృందం రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు ఫలించింది. ముచ్చటగా మూడోసారి చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. మూడు దశల ఎల్వీఎం3–ఎం4 రాకెట్ చంద్రయాన్–3 త్రీ–ఇన్–ఒన్ మిషన్‌ను విజయవంతంగా రోదసి చేర్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకుని ప్రముఖులంతా ఇస్రోను, ఇంతటి విజయానికి కారకులైన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఆ ఉది్వగ్న క్షణాలు... తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి శుక్రవారం చేపట్టిన చంద్రయాన్–3 ప్రయోగం సూపర్ సక్సెసైంది. 640 టన్నుల ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహకనౌక, 3,920 కిలోల చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు వేగంగా దూసుకెళ్లింది. వెంటనే మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ కంటిమీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. మూడు దశలతో కూడిన ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లో పూర్తిచేశారు. చంద్రయాన్–3 మిషన్‌ను భూమికి 36,500 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు ఇది 89వ విజయం. గ్రహాంతర ప్రయోగాల్లో చంద్రయాన్–3 నాలుగో ప్రయోగం కాగా చంద్రునిపై పరిశోధనల నిమిత్తం చేసిన ప్రయోగాల్లో మూడోది. ఇది ఇస్రో బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్–3 సిరీస్‌లో మూడు ప్రయోగాలు, ఎల్వీఎం–3గా పేరు మార్చాక నాలుగో ప్రయోగం! కార్యక్రమాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రధాని కార్యాలయ ప్రతినిధి జితేంద్రసింగ్ స్వయంగా షార్ కేంద్రం నుంచి వీక్షించారు. ప్రయోగం జరిగిందిలా... ► 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది. ► చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. ► ఎల్వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగి్వజయంగా ప్రయాణం ప్రారంభించింది. ► ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది. ► 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి. ► 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ► అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ► ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. ► రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ► ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీ టర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ► ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ► చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ► చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకలి్పంచగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు. చంద్రుడిపైకి ఇలా వెళ్తుంది... ► చంద్రయాన్–3 మిషన్ మరో 41 రోజుల్లో, అంటే ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. ► 16 రోజుల్లో ప్రొపల్షన్ మాడ్యూల్లో నింపిన 1,696 కిలోల ఇంధనాన్ని మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ► ఆగస్టు 1న ఐదోసారి ప్రొపల్షన్ మాడ్యూల్‌ను ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుని దిశగా మళ్లిస్తారు. ► తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్‌కు చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రో బర్న్ చేసి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యను తగ్గించే ప్రక్రియను నాలుగుసార్లు చేపడతారు. ► అలా ఆగస్టు 17న చంద్రయాన్–3 చంద్రుని కక్ష్యలోకి వెళుతుంది. తరవాత ప్రొపల్షన్ మాడ్యూల్ తన ఎత్తును 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ ల్యాండర్‌ను విడిచిపెడుతుంది. ► తరవాత ల్యాండర్‌లోని ఇంధనాన్ని కూడా మండించి ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో సాఫ్ట్ లాండింగ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ► ల్యాండర్ విడిపోయిన తరువాత ల్యాండర్‌ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ► ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. మొట్టమొదటిగా భారతే చేయడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది. ► చంద్రయాన్–1లో వాడిన పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ వాడారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని కూడా చంద్రయాన్–2 తరహాలోనే నిర్వహించారు. ► చంద్రయాన్–2లో ల్యాండర్, రోవర్లను తీసుకెళిన్ల ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలోనే పని చేస్తూ విలువైన సమాచారం అందిస్తూనే వుంది. ► అందుకే ఈసారి ఆర్బిటర్‌కు బదులు ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా ల్యాండర్, రోవర్లను పంపారు. ► ఈ ప్రయోగంలో ఇస్రో తొలిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజన్లను చంద్రుని ఉపరితలంపై మృదువైన చోట ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు ఇప్పట్నుంచే ప్రయతి్నస్తున్నారు. మనకిక ఆకాశమే హద్దు మంత్రి జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ చంద్రయాన్–3 ప్రయోగం నిజంగా సవాలేనని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగం విజయవంతమయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. దేశీయంగా రూపొందించిన ఎల్వీఎం3–ఎం4 రాకెట్ ద్వారా ప్రయోగం తొలి దశను విజయవంతం చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కలసికట్టుగా పని చేయడమే ఇంతటి భారీ విజయానికి కారణమన్నారు. ‘‘ఇక రాబోయే 41 రోజులు అత్యంత కీలకం. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రునిపై విజయవంతంగా దించేందుకు ప్రయతి్నస్తాం. ఆగస్టు మూడో వారంలో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాం. మిషన్ సూర్య, చంద్ర రెండింటినీ పూర్తి చేస్తామని నమ్మకముంది’’ అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో త్వరలో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. ఆగస్టు 23న ల్యాండర్ చంద్రునిపై దిగితే అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కు ఆకాశమే హద్దన్నారు. ఇస్రో చైర్మన్‌తో కలిసిరాకెట్, చంద్రయాన్–3 నమూనాలను ఆయన ఆవిష్కరించారు. భేటీలో చంద్రయాన్–3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్, మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన్‌కుమార్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
నింగిలోకి చంద్రయాన్.. ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు
-
భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో కొత్త అధ్యాయం: మోదీ
-
చంద్రయాన్-3 మిషన్ కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు: సోమ్‌నాథ్
-
జాబిలిపై అన్వేషణకు ఇస్రో చంద్రయాన్-3
-
Chandrayaan 3 Launch Visuals Video: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ - 3
-
‘విక్రమ్ ఎస్’ విజయంతో అంబరాన ప్రైవేటు సంబరం
అంతరిక్ష యానంలో మరో పెద్ద అడుగు ముందుకు పడింది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 550 కిలోల చిన్న రాకెట్ ‘విక్రమ్ ఎస్’ గతవారం గగనంలోకి దూసుకుపోవడం చారిత్రక ఘట్టం. దీంతో, రోదసీ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం విషయంలో మన దేశం ఒక్క ఉదుటున ముందుకు ఉరికినట్టయింది. భారత్‌లో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన తొట్టతొలి రాకెట్ ఇదే. హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ దీన్ని రూపొందించడం మరింత ఆనందదాయకం. రానున్న కాలంలో ఈ సంస్థ మరింత పెద్ద రాకెట్లను వరుసగా ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. అంటే, అంబర వీధిలో అనేక సంవత్సరాల భారత ప్రయత్నాలు మరో పెద్ద మలుపు తిరగనున్నాయన్న మాట. దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఒకపక్క ‘ఇస్రో’ ప్రధానపాత్ర కొనసాగిస్తుంటే, మరోపక్క దానికి పూరకంగా ప్రైవేట్ రంగం నిలబడనుంది. దీని పరిణామాలు, విపరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భారత అంతరిక్ష ప్రయోగాల మార్గదర్శి విక్రమ్ సారాభాయ్ పేరిట ‘విక్రమ్ ఎస్’ రాకెట్‌తో సాగించిన ఈ ‘ప్రారంభ్’ ప్రయోగం శుభారంభం. భారతీయ అంకుర సంస్థలు మరింతగా పాలు పంచుకొనేలా భారత అంతరిక్ష కార్యక్రమానికి తలుపులు తెరవాలన్న కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల ఇది సాధ్యమైంది. నిజానికి, వినువీధిలోకి అంతరిక్ష ప్రయోగ వాహన నౌకలను పంపడం మంచి గిరాకీ ఉన్న వ్యాపారం. ఇటీవలి దాకా అందులో ఆయా దేశ ప్రభుత్వాలదే ఆధిపత్యం. ఎలన్ మస్క్ తన ‘స్పేస్ ఎక్స్’ సంస్థతో దానికి గండి కొట్టింది. త్వరలోనే అమెజాన్ వారి ‘బ్లూ ఆరిజన్’ రాకెట్ మార్కెట్లోకి రానుంది. అంతరిక్షంలోని సరికొత్త వాణిజ్య అవకాశాలను అంది పుచ్చుకోవడానికి అంతర్జాతీయ సహకారం పెరుగుతుండడంతో ప్రైవేట్ రంగ వికాసానికి దారులు పడ్డాయి. ఒకప్పుడు మన విహాయస ప్రయోగాలకు అభివృద్ధి, దేశ ప్రతిష్ఠలే మూలమంత్రాలు. ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌కు ఉపగ్రహ వినియోగం, చంద్రమండల శోధన, గగనాంతర గవేషణ లాంటివి ముందుకొచ్చాయి. అలా వ్యాపారం, ఆర్థికవ్యవస్థ వచ్చి చేరాయి. శరవేగంగా పెరుగుతున్న ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం 45 వేల కోట్ల డాలర్లు. పదేళ్ళలో ఇది ఏకంగా లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందట. ఇందులో ఇప్పుడు భారత్ వాటా 2 శాతమే. రానున్న వత్సరాల్లో మన వాటాను చకచకా 8 శాతానికి పెంచాలన్నది ప్రధాని మాట. ప్రైవేట్ రంగ సంస్థలకు సైతం పెద్ద పీట వేస్తేనే ఆ వాటా పెరుగుదల సాధ్యం. ఆ క్రమంలో వచ్చినదే తాజా ‘విక్ర’మార్కు విజయం! ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో అనేక ప్రపంచ దేశాలు ఇప్పటికే చాలా ముందుకు పోయాయి. వారిని అందుకొనేందుకు మనం బహుదూరం ప్రయాణించాల్సి ఉంది. మన ప్రైవేట్ రంగంలోనూ ప్రతిభాపాటవాలున్నాయి. వాటి వినియోగానికి ప్రభుత్వం విధానపరంగా తగిన వాతావరణం కల్పిస్తే సుదీర్ఘ యానం సంక్షిప్తమవుతుంది. ఇన్నేళ్ళ భారత అంతరిక్ష ప్రయోగ పరిణామ క్రమంలో ప్రైవేట్ రంగ పాత్ర లేనే లేదనుకుంటే పొరపాటు. గోద్రెజ్ అండ్ బోయిస్, లార్సెన్ అండ్ టుబ్రో, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ లాంటి అనేక ప్రైవేట్ రంగ సంస్థలు తమ వంతు భాగస్వామ్యం వహించాయి. ఇప్పుడిక స్కైరూట్ లాంటి స్టార్టప్‌లు నక్షత్రపథాన నవీన కల్పనలకు పాదులు వేస్తాయి. అయితే, ఆకసాన బలమైన ఆర్థికశక్తిగా ఎదగాలంటే భారీ సంస్థల ప్రవేశం అనివార్యం. ప్రస్తుతానికి మన అంకుర సంస్థలకు విదేశీ మూలధనమే ఆధారం. మచ్చుకు విక్రమ్‌ను ప్రయోగించిన స్కైరూట్ సంస్థలో ప్రధాన పెట్టుబడులు సింగపూర్‌వి. రేపు మన అంతరిక్ష ప్రయోగాలు తలుపులు బార్లా తెరిచినప్పుడు పాశ్చాత్య సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం ఖాయం. ఇవాళ ప్రపంచమంతటా జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ భాగస్వామ్యమూ పెరుగుతోంది. 50 ఏళ్ళ క్రితం చంద్రునిపై మానవుడి ‘అపోలో’ ప్రయోగాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా అమెరికా నిర్వహించింది. వారం క్రితం నవంబర్ 16న మరోసారి చంద్రుని పైకి ‘ఆర్టెమిస్1’ రాకెట్ ప్రయోగాన్ని ఫ్రాన్స్, కెనడా, జపాన్‌లతో కలసి బహుళ దేశాల ప్రయత్నంగా జరిపింది. రష్యా, చైనాలు చుక్కలతోవలో చెట్టపట్టాలు వేసుకోవడమే కాక నెలవంకపై దీర్ఘకాల మానవ ఆవాసానికి సంయుక్త స్థావరం నెలకొల్పే పనిలో ఉన్నాయి. రయ్యిమంటూ రోదసీలోకి సాగిన మన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని వీటన్నిటి నేపథ్యంలో చూడాలి. వచ్చే పదేళ్ళలో దేశంలో 20 వేలకు పైగా చిన్న ఉపగ్రహాలు నింగికి ఎగురుతా యట. వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, ప్రైవేట్ ప్రయోగశాలలు తాము తీర్చిదిద్దిన ఉపగ్రహా లను ప్రైవేట్ రాకెట్లతో దివికి పంపి, వాతావరణ, భూవిజ్ఞాన సమాచారాన్ని సేకరిస్తాయి. వెరసి, నిన్నటి దాకా ప్రభుత్వ ఆధిపత్యంలోని అంబర చుంబన యాత్రలో ప్రైవేట్ పాదముద్రలు బలంగా పడనున్నాయి. 2020 జూన్‌లోనే అంతరిక్ష కార్యకలాపాలన్నిటా ప్రైవేట్‌కు సర్కారు ద్వారాలు తీసింది. పరిశోధనలకూ, పోటీ తత్త్వానికీ తోడ్పడే ఈ మార్పును స్వాగతిస్తూనే తగు జాగ్రత్తలూ తప్పవు. అంతా ప్రైవేటైపోతే, దేశ రక్షణ మాటేమిటన్న భయాలను పాలకులు పోగొట్టాలి. ఇస్రో అనుభవాన్నీ, మార్గదర్శనాన్నీ వాడుకోవాలి. అమెరికాలో నాసాలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానం మేలు. 350కి పైగా ప్రైవేట్ అంతరిక్ష సంస్థలతో అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీల తర్వాత మనది 5వ స్థానం. భవిష్యత్తులో చుక్కల తోటలో ఎక్కడుంటామో ఆసక్తికరం. ఇదీ చదవండి: సైన్సు అవార్డుల్లో కోతలా? -
పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగానికి రంగం సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ53 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన 25 గంటల కౌంట్‌డౌన్ బుధవారం మొదలైంది. సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. గురువారం సాయంత్రం 6.02 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ–53 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ టాప్ ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి. -
రోదసిలోకి భూ పరిశీలన ఉపగ్రహం
సూళ్లూరుపేట: భూ పరిశీలన ఉపగ్రహం రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ (ఈఓఎస్–4)ను ఇస్రో సోమవారం రోదసిలోకి ప్రవేశపెట్టనుంది. పీఎస్ఎల్వీ – సి 52 ద్వారా 1710 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–4తో పాటు భారత దేశంలోని ఐఐటీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన రెండు చిన్న ఉపగ్రహాల (ఇన్స్పైర్ శాట్–1, ఐఎన్ఎస్–2టీడీ)ను కూడా రోదసీలోకి పంపుతున్నారు. శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సి 52ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో శనివారం ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రెవ్యూ) సమావే శం నిర్వహించారు. రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి ప్రయోగాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ రాజరాజన్‌కు అప్పగించారు. ఆయన ఇతర శాస్త్రవేత్తలతో లాంచ్ సమావేశం నిర్వహించి ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఆదివారం ఉదయం 4.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 25.35 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఉపగ్రహాలను 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రసన్ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఈఓఎస్–4 ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్, భూమిపై జరిగే మార్పులు, వరదలు, వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాల ద్వారా సమాచారాన్ని అందిస్తుంది. శ్రీవారి వద్ద పీఎస్ఎల్వీ – సి52 నమూనాకు ప్రత్యేక పూజలు తిరుమల: పీఎస్ఎల్వీ – సి52 నమూనాకు శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమూనాను ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమలకు తీసుకువచ్చింది. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. నమూనాను శ్రీవారి మూల విరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. మరిన్ని ప్రయోగాలకు సిద్ధం: – ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్–3, గగన్‌యాన్–1కు సంబంధించి పలు ప్రయోగాత్మక పరీక్షలు చేపడతామన్నారు. పీఎస్ఎల్వీ– సి 52 ప్రయోగం విజయవంతం కావాలని శనివారం సాయంత్రం సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రయోగాలకు అంతరాయం కలిగిందన్నారు. ఇస్రో చైర్మన్‌గా తనకు ఇది తొలి ప్రయోగం కావడంతో విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ దేశంలో ఉన్న సామాన్యుడికి కూడా దీర్ఘకాలిక సేవలందిస్తుందని తెలిపారు. పీఎస్ఎల్వీ సీ–53 ప్రయోగానికి కూడా సిద్ధమవుతున్నామని తెలిపారు. ఆయన వెంట షార్ అధికారి గోపీకృష్ణ తదితరులు ఉన్నారు. -
గగన్‌యాన్ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్ట్ పనులు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేపడుతున్నారని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు. బుధవారం షార్‌లోని స్పేస్ సెంట్రల్ స్కూల్లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. రాజరాజన్ జాతీయ జెండాను ఎగు రవేశారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ షార్ లో కోవిడ్ కారణంగా రెం డేళ్లుగా ప్రయోగాల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. షార్‌లోని ప్రయోగ వేదికలను గగన్‌యాన్ ప్రాజె క్ట్‌తో పాటు చంద్రయాన్–3 ప్రయోగానికి సంబం ధించి అనేక ప్రయోగాత్మక పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి మౌలిక సదుపాయాలను నిర్దేశించిన సమయంలో పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసేందుకు పని చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఘన ఇంధన మోటార్లు ఉత్పత్తి, ప్రయోగ పరీక్షలను చేస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ, కనెక్టివిటీ నినాదంతో ఇస్రో పని చేస్తోందని చెప్పారు. నేడు దేశంలో 850 చానల్స్ చూడగలుగుతున్నామంటే అది ఇస్రో చేస్తున్న ప్రయోగాల వల్లేనన్నారు. దేశ సరిహద్దుల్లో చొరబాట్లు, ఉగ్రవాదుల కదలికలు వంటి వాటిని టెక్నాలజీ ద్వారా కనిపెట్టగలుగుతున్నామన్నారు. -
పీఎస్ఎల్వీ సీ53 అనుసంధాన పనులు ప్రారంభం
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ అనుసంధాన పనులు ప్రారంభమయ్యాయి. రెండు, మూడుదశల పరీక్షలు జరుగు తున్నాయి. ఈ నెల 20న ఈ ప్రయోగాన్ని నిర్వహిం చాలని నిర్ణయించారు. అయితే ఉపగ్రహం రావడంలో జాప్యం జరిగితే ప్రయోగం ఫిబ్రవరికి వాయిదా పడే అవకాశముందని సమాచారం. పీఎస్ఎల్వీ సీ53 ద్వారా ఈఓఎస్–6(ఓషన్‌శాట్–3) అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు. -
జీఎస్ఎల్వీ–ఎఫ్10కు నేటి నుంచి కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గురువారం ఉదయం 5.43 గంటలకు సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ–ఎఫ్ 10 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని కోసం బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తున్నారు. మంగళవారం ఉదయం ఇస్రో చైర్మన్ శివన్ నేతృత్వంలో షార్‌లో మిషన్ సంసిద్ధత సమావేశం జరిగింది. అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మధ్యాహ్నం మరోసారి సమావేశమై కౌంట్‌డౌన్, ప్రయోగంపై చర్చించారు. రాకెట్‌లోని రెండో దశలో భాగంగా ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను బుధవారం తెల్లవారుజామున కౌంట్‌డౌన్ ప్రారంభమైన వెంటనే చేపట్టనున్నారు. 26 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం ఉదయం 5.43కు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్)–03తో జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. -
EOS-03: సిద్ధమవుతున్న 'జీఎస్ఎల్వీ ఎఫ్10'
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 12న తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ప్రయోగానికి సన్నద్ధం చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా కరోనా కారణంగా షార్‌లో ప్రయోగాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక పీఎస్ఎల్వీ ప్రయోగం తరువాత షార్ కేంద్రంలో కరోనా విజృంభించడంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. 2020లో నాలుగు సార్లు వాయిదా పడిన జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగం ఐదో ప్రయత్నంలో విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేయనున్నారు. – సూళ్లూరుపేట కొత్త అధ్యాయానికి నాంది.. జీఎస్ఎల్వీ ఎఫ్10 (జీఎస్ఎల్వీ మార్క్2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–03) అనే ఈ నూతన ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి దాకా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. ఈసారి ఈవోఎస్–03 అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రత్యేకతలు.. ► శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇది 79వ ప్రయోగం. ► జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల సిరీస్‌లో 14వ ప్రయోగం. ► సొంత క్రయోజనిక్ టెక్నాలజీలో ఇది 8వ ప్రయోగం. ► దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్–03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ► ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (6 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (158 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ షార్ట్ వేవ్–ఇన్ఫ్రారెడ్ (256 బాండ్స్) పేలోడ్స్‌గా అమర్చారు. ► ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. సుమారు 10 సంవత్సరాలు ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తుంది. -
షార్‌లో పాక్షిక లాక్డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు గుండెకాయ వంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో పాక్షికంగా లాక్డౌన్ విధించారు. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. షార్ కేంద్రంలోని ఉద్యోగుల్లో కోవిడ్ ప్రబలుతుండడంతో షార్ డైరెక్టర్, కంట్రోలర్, ఇతర అధికారులంతా కలిసి ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్‌కు పరిస్థితులను వివరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షార్ కేంద్రానికి సంబంధించి సూళ్లూరుపేట పట్టణంలో పులికాట్ నగర్ (కేఆర్పీ కాలనీ) స్వర్ణముఖినగర్ (డీఓఎస్ కాలనీ), పినాకినీ నగర్ (డీఆర్డీఎల్ కాలనీ)ల్లో కోవిడ్ విజృంభిస్తుండడంతో టెస్ట్‌లు చేస్తున్నారు. ఈ మూడు కాలనీల్లో 600 కరోనా పాజిటివ్ కేసులున్నట్లు గుర్తించారని సమాచారం. కరోనా నేపథ్యంలో 50% మందే బుధవారం నుంచి విధుల్లోకి వెళ్లే విధంగా నిర్ణయం తీసుకున్నారు. షార్ కేంద్రంలో 2 వేల మంది రెగ్యులర్, మరో 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రయోగాలకు బ్రేక్ ? కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రాకెట్ ప్రయోగాలకు బ్రేక్ పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెలాఖరుకు జీఎస్ఎల్వీ ఎఫ్ 10 ప్రయోగాన్ని చేయాలని అనుకున్నారు. అది కూడా ఈ నెలాఖరులో నిర్వహిస్తారా! లేదా అనే విషయం కూడా ప్రకటించలేకపోతున్నారు. గతేడాది ఇదే సమయంలోనే కరోనా పరిస్థితుల కారణంగా ప్రయోగాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోవిడ్ నిబంధనల మేరకు రెండు ప్రయోగాలు చేశారు. ఈ విషయంపై షార్ అధికారిని సంప్రదించగా.. ప్రయోగాలకు ఎలాంటి ఆటంకం ఉండదని, ఆలస్యం అయ్యే అవకాశం మాత్రం ఉండొచ్చునని చెప్పారు. -
పీఎస్ఎల్వీ–సీ51 ప్రయోగంలో తిరుపతి విద్యార్థులు
యూనివర్సిటీ క్యాంపస్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ51 ఉపగ్రహ ప్రయోగంలో తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థులు యజ్ఞసాయి, రఘుపతి భాగస్వాములయ్యారు. మరో ఐదుగురితో కలిసి వారిద్దరూ రూపొందించిన సతీష్ ధావన్ శాట్.. పీఎస్ఎల్వీ–సీ51 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 1.9 కిలోల బరువున్న శాట్ కోసం వీరు దాదాపు 4 నెలలపాటు శ్రమించారు. ఏరోస్పేస్లో ఇంజనీరింగ్ చేసిన యజ్ఞసాయికి ఇది మూడో ఉపగ్రహం కాగా రఘుపతికి తొలి ఉపగ్రహం. తిరుపతికి చెందిన కంబాల రాము, వాణిల కుమారుడు కె.యజ్ఞసాయి తన విద్యాభ్యాసమంతా తిరుపతిలోనే పూర్తి చేశాడు. చెన్నైలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఈ సమయంలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ నాసాకు వెళ్లే అవకాశం కల్పించింది. దీంతో తన డిగ్రీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కు మార్చుకున్నాడు. కలాం శాట్, కలాం శాట్ వీ2 ఉపగ్రహాల తయారీలో పాలుపంచుకున్నాడు. తిరుపతికి చెందిన ఫళణి(హమాలీ), మంజుల కుమారుడైన రఘుపతి ఎంటెక్ చేశాడు. అవకాశం ఇలా.. అంతరిక్షం పట్ల ఆసక్తి కలిగినవారికి చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ శిక్షణ ఇస్తుంది. ఆ సంస్థ సీఈవో శ్రీమతి కేశన్ ప్రోత్సాహంతో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. తాజాగా పంపిన సతీష్ ధావన్ శాట్ భూమికి 530 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో తిరుగుతుంది. తక్కువ శక్తితో ఎక్కువ డేటాను సమర్థవంతంగా ఉపయోగించే పరిశోధనలు చేస్తుంది. సతీష్ ధావన్ శాట్ ఉపగ్రహం -
ఇస్రో సూపర్ సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ51 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఈ ఏడాది మొట్టమొదటగా ఆదివారం ఉదయం 10.24 గంటలకు ప్రయోగించిన రాకెట్ విజయంతో శుభారంభమైంది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగంతో షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన 78వ ప్రయోగం ఇది. 44.4 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ సీ51 రాకెట్‌కు సంబంధించి శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగి వైపు దూసుకెళ్లింది. 1.38 గంటల వ్యవధిలో 19 ఉపగ్రహాలను భూమికి 537 నుంచి 637 కిలో మీటర్లు పరిధిలోని వివిధ సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది. ఇటీవల ఏర్పాటైన ఇస్రో అనుబంధ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్యపరంగా చేపట్టిన ఈ మొట్టమొదటి మిషన్‌లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01 ఉపగ్రహం ప్రధానమైంది. 637 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని 17.23 నిమిషాల్లో సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత పీఎస్ఎల్వీ సీ51 రాకెట్లో నాలుగో దశలో అమెరికాకు చెందిన స్పేస్‌బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్–1 కాంటాక్ట్–2 అనే మరో ఉపగ్రహంతో కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని ఒకసారి, తమిళనాడు కోయంబత్తూరులోని శ్రీశక్తి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన శ్రీ శక్తిశాట్, శ్రీపెరంబుదూర్‌లోని జెప్పియర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జిట్‌శాట్, మహారాష్ట్ర నాగపూర్‌లోని జీహెచ్ రాయ్సోనీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జీహెచ్ఆర్సీ ఈశాట్ మూడు ఉపగ్రహాలను యూనిటిశాట్స్‌ను, న్యూ స్పేస్ ఇండియాలో భాగంగా భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించిన సింధునేత్ర, సతీష్ ధవన్ శాట్‌లను కలిపి మరో శ్రేణిగా చేర్చి రోదసీలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టడంతో ప్రయోగం పూర్తయింది. ఈ మిషన్‌తో ఇస్రో ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించినట్లయింది. 14 మిషన్ల ప్రయోగమే లక్ష్యం: డాక్టర్ కె.శివన్, ఈ ఏడాదిలో 14 మిషన్లు ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేయాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు పిలుపునిచ్చారు. పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగం విజయవంతమైన అనంతరం శివన్ షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ 14 మిషన్ల ప్రయోగంలో భాగంగా 7 లాంచింగ్ వెహికల్స్, ఆరు ఉపగ్రహాలు, ఒక మానవరహిత ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 2020లో కోవిడ్–19 వల్ల ప్రయోగాల విషయంలో వెనుకబడ్డామని, ఇకపై వేగం పెంచుతామని తెలిపారు. బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01ను ఇక్కడ నుంచి ప్రయోగించడం సంతోషంగా ఉందన్నారు. అనుకున్న ప్రకారం 17.23 నిమిషాలకు అమెజానియా–01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన కొద్ది నిమిషాలకు సోలార్ ప్యానెల్స్ పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా అమెజానియా–01 ఉపగ్రహం సక్సెస్ పుల్గా కక్ష్యలోకి చేరుకున్నందుకు సంతోషంగా ఉందని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ కెసార్ పొంటీస్ అన్నారు. ప్రయోగం విజయం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ అమోఘం అని, ఈ రాకెట్ తయారు చేసిన టీంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌లో ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం పలికేందుకు న్యూ స్పేస్ ఇండియాను ఏర్పాటు చేశామని సీఎండీ నారాయణన్ తెలిపారు. భారత్‌లో ప్రైవేట్ సంస్థలకు చెందిన వారు ఉప గ్రహాలను తయారు చేసుకుంటే వాటిని ఇస్రో ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రముఖుల అభినందనలు వాణిజ్యపరంగా మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధాని మోదీ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. దేశం చేపట్టిన సంస్కరణలు అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి నాందిపలికాయన్నారు. అమెజానియా ప్రయోగం విజయవంతం కావడంపై బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోకు ప్రధాని అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారానికి నాందికానుందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రోకు ఏపీ గవర్నర్ అభినందనలు సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సి–51 రాకెట్ ప్రయోగం విజయవంతంకావడంపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రి అభినందనలు పీఎస్ఎల్వీ –సీ 51 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో చేపట్టే అన్ని ప్రయోగాల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51
సూళ్లూరుపేట/తిరుమల/శ్రీకాళహస్తి: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించింది. పీఎస్ఎల్వీ సీ 51 ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా–1 ఉపగ్రహం(637 కిలోల బరువు), అమెరికాకు చెందిన స్పేస్ బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్–1 నానో కాంటాక్ట్–2 ఉపగ్రహాలు, న్యూ స్పేస్ ఇండియా పేరుతో భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన సతీష్ ధవన్ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వీటిలోని ఒక శాటిలైట్‌లో తొలిసారిగా మోదీ ఫొటో, భగవద్గీత అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వైఎస్ జగన్ అభినందనలు.. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్
అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా 2021లో తొలి హిట్ కొట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. తన నమ్మకమైన వాహకనౌక పీఎస్ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు అన్ని పరీక్షలు పూర్తి చేశారు. మొదటి ప్రయోగవేదిక నుంచి రోదసిలోకి రాకెట్ దూసుకుపోవడమే మిగిలింది. సూళ్లూరుపేట: కరోనా లాక్‌డౌన్‌తో 2020 నింపిన చేదు అనుభవాలను అధిగమించి 2021లో సరికొత్త అడుగులేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. ఒక వైపు చంద్రయాన్ – 3, ఆదిత్య – ఎల్ 1, గగన్‌యాన్‌కు సిద్ధమవుతూనే.. వాణిజ్యపరమైన ప్రయోగాలు చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా షార్ నుంచి ఆదివారం ఉదయం 10.24కు పీఎస్ఎల్వీ సీ – 51 ఉపగ్రహ వాహకనౌకకు నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి 25 గంటల ముందుగా శనివారం ఉదయం 8.54కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా – 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించాక పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగం కావడం దీని ప్రత్యేకత. ప్రయోగ ప్రక్రియ ఇలా.. పీఎస్ఎల్వీ సీ – 51 రాకెట్‌ను పీఎస్ఎల్వీ డీఎల్‌గా పిలుస్తారు. ఈ తరహాలో ఇది మూడో ప్రయోగం కావడం విశేషం. ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండడంతో దీన్ని రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో నిర్వహించనున్నారు. ఈ ప్రయోగంలో నాలుగో దశ (పీఎస్ – 4)లో రెండుసార్లు మండించి 18 ఉపగ్రహాలను రెండుసార్లుగా సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. రాకెట్‌లోని మొదటి దశ 1.49 నిమిషం పూర్తికాగానే, 2.42 నిమిషాలకు నాలుగో దశలో ఉపగ్రహాలను అమర్చిన హీట్‌షీల్డ్ విడిపోతుంది. అనంతరం రెండో దశ 4.22 నిమిషాలకు, మూడో దశ 8.15 నిమిషాలకు పూర్తయి 16.36 నిమిషాలకు నాలుగో దశ కటాఫ్ అవుతుంది. అనంతరం 17.23 నిమిషాలకు బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా – 01 ఉపగ్రహాన్ని భూమికి 537 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. అనంతరం 01:01:09 గంటలకు పీఎస్ – 4ను రీస్టార్ట్ చేసి 01:01:19 గంటలకు కటాఫ్ చేస్తారు. మళ్లీ రెండోసారి 01:49:52 గంటలకు రీస్టార్ట్ చేసి 01:52:00 గంటలకు కటాఫ్ చేస్తారు. ఆ తర్వాత 01:51:32 గంటలకు యూఎస్ చెందిన స్పేస్‌బీస్ శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్ – 1 నానోకాంటాక్ట్ – 2 అనే మరో ఉపగ్రహాన్ని కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని సన్‌సింక్రనస్ అర్బిట్‌లో ప్రవేశపెడతారు. మళ్లీ 01:55:07 గంటలకు భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన ఉపగ్రహాలు సతీష్ ధవన్‌శాట్, సింధునేత్ర, వివిధ రకాల యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన యూనిటీశాట్‌లో భాగంగా ఉన్న శ్రీశక్తిశాట్, జిట్‌శాట్, జీహెచ్ఆర్సీ ఈశాట్ అనే ఐదు ఉపగ్రహాల శ్రేణిని అంతరిక్ష కక్ష్యలోకి వదిలిపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేసుకున్నారు. మొదటి ప్రయోగవేదిక నుంచి 39వ ప్రయోగం కాగా, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 78వది, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగం కావడం విశేషం. చదవండి: బాబు వ్యూహం.. కేశినేనికి చెక్! శభాష్ ఏపీ.. ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు -
పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 28న పీఎస్ఎల్వీ సీ51 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనుంది. ఉదయం 10.23కు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి 21 ఉపగ్రహాలతో ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. పలు వర్సిటీల విద్యార్థులు యూనిటీ శాట్స్ అనే పేరుతో తయారు చేసిన సతీష్ ధవన్ శాట్–1, జిట్ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్, శ్రీశక్తి శాట్, సింధు నేత్ర, ఆనంద్ అనే ఉపగ్రహాలతో పాటు పలు ఉపగ్రహాలను ఇస్రో పంపించనుంది. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ ప్రయోగాలు విజయవంతం కావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. (నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్) ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది.. పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీబీ హరిచందన్ అభినందించారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని అధిగమించిందని అన్నారు. కోవిడ్ సమయంలో కూడా ప్రయోగాలను విజయవంతం చేయడం ఇస్రో శాస్త్రవేత్తల అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. భవిష్యత్‌లో ఇస్కో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్
సాక్షి, సూళ్లూరుపేట: శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను నింగిలోకి ఇస్రో పంపింది. సీ-బ్యాండ్ సేవల విస్తరణకు సీఎంఎస్-01 దోహదపడనుంది. ఏడేళ్లపాటు సేవలందించనుంది. జిశాట్-12 స్థానాన్ని సీఎంఎస్-01 శాటిలైట్ భర్తీ చేయనుంది. సీఎంఎస్ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం కాగా, పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది. (చదవండి: ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్) ఇస్రో చైర్మన్ హర్షం.. పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్ కే శివన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాటిలైట్ అద్భుతంగా పని చేస్తోందని, నాలుగు రోజుల్లో నిర్ణీత స్లాట్‌లో ప్రవేశపెడతామని శివన్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎస్ఎల్వీ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తోంది. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయాన్ని తీసుకొచ్చేగనిగా మారింది. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎలీ్వకే సొంతం. ఇప్పటి వరకు 51 పీఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి. గురువారం నాటి ప్రయోగంతో మరో కీలక ఘట్టానికి షార్ వేదికైంది. (చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్) ♦పీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో రెండు రకాలుగా ఉపయోగిస్తోంది. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేటప్పుడు స్ట్రాఫాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. దీన్ని కోర్ అలోన్ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు. ♦ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లాలంటే అత్యంత శక్తివంతమైన స్ట్రాపాన్ బూస్టర్లతో చేస్తారు. ఈ తరహా ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఇప్పటికి 21 ప్రయోగాలు చేశారు. ♦ఇటీవలి కాలంలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ – క్యూఎల్, నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ – డీఎల్ అనే పేర్లతో చేస్తున్నారు. ♦వీటి ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (దూర పరిశీలన ఉపగ్రహాలు), చంద్రయాన్ ∙1, మంగళ్యాన్ – 1 లాంటి గ్రహాంతర ప్రయోగాలు, భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించి దేశ ప్రజలకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో పీఎస్ఎల్వీ అగ్రగామిగా ఉంది. ♦ఎక్కువ ఉపగ్రహాలను మోసుకెళ్లి సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో వివిధ రకాల కక్ష్యల్లో ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండే రాకెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఓకే ఆర్బిట్.. ఎనిమిది రకాల కక్ష్యలు ఒకే ఆర్బిట్‌లో ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించి ఎక్కువ ఉపగ్రహాలను తీసుకెళ్లిన ఘనత పీఎస్‌ఎలీ్వదే. గతేడాది జనవరి 24న పీఎస్ఎల్వీ సీ – 44 రాకెట్లో నాలుగో దశను ప్రయోగాత్మకంగా చేసి రెండు రకాల కక్ష్యల్లో మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగమిచ్చిన విజయంతో ఏప్రిల్ 1న పీఎస్ఎల్వీ సీ – 45 ప్రయోగంలో నాలుగోదశ (పీఎస్ – 4) ద్వారా మూడు రకాల కక్ష్యల్లో 29 ఉపగ్రహాలను విడివిడిగా ప్రవేశపెట్టగలిగారు. ♦జనవరి 24న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ – 44 ద్వారా పీఎస్ – 4 దశలో సూర్యానువర్తన ధ్రువకక్ష్యలోనే ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించింది. ♦భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉపగ్రహాలను భూమికి 800 కిలోమీటర్ల ఎత్తు నుంచి 504 కిలోమీటర్లు తగ్గించుకుంటూ వస్తే 8 రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే వీలుంటుందని గుర్తించింది పీఎస్ఎల్వీ రాకెట్టే కావడం గమనార్హం. పీఎస్ఎల్వీ సీ – 45లోని పీఎస్ – 4 దశ ముందుగా 753 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ఈఎంఐ శాట్ అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాక పీఎస్ – 4 దశను మండించి మళ్లీ కిందికి తీసుకొచ్చి 508 కిలోమీటర్ల ఎత్తులో కొన్ని ఉపగ్రహాలు, 505 కిలోమీటర్ల ఎత్తులో మరికొన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించింది కూడా పీఎస్ఎల్వీ రాకెట్టే కావడం గమనార్హం. -
నేడు పీఎస్ఎల్వీ సీ50 ప్రయోగం
సూళ్లూరుపేట/తిరుమల/శ్రీకాళహస్తి: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహక నౌకకు బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం మిషన్ సంసిద్ధతా సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ప్రయోగానికి 25 గంటల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా 1,410 కిలోల బరువు గల సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ ఎత్తులో, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని దీర్ఘ వృత్తాకార జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని.. పీఎస్ఎల్వీ–సీ50 ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో డిప్యూటీ సెక్రటరీ లక్ష్మణ్ బుధవారం తిరుమల,శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. పీఎస్ఎల్వీ–సీ50 నమూనాను శ్రీవారి పాదాల చెంత, శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. నింగివైపు దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహక నౌక -
ఈవోఎస్–01 ఉపగ్రహానికి విచ్చుకున్న యాంటెన్నా
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 7న పీఎస్ఎల్వీ సీ–49 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–01) ఉపగ్రహానికి మంగళవారం సాయంత్రం రేడియల్ రిబ్ యాంటెన్నా విజయవంతంగా విచ్చుకున్నట్టు ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది. వ్యవసాయం, అటవీ, విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాంటెన్నా ఉపగ్రహ సమాచారాన్ని అందించేందుకు కీలక భూమిక పోషిస్తుంది. ఉపగ్రహ సేవలు బుధవారం నుంచే అందుబాటులోకి వస్తాయని ఇస్రో ప్రకటించింది. -
పీఎస్ఎల్వీ సీ49 సూపర్ సక్సెస్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ49 (పీఎస్ఎల్వీ–డీఎల్) ప్రయోగం విజయవంతమైంది. ముందుగా నిర్ణయించిన కాలం ప్రకారం మధ్యాహ్నం 3:02 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా 3:11 గంటలకు ప్రయోగించారు. ఏకంగా 10 ఉపగ్రహాలు ఈ ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు 630 కిలోల బరువు కలిగిన పది ఉపగ్రహాలను 575 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్త ధ్రువకక్ష్యలోకి (సన్ సింక్రనస్ ఆర్బిట్) విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ద్వారా దేశీయ అవసరాల నిమిత్తం రూపొందించిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) అనే ఉపగ్రహంతో పాటు లిథువేనియాకు చెందిన ఆర్–2, లక్జెంబర్గ్‌కు చెందిన కేఎస్ఎం–1ఏ, కేఎస్ఎం–1బీ, కేఎస్ఎం–1సీ, కేఎస్ఎం–1డీ, అమెరికాకు చెందిన లిమూర్ అనే ఉపగ్రహాల శ్రేణిలో నాలుగు ఉపగ్రహాలను నిరీ్ణత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) ఉపగ్రహాన్ని మన దేశ అవసరాల కోసం రూపొందించారు. ఇది రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహమే అయినప్పటికీ, ఇందులో ఉన్న శక్తిమంతమైన కెమెరాలు రైతులకు ఉపయోగపడేలా, వ్యవసాయానికి సంబంధించిన పలు విషయాల పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తుంది. అద్భుతమైన ప్రయోగం: ఇస్రో చైర్మన్ ఇదొక అద్భుతమైన ప్రయోగమని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ అన్నారు. 10 ఉపగ్రహాలను ముందుగా అనుకున్న ప్రకారమే విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. ఈఓఎస్–01 కక్ష్యలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే సోలార్ ప్యానల్స్ కూడా విజయవంతంగా విచ్చుకున్నామని తెలిపారు. కోవిడ్–19 పరిస్థితులను అ«ధిగమించి విజయం సాధించామన్నారు. రాకెట్ అనుసంధానం చేసేటపుడు కభౌతిక దూరాన్ని పాటించినట్లు చెప్పారు. అభినందనల వెల్లువ పీఎస్ఎల్వీ–సీ49 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు, ప్రయోగంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ప్రధాని మోదీ అభినందించారు. 10 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశంలో వ్యవసాయం, అటవీ, విపత్తుల నిర్వహణకు ఈఓఎస్–01 ఉపగ్రహం ఎంతో తోడ్పడుతుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
పీఎస్ఎల్వీ సీ49 కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ సీ49 (పీఎస్ఎల్వీ–డీఎల్) ఉపగ్రహ వాహకనౌకను నింగిలోకి పంపనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్టు (ల్యాబ్)వారికి అప్పగించడంతో వారు ప్రయోగానికి 26 గంటల ముందు అంటే శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01)తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్‌ంబర్గ్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఒక చిన్న తరహా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. -
7న పీఎస్ఎల్వీ–సీ49 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 7వ తేదీన సాయంత్రం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ–సీ49 (పీఎస్ఎల్వీ–డీఎల్) ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించి 6వ తేదీన మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిస్తారు. పీఎస్ఎల్వీ–డీఎల్ రెండో ప్రయోగమిది పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో రెండోసారి ప్రయోగిస్తున్న సరికొత్త రాకెట్ ఇది. రెండే రెండు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో చేస్తున్న ప్రయోగం కావడంతో దీనికి పీఎస్ఎల్వీ–డీఎల్ అని నామకరణం చేశారు. ఈ తరహా రాకెట్‌ను తొలిసారి గత ఏడాది జనవరి 24న ప్రయోగించి విజయం సాధించారు. ఉపగ్రహాల బరువు చాలా తక్కువ కావడంతో ఖర్చు తగ్గించుకోవడానికి రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో ప్రయోగం చేస్తున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01)గా పిలిచే స్వదేశీ నూతన ఉపగ్రహంతో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన తేలికపాటి ఉపగ్రహాలను భూమికి అత్యంత చేరువలోని సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ప్రయోగాన్ని అత్యంత తక్కువ సమయంలోనే అంటే 13.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. -
నాలుగు దశాబ్దాల తర్వాత విరామం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మనుషుల జీవన గమనంతో పాటు మనదేశ సాంకేతిక అభివృద్ధిని కూడా అడ్డుకుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో కనీవినీ ఎరుగని రీతిలో రాకెట్ ప్రయోగాలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా షార్ కేంద్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో లాక్డౌన్ ప్రకటించారు. అన్ని ఉపగ్రహ ప్రయోగాలూ వాయిదా పడ్డాయి. రెండు దశాబ్దాల నుంచి రాకెట్ ప్రయోగం జరగని సంవత్సరం లేదు. అయితే, ఈ ఏడాది మొత్తం మీద ఒకే ఒక్క ప్రయోగం జరిగింది. వచ్చే ఏడాది కల్లా వైరస్ ప్రభావం తగ్గితే ప్రయోగాలు పునఃప్రారంభమవుతాయని, ఈ ఏడాదికి ఇక ప్రయోగాలు ఉండకపోవచ్చని ఇస్రో అధికారులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈ ఏడాది జనవరి 17న ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్–30 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. మార్చి 5న జీఎస్ఎల్వీ మార్క్2 రాకెట్ ద్వారా జీఐశాట్–1 అనే సరికొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు పూర్తి చేసిన తరువాత కొన్ని అవాంతరాలతో ఆ ప్రయోగాన్ని వాయిదా వేసుకున్నారు. మార్చి నెలాఖరులోపే రెండు పీఎస్ఎల్వీలను నింగిలోకి పంపేందుకు సిద్ధం చేశారు. మొదటి ప్రయోగవేదికలోని మొబైల్ సర్వీస్ టవర్‌లో పీఎస్ఎల్వీ సీ49 రాకెట్‌కు సంబంధించి నాలుగు దశల రాకెట్ పనులు పూర్తి చేశారు. ఈ రాకెట్ ద్వారా కార్టోశాట్–3 ఉపగ్రహంతో పాటు 9 విదేశీ ఉపగ్రహాలను పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఎస్‌ఏబీ బిల్డింగ్‌లో పీఎస్ఎల్వీ సీ50 రాకెట్ మూడు దశల అనుసంధానం పనులు పూర్తి చేశారు. ఈ రాకెట్ ద్వారా రిశాట్–1 అనే ఉపగ్రహాన్ని పంపేందుకు సన్నాహాలు పూర్తి చేసి విరమించుకున్నారు. విరామ మెరుగని ప్రయోగాలకు బ్రేక్ ► 1980లో ప్రారంభమైన రాకెట్ ప్రయోగాల పరంపర తొలినాళ్లలో సంవత్సరానికి ఒక ప్రయోగం లేదంటే రెండు సంవత్సరాలకు ఒక ప్రయోగాన్ని చేసేవారు. ► పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని 1999 నుంచి 2019 దాకా రాకెట్ ప్రయోగాల సంఖ్య పెరగడమే కాకుండా ఒక్క సంవత్సరం కూడా విరామం లేకుండా ప్రయోగాలు చేశారు. ► 2020 సంవత్సరాన్ని విజన్–2020గా తీసు కుని 12 ప్రయోగాలు చేయాలనుకున్నారు. అయితే ఒక్క ప్రయోగం కూడా చేయలేని సంవత్సరంగా 2020 మిగిలిపోయింది. ► ఈ ఏడాది గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి ఎక్స్పరమెంటల్, చంద్రయాన్–2 ప్రయోగాన్ని కూడా చేయాలనుకున్నారు. ► 2020 ఏప్రిల్‌లోపు జీఎస్ఎల్వీ మార్క్–2, పీఎస్ఎల్వీ సీ49, పీఎస్ఎల్వీ సీ50 ప్రయోగాలను పూర్తి చేయాలనుకున్నారు. కానీ వీటన్నింటికి కరోనా బ్రేక్ వేసింది. రెండు వేల మందికి పైగా ఉద్యోగులు ► షార్ కేంద్రంలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి ప్రత్యక్షంగా ఇస్రోకు సంబంధించిన వారు 2 వేల మంది పనిచేస్తున్నారు. ► కాంట్రాక్టు పద్ధతిన మరో రెండు వేలమంది పని చేస్తున్నారు. ► కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారంతా ఉత్తర భారతదేశానికి చెందిన వలస కూలీలు. ► లాక్డౌన్ మెదలైన తర్వాత వారందరూ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో షార్‌లో పనులు నిలిచిపోయాయి. ► తాజాగా గత వారంలో షార్ కేంద్రంలోనూ కేసులు నమోదైన క్రమంలో లాక్డౌన్ ప్రకటించారు. ► ప్రస్తుతం షార్ కేంద్రంలో ఉన్న రాకెట్లకు, మూడు ఉపగ్రహాలకు కాపలా కాసే పనిలో ఉన్నారు. కార్టోశాట్ ఉపగ్రహాలు భద్రం ► లాక్‌డౌన్‌కు ముందు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో ప్రయోగ వేదికలపై అనుసం« దానం పూర్తి చేసుకున్న జీఎస్ఎల్వీ మార్క్2, పీఎస్ఎల్వీ సీ49, పీఎస్ఎల్వీ సీ50 అనే మూడు రాకెట్లను శుక్రవారం విప్పదీసి విడిభాగాలను షార్‌లోని క్లీన్ రూంలో జీఐశాట్, రిశాట్, కార్టోశాట్ అనే ఉపగ్రహాలను కూడా భద్రపరిచారు. ► వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో ఉన్న జీఎస్ఎల్వీ మార్క్2 రాకెట్‌ను పూర్తిగా విప్పదీసి తొలగించారు. ► పీఎస్ఎల్వీ సీ50 రాకెట్ వాణిజ్యపరమైన ప్రయోగం కావడంతో దీన్ని ఆగస్టు 15 లోపు ప్రయోగించాలని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌కు తరలించి అనుసంధాన ప్రక్రియ చేపట్టారు. ► ఈ రాకెట్‌కు సంబంధించి రెండోదశ ప్రక్రియ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెం టర్ నుంచి రావాల్సి ఉండగా కరోనా ప్రభావంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ► దేశంలోని ఇస్రో కేంద్రాలున్న కేరళ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలో కరోనా వైరస్ విజృంభణతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. -
5న కక్ష్యలోకి జీఐశాట్–1
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్–10) ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీఐశాట్–1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సా.5.43 గంటలకు దీనిని రోదసిలోకి పంపుతారు. దేశరక్షణ వ్యవస్థకు, విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్–1 ముఖ్యోద్దేశం. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటి సారిగా భూస్థిర కక్ష్యలోకి పంపిస్తున్నారు. ప్రయోగమిలా... మంగళవారం : ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రివ్యూ) కమిటీ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్ బుధవారం : బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్ఆర్ చైర్మన్ బీఎన్ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధత సమావేశం. అనంతరం మూడు దశల రాకెట్ అనుసంధానం. తర్వాత తుదివిడత పరీక్షలు. లాంచ్ ఆ«థరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగింత. బుధవారం సాయంత్రం : ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రిహార్సల్స్. సా.3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం. ఆ వెంటనే రెండో దశలో 42.21 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభం. గురువారం : సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి దూసుకుపోనున్న జీఎస్ఎల్వీ. భూస్థిర కక్ష్యలోకి జీఐశాట్ – 1. -
జీఎస్ఎల్వీ ఎఫ్10 అనుసంధానం పూర్తి
సూళ్లూరుపేట: జీఎస్ఎల్వీ ఎఫ్10 ఉపగ్రహ వాహకనౌకను ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5.43 గంటలకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ప్రయోగించనున్నారు. దీని ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1ను రోదసీలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్వీ రాకెట్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో అనుసంధానం పనులు పూర్తయ్యాయి. అనంతరం వ్యాబ్ నుంచి ఉంబ్లికల్ టవర్(యూటీ) రాకెట్‌ను శనివారం ఉదయం 6 గంటలకు తరలించి రెండో ప్రయోగవేదికకు అనుసంధానం చేశారు. ఈ నెల 3వ తేదీ వరకు అన్నిరకాల పరీక్షలు పూర్తి చేసి అదేరోజున లాంచ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. 3న సాయంత్రం మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ(ఎంఆర్ఆర్) సమావేశం జరుగుతుంది. 4వ తేదీ మధ్యాహ్నం 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
వచ్చే నెల 5న జీఐ శాట్ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతనంగా రూపొందించిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐ శాట్–1)ను మార్చి 5వ తేదీన ప్రయోగించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా మార్చి 10న రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒకే నెలలో రెండు ప్రయోగాలు చేయనుండటంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం 2,100 కిలోల బరువైన జీఐ శాట్–1 ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–10 (జీఎస్ఎల్వీ మార్క్–2) రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ నుంచి జీఐ శాట్–1 ఉపగ్రహం గత ఏడాది డిసెంబర్ 23న షార్కు చేరుకుంది. దీనిని ఈ ఏడాది జనవరి 15న ప్రయోగించాలని తొలుత భావించారు. సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు. రాకెట్‌కు శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే క్రమంలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపంతో ఈనెల 25కు వాయిదా వేసుకున్నారు. సాంకేతికపరమైన లోపాన్ని సవరించే క్రమంలో కాస్త ఆలస్యం కావడంతో మార్చి 5న దీనిని ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీఐ శాట్ ప్రత్యేకతలివీ.. నూతన ఉపగ్రహం జీఐ శాట్–1ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలోమీటర్లు ఎత్తులో వున్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి పంపేవారు. ఈసారి జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపించి పనిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం. ఈ తరహా ఉపగ్రహాల్లో జీఐ శాట్–1 ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రయోగం తరువాత జూలైలో జీఎస్ఎల్వీ ఎఫ్–12 రాకెట్ ద్వారా జీఐ శాట్–2 ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దేశ భద్రత, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. అదేవిధంగా మార్చి 10న పీస్ఎల్వీ సీ–49 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)ను ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. -
పీఎస్ఎల్వీ సీ– 48 ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ –సీ48 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)లో పీఎస్ఎల్వీ రాకెట్‌కు శిఖర భాగాన శనివారం రీశాట్–2బీఆర్1 అనే ఉపగ్రహంతోపాటు 9 విదేశీ ఉపగ్రహాలను అమర్చి హీట్‌షీల్డ్ క్లోజ్ చేశారు. అనంతరం గ్లోబల్ చెకింగ్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మిషన్ సంసిద్ధత సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఆర్ఆర్ అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్.. ల్యాబ్ సమావేశాన్ని నిర్వహించనుంది. సోమవారం ఉదయం లాంచ్ రిహార్సల్స్ నిర్వహించాక మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. 26 గంటల కౌంట్‌డౌన్ తర్వాత బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ –సీ48 రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా 628 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1, అమెరికాకు చెందిన తైవోక్–0129, ఐహోప్ శాట్, నాలుగు లీమూర్, జపాన్‌కు చెందిన క్యూఆర్ఎస్–సార్, ఇటలీకి చెందిన తైవోక్–0992, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫాట్–3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. -
26 నుంచి పీఎస్ఎల్వీ సీ47 కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి 27న ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ47ను ప్రయోగించనున్నారు. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో నాలుగు దశల రాకెట్ అనుసంధానం పూర్తయ్యాక అక్కడి నుంచి ప్రయోగ వేదిక మీదకు తరలించే క్రమంలో పీఎస్ఎల్వీ రాకెట్‌లోని ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలో నాయిస్ రావడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ సమస్యను శుక్రవారం సరిచేశారు. శనివారం ఉదయం పీఎస్ఎల్వీ సీ47 రాకెట్‌ను ప్రయోగ వేదిక మీదకు తీసుకెళ్లి అనుసంధానించారు. ఆదివారం లాంచ్ రిహార్సల్స్ చేపట్టనున్నారు. 25వ తేదీ తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్), 26 ఉదయం 6.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇక నేరుగా చంద్రుడి వైపు
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదిక నుంచి ఇస్రో గత నెల 22న నింగికెగసిన చంద్రయాన్–2 మిషన్ బుధవారం వేకువ జామున 2.21 గంటలకు భూ మధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి వైపునకు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతోంది. బుధవారం 2.21 గంటలకు 1203 సెకెండ్ల పాటు చంద్రయాన్–2 మిషన్‌లో అంతర్భాగమైన ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని (లూనార్ ఆర్బిట్ ట్రాజెక్టరీ) ద్వారా మండించి ఆరోసారి కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ చంద్రుడి వైపునకు మళ్లించే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. బెంగళూరు సమీపంలో బైలాలులో వున్న భూనియంత్రిత కేంద్ర (మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్) నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ ఆధ్వర్యంలో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను ఆరోసారి విజయవంతంగా నిర్వహించారు. ఆగస్టు 20 నాటికి ఆర్బిటర్ ల్యాండర్, రోవర్‌ను మోసుకుని చంద్రుడి కక్ష్యలోకి వెళుతుంది. సెప్టెంబర్ 2వ తేదీన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే ప్రక్రియ చేపడతారు. సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవం వైపు మృదువైన ల్యాండింగ్ చేయనున్నారు. -
చంద్రయాన్–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్–2 మిషన్‌కు శుక్రవారం మధ్యాహ్నం 1.08 రెండో విడత కక్ష్యదూరాన్ని విజయవంతంగా పెంపుదల చేశారు. బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న భూనియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్–2 మిషన్‌లో భాగంగా ఉన్న ఆర్బిటర్‌లో నింపిన ఇంధనం సాయంతో కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా చంద్రయాన్–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లు ఎత్తులో భూమధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా ఈ నెల 24వ తేదీన మొదటి విడత పెంపుదలలో భూమికి దగ్గరగా ఉన్న 170 కిలోమీటర్ల ఎత్తును 230 కిలోమీటర్ల వరకు దూరం పెంచారు. శుక్రవారం రెండోసారి ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని 883 సెకెన్లపాటు మండించి భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లుగా ఉన్న కక్ష్య దూరాన్ని ఒక్కసారిగా 54,829 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 దాకా మూడోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు. ఈ సారి భూమికి దగ్గరగా ఉన్న 230 కిలోమీటర్లు దూరాన్ని 268 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 54,829 కిలోమీటర్ల దూరాన్ని 71,558 కిలోమీటర్ల దూరానికి పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్
సాక్షి, శ్రీహరికోట : అంతరిక్ష చరిత్రలోనే భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్ కే.శివన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2 ప్రయోగానంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందన్నారు. అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశ విజయవంతంగా ముగిసిందని, నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశించిందని తెలిపారు. చంద్రుడిపై భారత్ చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఇదని అభివర్ణించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని చెప్పారు. ఇస్రో టీమ్ అహర్నిశలు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మూడు ఉపగ్రహాలను ఒకే రోవర్ ద్వారా ప్రయోగించినట్లు తెలిపారు. ఊహించనదానికంటే చంద్రయాన్-2 తొలిదశ ఎక్కు విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. అభినందనల వెల్లువ.. చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి.. భారత్ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఇస్రోశాస్త్ర వేత్తలను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్వీటర్ వేదికగా శాస్త్రవేత్తలను కొనియాడారు. ‘ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంతో దేశం మొత్తం గర్వించేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇస్రో ఇలానే మరిన్ని కొత్త విషయాల కోసం ప్రయోగాలు చేపడుతూ విజయవంతం కావాలి.’ అని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చరిత్రలోనే ఇదో అద్భుత ఘట్టమని, మన శాస్త్రవేత్తల శక్తిని,130 కోట్ల భారతీయుల అంకిత భావాన్ని చంద్రయాన్ ప్రయోగం ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కొనియాడిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను తెలంగాణ గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ‘చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు అభినందనలు. కోట్ల కలలను చంద్రునిపైకి తీసుకెళ్లడం చారిత్రాత్మక సందర్భం. మన శాస్త్రవేత్తలు, ఇస్రో భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019 చదవండి: జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్–2 -
‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ
సాక్షి, హైదరాబాద్ : భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది. 3.8 టన్నుల బరువున్న చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్-3ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.15వ తేదీ వేకువజామున ప్రయోగించాలనుకున్న చంద్రయాన్–2ను చివరి గంటలో రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు. -
చంద్రయాన్–2 ప్రయోగం రేపే
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. 15వ తేదీ వేకువజామున ప్రయోగించాలనుకున్న చంద్రయాన్–2ను చివరి గంటలో రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ప్రయోగం పనులపై అన్ని సెంటర్ల డైరెక్టర్లతో ఎంఆర్ఆర్ సమావేశాన్ని నిర్వహించారు. షార్ శాస్త్రవేత్తలు కల్పనా అతిథి గృహంలో ఈ సమావేశానికి హాజరై సలహాలు, సూచనలను తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఒకసారి లాంగ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ ఆధ్వర్యంలో మరోమారు సమావేశమయ్యాక సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే.. ఆదివారం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ షార్కు విచ్చేసిన తర్వాత ల్యాబ్ మీటింగ్ జరుగుతుందని షార్ అధికార వర్గాలు అంటున్నాయి. మొత్తానికి 3,850 కిలోల బరువు కలిగిన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. -
చకచకా ‘చంద్రయాన్–2’ ఏర్పాట్లు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్–2 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఇప్పటికే షార్‌లో రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో మూడు దశల జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ పనులను పూర్తిచేశారు. శనివారం పేజ్–3 లెవెల్–1 తనిఖీలను నిర్వహించారు. అదేవిధంగా శాటిలైట్ బిల్డింగ్‌లో ఆర్బిటర్ మిషన్ మీద ల్యాండర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. చంద్రయాన్–2 మిషన్‌ను రాకెట్ శిఖర భాగంలో అమర్చేందుకు హీట్‌షీల్డ్ క్లోజ్ చేసి, ఆ భాగాన్ని శాటిలైట్ బిల్డింగ్ నుంచి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌కు ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయాన తరలించి రాకెట్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో రాకెట్ అనుసంధానం పనులన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత రాకెట్లో అన్ని తనిఖీలు నిర్వహించి ఊంబ్లికల్ టవర్ మీదకు తరలించే ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రయోగానికి గడువు మరో 15 రోజులే ఉండడంతో సెలవు దినాలను కూడా చూడకుండా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం నుంచి నూతన డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ పర్యవేక్షణలో అనుసంధానం పనులు జరుగుతాయి. జూలై 15న చంద్రయాన్–2 భూకక్ష్య నుంచి బయలుదేరి 3.50 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి సెప్టెంబర్ 6న చంద్రుడిపైకి చేరుతుంది. అదేరోజున ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి చేరుకుని ల్యాండర్‌ను చంద్రుడిపై దించుతుంది. చంద్రుడిపై ల్యాండర్ దిగాక అందులో అమర్చిన రోవర్ బయటకొచ్చి పరిశోధనలు చేస్తుంది. ఈ లోపు ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారానే చంద్రయాన్–2.. 640 టన్నులు బరువు కలిగిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ 3.8 టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని అంతరిక్షం వైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్–2 ఉపగ్రహంలో 2.3 టన్నుల బరువు కలిగిన ఆర్బిటర్, 1.4 టన్నులు బరువు కలిగిన ల్యాండర్ (విక్రమ్), 27 కిలోలు బరువు కలిగిన రోవర్ (ప్రజ్ఞాన్) అనే ఇండియన్ పేలోడ్స్‌తోపాటు అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన అనేక పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. వీటితోపాటు ఆర్బిటర్‌లో 8 పేలోడ్స్, ల్యాండర్, రోవర్లో మూడేసి పేలోడ్స్‌ను పంపుతున్నారు. ఆర్బిటర్‌లో పంపే పేలోడ్స్ ఇవి.. - టెరియన్ మ్యాపింగ్ కెమెరా–2 (టీఎంసీ–2) - చంద్రయాన్–2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (సీఎల్ఏఎస్ఎస్) - సోలార్ ఎక్స్‌రే మానిటర్ (ఎక్స్ఎస్ఎం) - ఆర్బిటర్ హైరిజుల్యూషన్ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) - ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) - డ్యూయెల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ రాడార్ (ఎస్ఏఆర్) - చంద్రయాన్–2 అట్మాస్ఫియరిక్ కాంపోజిషనల్ ఎక్స్‌ప్లోరల్ 2 (సీహెచ్ఏసీఈ) - డ్యూయెల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్ (డీఎఫ్‌ఆర్‌ఎస్) ఎక్స్పరిమెంట్ ల్యాండర్ (విక్రమ్)లో పేలోడ్స్ ఇవి.. - రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ ఐనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ (ఆర్ఎఎంబీఏ) - చంద్రయాన్–2 సర్ఫేస్ థెర్మో–ఫిజికల్ ఎక్స్పరిమెంట్ (సీహెచ్ఏఎస్టీఈ) - ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీయాస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ) - రోవర్ (ప్రజ్ఞాన్)లో పేలోడ్స్ ఇవి.. - అల్ఫా ఫర్టికల్స్ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్ (ఏఎప్ఎక్స్ఎస్) - లేజర్ ఇన్డ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎన్ఐబీఎస్) - లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే (ఎల్ఆర్ఏ) -
జాబిల్లిపై చంద్రయాన్–2 ఇలా..
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జూలై 15వ తేదీన చంద్రయాన్– 2 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఇప్పటికే షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రెండు దశల రాకెట్ అనుసం«ధానం పనులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్– 2 చంద్రుడి మీద ఏ విధంగా దిగుతుందనే దానిపై ఇస్రో నాలుగు ఛాయా చిత్రాలను గురువారం విడుదల చేసింది. చంద్రుడిపై ఆర్బిటర్ ద్వారా మోసుకెళ్లిన ల్యాండర్, రోవర్లు చంద్రునికి 30 కిలో మీటర్ల ఎత్తులో నుంచి దిగుతున్న నాలుగు దశల ఊహా చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. -
చకచకా చంద్రయాన్–2 ఏర్పాట్లు
సూళ్లూరుపేట: చంద్రుని మూలాలు కనుగొనడానికి ఉద్దేశించి భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్–2 ప్రయోగానికి సంబం«ధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ రెండు దశల అనుసంధానం పనులు పూర్తయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 నుంచి చంద్రయాన్–2 ప్రయోగాన్ని పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి జూలై 15న నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రయోగానికి సంబంధించి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఆర్బిటర్ మిషన్ చేరుకున్న విషయం కూడా విదితమే. దీనికి సంబంధించి మంగళవారం బెంగళూరులోని అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయంలో 60 మంది శాస్త్రవేత్తలతో రెండో లూనార్ సైన్స్ మీట్ నిర్వహించారు. ఈ ప్రయోగంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 8 ఆర్బిట్ పేలోడ్స్, మూడు ల్యాండర్ పేలోడ్స్, రెండు రోవర్ పేలోడ్స్ పంపించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అంటే ఈనెల 13, 14 తేదీల్లో కూడా చంద్రయాన్–2 ప్రయోగంలో ఇస్రో హెడ్‌క్వార్టర్‌లో సైన్స్ మీట్ నిర్వహించారు. రెండో మారు నిర్వహించిన లూనార్ సైన్స్‌మీట్‌కు వివిధ పరిశోధనా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, ఇస్రో కేంద్రాలు, ప్రయోగశాలలనుంచి సుమారు 60 మంది శాస్త్రవ్తేతలు హాజరయ్యారు. చంద్రయాన్–2లో పంపబోయే నాలుగు పేలోడ్స్ గురించి కూడా వారు చర్చించినట్టు సమాచారం. ఇందులో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, సింథటిక్ ఆపార్చర్ రాడార్, ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్, మాస్ స్పెక్ట్రోమీటర్ వంటి ఆర్బిటర్ పేలోడ్ల యొక్క డేటా విశ్లేషణ పద్ధతి, పేలోడ్ డేటాను సైన్స్ ఉత్పత్తులకు మార్చడంలో వున్న దశల గురించి వారంతా సమావేశంలో విశ్లేషించారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్‌తో పాటు 60 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
చంద్రయాన్–2 ప్రయోగానికి ప్రధాని రాక?
సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న ఇస్రో నిర్వహించనున్న చంద్రయాన్–2 ప్రయోగాన్ని తిలకించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని తెలిసింది. ఆయనతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ నరసింహన్ కూడా హాజరుకానున్నారు. గతంలో మంగళ్యాన్ ప్రయోగ సమయంలోనూ ప్రధాని వచ్చిన విషయం తెలిసిందే. గ్రహాంతర ప్రయోగం.. పైగా దేశానికి ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన స్వయంగా వచ్చి తిలకించనున్నారు. ఈ ప్రయోగానికి ముందుగానే.. సుమారు 1500 మందితో శాస్త్రసాంకేతిక రంగానికి సంబంధించి ఓ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. రూ.500 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు ఇస్రో వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. 2022 కంటే ముందుగానే గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించాలని ప్రధానమంత్రి ఆదేశాలతో రెండో వ్యాబ్‌ను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ- 46 రాకెట్
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ- 46
సాక్షి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-46 వాహక నౌక దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలోకి ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్ఎల్వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-46ఉపగ్రహ వాహక నౌకను శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు. ఇందుకు సంబంధించి మంగళవారం తెల్లవారుజామున 4.30గంటలకు కౌంట్ డౌన్‌ను ప్రారంభమయ్యింది. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమైంది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 41 టన్నుల ద్రవ ఇంధనంతో 4.22 నిమిషాలకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడోదశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగోదశ పూర్తి చేసిన అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రిశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో 37 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం అయిదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ ప్రయోగాలలో ఇది 48వ ప్రయోగం. రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహం సరిహద్దుల్లో ఉగ్రశిబిరాలు, కదలికలను పసిగట్టనుంది. అలాగే ప్రకృతి వైపరిత్యాలపై అధ్యయనం చేస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందలు తెలిపారు. బుధవారం ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-46 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
రెడీ.. 3, 2, 1
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–46 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రయోగానికి 25 గంటల ముందు అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం 4.30 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 25 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా నాలుగోదశలో 1.6 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మంగళవారం రాత్రి పూర్తి చేశారు. మళ్లీ మంగళవారం రాత్రే రెండోదశలో 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా చేస్తున్నారు. మంగళవారం నాడు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ చెంగాళమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పర్యవేక్షించారు. రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి సహచర శాస్త్రవేత్తలతో సమావేశమై ప్రయోగ పనులు సమీక్షించారు. – సూళ్లూరుపేట ప్రయోగం ఇలా... షార్ నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–46 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 615 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీ అనే (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్) దూర పరిశీలనా ఉపగ్రహాన్ని 15.29 నిమిషాల్లో భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ను నాలుగు దశల్లో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా చేస్తున్నారు. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమవుతుంది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 41 టన్నుల ద్రవ ఇం«ధనంతో 4.22 నిమిషాలకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడోదశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగోదశ పూర్తి చేసిన అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రిశాట్–2బీ ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో 37 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేశారు. ఈ ఉపగ్రహం అయిదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం తోమాల సేవలో పాల్గొని పీఎస్ఎల్వీ సీ–46 నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శివన్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్క రించారు. బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–46 శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపనున్నట్లు శివన్ తెలిపారు. తదుపరి ప్రాజెక్ట్‌గా జూలై 9, 16 తేదీల్లోపు చంద్రయాన్–2 మిషన్‌ను కూడా ప్రయోగించనున్నట్లు, చంద్రునిపైకి సెప్టెంబర్ 6న చంద్రయాన్–2 ల్యాండ్ అవుతుందని పేర్కొన్నారు. -
పీఎస్ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు నింగికెగసేందుకు పీఎస్‌పీఎల్ సీ46 సిద్ధమైంది. మంగళవారం ఉదయం 4.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో సోమవారం మిషన్ సంసిద్ధత సమావేశం (ఎంఆర్ఆర్)ను కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్ఆర్ కమిటీ రాకెట్‌కు సంబంధించి లాంచ్ రిహార్సల్స్‌ను నిర్వహించారు. అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కి అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఎస్.పాండ్యన్ ఆధ్వర్యంలో మరో మారు లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి కౌంట్‌డౌన్ సమయాన్ని ప్రయోగానికి 25 గంటల ముందు అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ప్రయోగ పనుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి ఇస్రో చైర్మన్ కె.శివన్ షార్కు రానున్నారు. ప్రయోగం ఇలా.. సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ46 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 615 కిలోల బరువు కలిగిన రిశాట్–2బీ అనే (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్) దూర పరిశీలనా ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ రాకెట్‌ను నాలుగు దశల్లో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా చేస్తున్నారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమవుతుంది. 20 మీటర్లు ఎత్తు కలిగి 2.8 వెడల్పు ఉన్న 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు మొదటి దశను పూర్తి చేస్తారు. 12.8 మీటర్లు ఎత్తు, 2.5 వెడల్పు కలిగిన రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇంధనంతో 4.22 నిమిషాలకు, 3.6 ఎత్తు 2 మీటర్లు వెడల్పు కలిగిన మూడో దశలో 7.65 ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు, మూడు మీటర్లు ఎత్తుకలిగి 1.34 వెడల్పు కలిగిన నాలుగోదశలో 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు పూర్తి చేసిన అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రిశాట్–2బీ ఉపగ్రహాన్ని భూమికి 557 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో 37 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ రాకెట్ కోర్ అలోన్ దశతో 14వ ప్రయోగం, ఈ ఏడాది 3వ ప్రయోగం, మొదటి ప్రయోగ వేదిక నుంచి 36వ ప్రయోగం, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 48వ ప్రయోగం, షార్ కేంద్రం నుంచి 72వ ప్రయోగం కావడం విశేషం. వ్యవసాయ రంగానికి ఉపయోగం పీఎస్ఎల్వీ సీ46 రాకెట్ ద్వారా పంపించబోయే రిశాట్–2బీ ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. రిశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో నాలుగో ఉపగ్రహం కావడం విశేషం. 615 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో ఎక్స్ బ్యాండ్ రాడార్ అనే ఉపకరణాన్ని అమర్చి పంపుతున్నారు. ఈ ఉపగ్రహం వ్యవసాయ రంగానికి, అటవీ శాఖకు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయాన్ని సేవలు అందిస్తుంది. భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుంది. ఇప్పటిదాకా రిశాట్–1, రిశాట్–2, స్కాట్‌శాట్ అనే మూడు ఉపగ్రహాలు వ్యవసాయ, అటవీ, ప్రకృతి వైపరీత్యాలకు సేవలు అందిస్తున్నాయి. ఈ ఉపగ్రహం కూడా అదే రకమైన సేవలను అందిస్తుంది. -
22న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ46
శ్రీహరికోట (సూళ్లూరుపేట): మరో అంతరిక్ష ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమయ్యింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 5.57 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ46ను నింగిలోకి పంపనున్నారు. రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రిశాట్–2బి) అనే అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని భూమికి 555 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. 300 కిలోల బరువైన ఈ ఉపగ్రహంలో ఎక్స్‌బాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. భూమి మీద జరిగే మార్పులను, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నాణ్యమైన చిత్రాలను తీసి పంపే సామర్థ్యం కలిగి వుంది. సైనిక అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడనుంది. ఇది రిశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో నాలుగవది. ఇప్పటికే రిశాట్–1, రిశాట్–2, స్కాట్‌శాట్–1 అనే మూడు ఉపగ్రహాలు విజయవంతంగా రోదసీలో పనిచేస్తున్నాయి. వీటితో అనుసంధానమై రిశాట్ 2బి భారత్‌కు అన్నివిధాలా ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు. -
రేపు పీఎస్ఎల్వీ సీ45 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఏప్రిల్ 1న సోమవారం నాడు ఉదయం 9.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ45 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నట్లు మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) కమిటీ అధికారికంగా శనివారం ప్రకటించింది. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో తుది విడత ఎంఆర్ఆర్ సమావేశాన్ని నిర్వహించారు. రాకెట్‌కు అన్ని రకాల తనిఖీలు నిర్వహించగా శనివారం రాత్రి లాంచ్ రిహార్సల్స్ చేసి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) చైర్మన్ ఎస్.పాండియన్‌కు అప్పగించారు. ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగంలో 216 కిలోల బరువు కలిగిన ఈఎంఐ శాట్ అనే స్వదేశీ ఉపగ్రహంతో పాటు 220 కిలోలు బరువు కలిగిన నాలుగు దేశాలకు చెందిన 28 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగంలో 436 కేజీల బరువు కలిగిన ఈఎంఐ శాట్‌తో పాటు యూఎస్ఏకు చెందిన ఫ్లోక్–4ఏ పేరుతో 20 చిన్న ఉపగ్రహాలు, లీమూర్ పేరుతో మరో నాలుగు చిన్న ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఎం–6పీ, బ్లూవాకర్–1 అనే రెండు చిన్న తరహా ఉపగ్రహాలు, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకార్ట్–1 అనే ఉపగ్రహం, స్పెయిన్‌కు చెందిన ఎయిస్టెక్ శాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. -
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ– సీ 44 రాకెట్
-
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ– సీ 44
శ్రీహరికోట (సూళ్లూరుపేట)/ టీ.నగర్ (చెన్నై): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్ఎల్వీ– సీ 44 (పీఎస్ఎల్వీ– డీఎల్) ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించనున్నారు. కాగా, ఈ ఏడాది అంతరిక్షంలోకి 17 శాటిలైట్స్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం కొత్త పథకం రూపొందించామన్నారు. దీని ప్రకారం 8, 9 తరగతులకు వెళ్లే విద్యార్థుల్లో జిల్లాకు ముగ్గురిని ఎంపికచేసి అంతరిక్షానికి సంబంధించిన శిక్షణ అందిస్తామన్నారు. -
‘షార్’కు చేరుకున్న మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 24న నిర్వహించనున్న పీఎస్ఎల్వీ సీ44 ప్రయోగానికి సంబంధించి మైక్రోశాట్–ఆర్ అనే ఉపగ్రహం ఆదివారం షార్కు చేరుకుంది. బెంగళూరులోని యూఆర్ శాటిలైట్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం బయల్దేరిన ఈ ఉపగ్రహం ఆదివారం సాయంత్రానికి షార్కి చేరుకుంది. మొదటి ప్రయోగవేదికపై పీఎస్ఎల్వీ సీ44 రాకెట్ అనుసంధానానికి సంబంధించి నాలుగుదశల పనులను పూర్తి చేశారు. ఈ వారంలోనే రాకెట్ శిఖరభాగాన ఉపగ్రహాన్ని అమర్చేందుకు సిద్ధమవుతున్నారు. -
నేడు నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్11
-
జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్11) ప్రయోగించనున్నారు. మంగళవారం ఉదయాన్నే సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి వద్ద పూజలు చేయించుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాకెట్‌లోని రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మంగళవారం రాత్రి చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. 26 గంటల కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం సాయంత్రం 4.10 గంటలకు 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లేందుకు షార్‌లోని రెండో ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–7ఏ: కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్–7ఏ మాత్రం అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్ ట్రాన్స్పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో రూపొందించారు. -
రేపు జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ప్రయోగం
-
జీఎస్ఎల్వీకి నేడు కౌంట్‌డౌన్
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5.08 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్ 3డీ2 ఉపగ్రహవాహక నౌకను ప్రయోగించనున్నారు. 25.30 గంటల ముందు అంటే.. మంగళవారం సాయంత్రం 3.38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సోమవారం ప్రయోగ సమయాన్ని ఎంఆర్ఆర్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. షార్‌లోని బ్రహ్మ ప్రకాష్ హాల్లో సోమవారం ఎంఆర్ఆర్ చైర్మన్ బీఎన్ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఆర్ఆర్ కమిటీ భేటీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆ«థరైజేషన్ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో రిహార్సల్స్ నిర్వహించి కౌంట్‌డౌన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3డీ2 రాకెట్లో రెండో దశలోనే ద్రవ ఇంధనాన్ని నింపాల్సి ఉండడంతో కౌంట్‌డౌన్ సమయాన్ని 25:30 గంటలు గానే నిర్ణయించారు. ఇస్రో చరిత్రలో అతిపెద్ద ప్రయో గం కావడంతో శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. మూడున్నర టన్నులపైగా బరువున్న ఉపగ్రహాన్ని షార్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. మేకిన్ ఇండియాగా గుర్తింపు: 2014 డిసెంబర్ 18న జీఎఎస్‌ఎల్‌వీ మార్క్–3 ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. ఆ ప్రయోగంలో క్రయోజనిక్ దశ లేకుండా డమ్మీని పెట్టి ప్రయోగించారు. 2017 జూన్ 5న జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించా రు. ఇప్పుడు మూడోసారి జీఎస్ఎల్వీ మార్క్ 3డీ2 ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. మార్క్–3 లాంటి భారీ ప్రయోగాలు విజయవంతమైతే రాకెట్ టెక్నాలజీలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడకుండా మేకిన్ ఇండియాగా గుర్తింపు సాధిస్తుంది. 3,700 కిలోల బరువున్న ఉపగ్రహం రోదసీలోకి.. ప్రయోగం ద్వారా 3,700 కిలోలు బరువుగల జీశాట్–29 అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా కేఏ, ఎక్స్, కేయూ మల్టీబీమ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్‌ఫాండర్లు పంపడం ఇస్రో ఇదే మొదటిసారి. గ్రామీణ ప్రాంతాల్లోని వనరులు తదితరాలను గుర్తించి సమాచారాన్ని అందించడమే కాకుండా దేశ ఆర్మీకి ఆవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం 12ఏళ్ల పాటు సేవలందిస్తుంది. గజ తుపాన్ ప్రభావంతో 30 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తాయని ఇస్రో ఉపగ్రహలు సమచారం ఇచ్చినట్టుగా తెలిసింది. గాలులతో ప్రయోగానికేమీ ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు భావించి ప్రయోగ, కౌంట్‌డౌన్ సమయాన్ని వెల్లడించారు. ఇస్రో చైర్మన్ రాక నేడు ఇస్రో చైర్మ్న్ ఏఎస్ కిరణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం షార్కు చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించి సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. -
14న జీఎస్ఎల్వీ మార్క్–3డీ 2 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో 2 ప్రయోగాలకు సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగాలకు వేదికకానుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 14న సాయంత్రం జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ద్వారా 3,700 కిలోలు బరువు గల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహంలో కేఏ ఎక్స్ కేయూ మల్టీభీమ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్‌ఫాండర్లు పంపించడం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి. గ్రామాల్లోని వనరులు, సదుపాయాలు, కావాల్సిన ఏర్పాట్లను గుర్తించి ఇది సమాచారం అందిస్తుంటుంది. ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. నెలాఖరులో పీఎస్ఎల్వీ సీ43 ప్రయోగం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల చివరిలో పీఎస్ఎల్వీ సీ43 రాకెట్‌ను ప్రయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ద్వారా హైపర్ స్పెక్ట్రల్ సిస్టం ఇమేజ్ శాటిలైట్(హైసిస్) ఉపగ్రహంతో పాటు 30 విదేశీ ఉపగ్రహాలను పంపించనున్నారు. -
నేడే నింగిలోకి పీఎస్ఎల్వీ సీ42
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఆదివారం రాత్రి 10.08 గంటలకు పీఎస్ఎల్వీ సీ42 ఉపగ్రహ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా 889 కిలోల బరువు కలిగిన నోవాసార్, ఎస్ 1–4 అనే రెండు విదేశీ(బ్రిటన్) ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) రోదసీలోకి పంపనుంది. దీనికి సంబంధించి శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మొదటి ప్రయోగ వేదికపై నుంచి ఆదివారం రాత్రి 10.07 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే వర్షం పడే అవకాశముండటం, రాకెట్ వెళ్లే గమనంలోని అంతరిక్ష వ్యర్థాలను తప్పించేందుకు ఒక నిమిషం పొడిగించి.. ప్రయోగ సమయాన్ని ఆదివారం రాత్రి 10.08 గంటలుగా నిర్ణయించారు. ఇక 33 గంటల కౌంట్‌డౌన్‌లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం రాత్రి రాకెట్‌కు నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపి.. అందులో లోపాలేమైనా ఉన్నాయా అని పరిశీలించారు. ఆదివారం తెల్లవారుజామున రెండో దశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియను పూర్తి చేశారు. ఆదివారం తుది విడత తనిఖీలు తనిఖీలు నిర్వహించిన అనంతరం పీఎస్ఎల్వీ సీ42 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆదివారం ఉదయం షార్కు చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించనున్నారు. పీఎస్ఎల్వీ ప్రస్థానం.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ఇస్రోకు నమ్మకమైన అస్త్రంగా మారింది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఇప్పటిదాకా పీఎస్ఎల్వీ ద్వారా 43 ప్రయోగాలు చేయగా.. రెండు మాత్రమే విఫలమయ్యాయి. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి ప్రయోగాలతో పాటు ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు.. ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఘనత పీఎస్ఎల్వీకే సొంతం. ఇప్పటిదాకా 43 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 288 ఉపగ్రహాలను ప్రయోగించగా.. ఇందులో 241 విదేశీ ఉపగ్రహాలు, 47 స్వదేశీ ఉపగ్రహాలు కావడం విశేషం. అలాగే దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఐదు చిన్నపాటి ఉపగ్రహాలను పంపించిన ఘనత కూడా పీఎస్ఎల్వీదే. ఇతర దేశాల మీద ఆధారపడి ప్రయోగాలు చేసే దశ నుంచి.. ఇతర దేశాల ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి ఎదగడానికి పీఎస్ఎల్వీ రాకెట్టే కారణం. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా.. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను పంపిస్తోంది. ఇస్రోకు వాణిజ్యపరంగా ఏడాదికి సుమారు రూ.1,100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది కూడా పీఎస్ఎల్వీ రాకెట్లే కావడం విశేషం. -
రేపు రాత్రి పీఎస్ఎల్వీ సీ42 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో)సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగవేదిక (షార్) నుంచి ఆదివారం రాత్రి 10.07 గంటలకు పీఎస్ఎల్వీ సీ42 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం మధ్యాహ్నం 1.07 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. షార్ కేంద్రంలోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ కాటూరి నారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మిషన్ సంసిద్ధతా సమావేశాలు నిర్వహించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఎస్.పాండ్యన్ ఆధ్వర్యంలో ప్రయోగానికి 33 గంటల ముందు శనివారం మధ్యాహ్నం 1.07 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించాలని నిర్ణయించారు. పీఎస్ఎల్వీ సీ42 ద్వారా యునైటెడ్ కింగ్డం (బ్రిటన్)కు చెందిన 889 కిలోల బరువు కలిగిన నోవాసార్, ఎస్1–4 అనే రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేశారు. -
రాబోయే ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి రానున్న ఆరు నెలల కాలంలో నాలుగు ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని షార్ డైరెక్టర్ ఎస్.పాండియన్ తెలిపారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయ మైదానంలో బుధవారం షార్‌లోని భాస్కర అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ రెండో వారంలో పీఎస్ఎల్వీ సీ42 ద్వారా యూరోపియన్‌కు చెందిన నోవాశాట్, ఎస్–14 అనే రెండు విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నామని చెప్పారు. రెండో ప్రయోగవేదికపై అక్టోబర్ మొదటి వారంలో జీఎస్ఎల్వీ మార్క్–3, డీ–2 ప్రయోగం ద్వారా జీశాట్–29 అనే ఉపగ్రహాన్ని పంపిస్తామన్నారు. వెంటనే నవంబర్, డిసెంబర్ నెలల్లో పీఎస్ఎల్వీ సీ43, సీ 44 రాకెట్లును ప్రయోగిస్తామన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం 2019 ప్రథమార్థంలో ఉంటుందన్నారు. సూర్యుడిపై పరిశోధనకు నాసాతో ఇస్రో ఇప్పటికే చర్చలు జరుపుతోందని, ఫలప్రదమైతే ఆదిత్య–1 పేరుతో ఉపగ్రహాన్ని పంపడం తమ లక్ష్యమన్నారు. -
భూస్థిర కక్ష్యలోకి ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని ఈ నెల 12న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ41 ఉపగ్రహ వాహకనౌక ద్వారా రోదసిలోకి పంపిన విషయం తెలిసిందే. బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు దశలుగా మండించి ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో పెరిజీ (భూమికి దగ్గరగా) 35,462 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,737 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం జరిగిన రోజున ఉపగ్రహాన్ని పెరిజీ 284 కిలోమీటర్లు, అపోజి 20,650 కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. అనంతరం మూడు విడతలుగా కక్ష్యదూరాన్ని పెంచిన శాస్త్రవేత్తలు.. ఆదివారం రాత్రి నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచి ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం అధికారికంగా ప్రకటించారు. -
నేడు షార్‌లో పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ దవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ41 ఉపగ్రహ వాహకనౌకను గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు ప్రయోగించనున్నారు. 32 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రాకెట్‌కు నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపే కార్యక్రమాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. అనంతరం రాత్రికి రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా పూర్తి చేశారు. రాకెట్‌కు తుది విడత పరీక్షలు నిర్వహించి హీలియం, నైట్రోజన్ గ్యాస్ నింపే పనులను పూర్తిచేసి రాకెట్‌కు అవసరమైన అన్ని వ్యవస్థలను శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు. గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి మోసుకెళ్లేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగ పనులను పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం రాత్రే షార్కు చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. బుధవారం ఉదయం స్థానిక చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రయోగం విజయవంతమవ్వాలని మొక్కుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌కు పూర్తిగా సొంత నావిగేషన్ సిస్టం అందుబాటులోకి రానుంది. -
గ‘ఘన’ విజయం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ యవనికపై భారత్ (ఇస్రో) మరోసారి కీర్తిపతాకాన్ని ఎగరేసింది. భారత సమాచార వ్యవస్థకు పదునుపెట్టే జీశాట్6–ఏ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్08) ఉపగ్రహ వాహకనౌక 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో క్రయోజనిక్ దశ ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరోవిజయాన్ని (డబుల్ హ్యాట్రిక్) ఇస్రో నమోదు చేసింది. బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవగా 27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం సాయంత్రం 4.56 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ సిరీస్‌లో చేసిన 12 ప్రయోగాల్లో ఇది తొమ్మిదో విజయం. షార్‌నుంచి 63వ ప్రయోగం కావటం గమనార్హం. ఈ ప్రయోగంలో అత్యంత కీలకంగా మారిన క్రయోజనిక్ మూడో దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు పరిణితి సాధించారు. డాక్టర్ శివన్ ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి ప్రయోగం కావటంతో.. ఆయనలో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. ప్రయోగం జరిగిందిలా.. 49.1 మీటర్ల పొడవున్న జీఎస్ఎల్వీ ఎఫ్08 నిప్పులు చిమ్ముకుంటూ నింగికి పయనమైంది. 4 స్ట్రాపాన్ బూస్టర్లు, కోర్ అలోన్ దశల సాయంతో మొదటిదశ ప్రారంభమైంది. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 42.7 టన్నుల ద్రవ ఇంధనం లెక్కన నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో 170.8 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్ అలోన్దశలో 138.11 ఘన ఇంధనంతో మొదటిదశను 151 సెకన్లలో విజయవంతంగా పూర్తి చేశారు. 39.48 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండోదశను 285 సెకన్లలో, ఆ తరువాత క్రయోజనిక్ దశను 12.84 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,065 సెకన్లలో పూర్తి చేశారు. అక్కడ నుంచి ఉపగ్రహాన్ని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు వారి అధీనంలోకి తీసుకుని కక్ష్యలో ఉపగ్రహం పరిస్థితిని నియంత్రిస్తున్నారు. సమష్టి విజయం ప్రయోగం విజయవంతం శాస్త్రవేత్తల సమష్టి విజయమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ తెలిపారు. క్రయోజనిక్ దశను రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో ఇక భారీ ప్రయోగాలు సైతం చేయగలమన్న విశ్వాసం పెరిగిందన్నారు. వాణిజ్యపరంగా కూడా భవిష్యత్తులో మరెన్నో ప్రయోగాలు చేపడతామని శివన్ తెలిపారు. ఇప్పటిదాకా చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే ఇకనుంచి అన్ని భారీ ప్రయోగాలే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని, ఈ ఏడాది రాబోవు తొమ్మిది నెలల్లో 10 ప్రయోగాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని శివన్ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో చంద్రయాన్–2 ప్రయోగాన్ని జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ద్వారా చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, కేసీఆర్ అభినందనలు ఇస్రో ఘనవిజయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత్ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ఇస్రో తీరు గర్వకారణం. స్వదేశీ క్రయోజనిక్ దశ ద్వారా విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. జీశాట్–6ఏ సమాచార ఉపగ్రహం ద్వారా మరిన్ని అధునాతన మొబైల్ యాప్‌లను సృష్టించేందుకు అవకాశం కలుగుతుంది’ అని ప్రధాని ట్వీట్‌చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జీశాట్–6ఏ విజయవంతం కావటంపై శాస్త్రవేత్తలను అభినందించారు. దేశ ఖ్యాతి పెంచారు: వైఎస్ జగన్ సమాచార రంగంలో భారత ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భారత పేరు ప్రతిష్టలు పెంచే ఈ క్రతువులో భాగస్వాములైన ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఉపగ్రహంతో ప్రయోజనం జీశాట్–6ఏ సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్ మల్టీ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. జీశాట్ 6ఏ ఉపగ్రహంలో 5ఎస్‌బ్యాండ్ స్పాట్ బీమ్స్, ఒక సీబ్యాండ్ బీమ్ అమర్చి పంపించారు. ఆరు చదరపు మీటర్లు వ్యాసార్థం కలిగిన అన్‌ఫర్‌లేబిల్ యాంటెన్నాతో యూజర్ కమ్యూనికేషన్ లింక్, 0.8 చదరపు మీటర్లు ఫిక్స్డ్ యాంటెన్నా ద్వారా హబ్ కమ్యూనికేషన్ లింక్ అందుబాబులోకి వస్తుంది. ఇందులోని ఒక బీమ్.. రక్షణరంగం, విమానయానం, అంతరిక్ష రంగాలకు అత్యంత అధునాతనమైన శాటిలైట్ ఫోన్ల టెక్నాలజీని అందిస్తుంది. మరో బీమ్ ద్వారా డిజిటల్ మల్టీమీడియా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తుంది. మొబైల్ ఫోన్లలో సురక్షితమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. భారీ యాంటెన్నా భారతదేశమంతా పూర్తిస్థాయిలో విస్తరిస్తూ అయిదు పుంజాలతో పనిచేస్తుంది. -
29న జీఎస్ఎల్వీ ఎఫ్08 ప్రయోగం
-
29న జీఎస్ఎల్వీ ఎఫ్08 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 29న సాయంత్రం 4.56 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్08 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ మొదలుకానుంది. ఈ ప్రయోగంలో 2,140 కిలోల బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. దీనిపై మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్ఆర్) చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రయోగతేదీని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. -
29న నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్08!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధాలవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 29న జీఎస్ఎల్వీ ఎఫ్08 రాకెట్ ప్రయోగిం చేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 11న రాకెట్ మూడోదశ అయిన క్రయోజనిక్ దశ అనుసంధానం పూర్తయింది. దీంతో మూడు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. ఈ మూడు దశల రాకెట్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈనెల 19న రాకెట్ శిఖరభాగాన 2,140 కిలోల బరువు కలిగిన జీశాట్–6ఏ ఉపగ్రహాన్ని అమర్చనున్నారు. అనంతరం రెండు రోజుల పాటు రాకెట్‌కు అన్ని రకాల సాంకేతిక పరీక్షలు నిర్వహించి 23న మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్) నుంచి ప్రయోగవేదిక (ఉంబ్లికల్ టవర్)కు అనుసంధానించే పనులు చేపట్టనున్నారు. అక్కడ సుమారు ఆరు రోజుల పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం 29న సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్యలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
పీఎస్ఎల్వీ సీ–40 ‘క్యాంపెయిన్’ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదికపై పీఎస్ఎల్వీ సీ–40కి మొదటి దశ మోటార్లను అనుసంధానం చేసే ప్రక్రియను (క్యాంపెయిన్) సోమవారం ప్రారంభించారు. వాస్తవానికి డిసెంబర్ నెలాఖరులోనే పీఎస్ఎల్వీ సీ–40 ప్రయోగిం చాలనుకున్నా.. రాకెట్ విడిభాగాలు షార్కు చేరుకోక పోవడంతో అనుసంధాన పనులు ఆలస్యమయ్యాయి. 2018 జనవరిలో ప్రయోగించనున్న ఈ రాకెట్ ద్వారా 30 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన పీఎస్ఎల్వీ సీ–39 ప్రయోగం విఫలమైన నాలుగు నెలల తరువాత చేస్తున్న మొదటి ప్రయోగం ఇదే. ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీఎస్ఎల్వీ సీ–40 రాకెట్ ద్వారా దేశీయ అవసరాల కోసం కార్టోశాట్–2 సిరీస్‌లో ఒక ఉపగ్రహం, విదేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. ఇందులో 25 చిన్న తరహా ఉపగ్రహాలు, మూడు అతిచిన్న ఉపగ్రహాలతో పాటు ఓ యూనివర్సిటికీ చెందిన ఉపగ్రహం కూడా ఉంటుందని ఇస్రో అధికారిక వర్గాల సమాచారం. -
‘ఆ శకలంపై ఆందోళనే వద్దు'
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గత నెల 31న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ39 రాకెట్ శకలం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని షార్ అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. నింగిలో ఉన్న రాకెట్ శకలం (ఉపగ్రహాన్ని అమర్చిన ఉష్ణపుగది) నేరుగా స్కైలాబ్ తరహాలో భూమి మీద పడుతుందని భారీఎత్తున ప్రచారం జరుగుతోంది. కొంతమంది పనిగట్టుకుని ఉత్తుత్తి ప్రచారాలు చేస్తున్నారని షార్ అధికారులు పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ రాకెట్ నుంచి హీట్‌షీల్డ్‌లో అమర్చిన ఉపగ్రహం విడిపోకుండా భూమికి 418 కి.మీ ఎత్తులో ఉందని తెలుస్తోంది. ఈ శకలం నుంచి అప్పుడప్పు డు సిగ్నల్స్ అందుతుండటంతో షార్‌లో ఇటీవల నిర్మించిన మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ (ఎంవోటీఆర్) కేంద్రం ట్రాక్‌చేస్తూ ఉంది. సముద్రంలో లేదా భూవాతావరణంలో.. షార్ అధికారులు చెప్పినదాని ప్రకారం.. ప్రయోగం జరిగిన నాటి నుంచి 60 రోజుల్లోపు ఆ శకలం భూమికి చేరుకుంటుంది. ఈ లెక్కన అక్టోబర్ నెలాఖరుకు ఈ రాకెట్ శకలం భూమిని చేరుకుంటుందని అంచనావేస్తున్నారు. శకలం భూవాతావరణంలోకి రాగానే పైనే పేలిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఉపగ్రహానికి అమర్చిన ఉష్ణపుగది నేరుగా వస్తే ఎంవోటీఆర్ ద్వారా ట్రాక్‌చేసి బంగాళాఖాతంలోకి నెట్టేస్తారు. అదే పక్కకు తిరిగే పొజిషన్లో వస్తే మాత్రం భూవాతావరణంలోకి రాగానే పేలిపోతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉష్టపుగదిలో ఉన్న ఉపగ్రహంలో 827 కిలోల ద్రవ ఇంధనం మాత్రమే ఉన్నందున ఎలాంటి ప్రమాదమూ ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. హీట్‌షీల్డ్ నుంచి ఉపగ్రహం ఎందుకు విడిపోలేదనే దానిపై ఆదివారం కమిటీ రిపోర్టును ఇస్రో చైర్మన్‌కు సమర్పించారని తెలుస్తోంది.