
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి రానున్న ఆరు నెలల కాలంలో నాలుగు ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని షార్ డైరెక్టర్ ఎస్.పాండియన్ తెలిపారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయ మైదానంలో బుధవారం షార్‌లోని భాస్కర అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ రెండో వారంలో పీఎస్‌ఎల్‌వీ సీ42 ద్వారా యూరోపియన్‌కు చెందిన నోవాశాట్, ఎస్–14 అనే రెండు విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నామని చెప్పారు.
రెండో ప్రయోగవేదికపై అక్టోబర్ మొదటి వారంలో జీఎస్‌ఎల్‌వీ మార్క్–3, డీ–2 ప్రయోగం ద్వారా జీశాట్–29 అనే ఉపగ్రహాన్ని పంపిస్తామన్నారు. వెంటనే నవంబర్, డిసెంబర్ నెలల్లో పీఎస్‌ఎల్‌వీ సీ43, సీ 44 రాకెట్లును ప్రయోగిస్తామన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం 2019 ప్రథమార్థంలో ఉంటుందన్నారు. సూర్యుడిపై పరిశోధనకు నాసాతో ఇస్రో ఇప్పటికే చర్చలు జరుపుతోందని, ఫలప్రదమైతే ఆదిత్య–1 పేరుతో ఉపగ్రహాన్ని పంపడం తమ లక్ష్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment