pandian
-
క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై: వీకే పాండ్యన్
ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేడీ ఘోర ఓటమి చవిచూడటంతో క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ అధికారి, ఆ పార్టీ నేత వీకే పాండ్యన్ ప్రకటించారు. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌కు సాయంగా ఉండేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. -
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్ గుడ్‌బై
భువనేశ్వర్: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్ భావోద్వేగానికి గురయ్యారు. -
సీఎం నవీన్ పట్నాయక్ ప్రైవేటు సెక్రటరీకి.. కేబినెట్ హోదా
భువనేశ్వర్: ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేటు సెక్రటరీగా పనిచేస్తున్న వీకే పాండియాన్ ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. సీఎం పట్నాయక్‌కు సన్నిహితుడిగా పాండియన్ పేరు తెచ్చుకున్నారు. అయితే అధికార పార్టీ ప్రయోజనాల కోసం తన ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో ఇటీవల తరుచూ వివాదాల్లో చిక్కుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసిన పాండియన్.. ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి 190 సమావేశాలు నిర్వహించారు. దీంతో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి అధికారికంగా బీజేడీ పార్టీలో చేరి రాజకీయాలు చేసుకుంటే సరిపోతుందని విమర్శలు గుప్పించాయి పాండియన్ రాజీనామా కాంగ్రెస్‌కే మేలు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సలుజా పాండియన్ స్వచ్ఛంద విరమణ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పని ఇంతకముందే చేయాల్సి ఉండేదని, ఆలస్యం చేశారని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేక తిరిగి సొంత రాష్ట్రానికి వస్తారో తెలియదని.. అయితే బీజేడీలో చేరితే మాత్రం ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఎంతో సహాయం చేసిన వారవుతారని అన్నారు. రాజకీయాల కోసమే రాజీనామా తన రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టేందుకే పాండియన్ రాజీనామా చేసినట్లు బీజేపీ చీఫ్ విప్ మోహన్ మాఝీ మండిపడ్డారు. ఇప్పుడు తాను బ్యూరోక్రాట్ ముసుగుతో కాకుండా బహిరంగంగా రాజకీయాలు చేయగలడని, ఒడిశా ప్రజలు అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని తెలిపారు. కాగా తమిళనాడుకు చెందిన పాండియన్ ఒడిశా కేడర్‌కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. స్వచ్ఛంద పదవీ విరమణ కొరుతూ పాండియన్ ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాయగా.. సర్కార్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ర్యాంకు హోదా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒకరోజు తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌కు ఒడిశా ప్రభుత్వం కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంఇ 5టీ(ట్రాన్స్ఫౄర్మేషనల్ ఇనిషియేటివ్), ‘నబిన్ ఒడిశా’ పథకానికి చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిష్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది పకల్పించినట్లుద సమాచారం. దీంతో పాండియన్ నేరుగా ముఖ్యమంత్రి కింద పని చేయనున్నారు. -
రాబోయే ఆరు నెలల్లో నాలుగు ప్రయోగాలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి రానున్న ఆరు నెలల కాలంలో నాలుగు ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని షార్ డైరెక్టర్ ఎస్.పాండియన్ తెలిపారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయ మైదానంలో బుధవారం షార్‌లోని భాస్కర అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ రెండో వారంలో పీఎస్ఎల్వీ సీ42 ద్వారా యూరోపియన్‌కు చెందిన నోవాశాట్, ఎస్–14 అనే రెండు విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నామని చెప్పారు. రెండో ప్రయోగవేదికపై అక్టోబర్ మొదటి వారంలో జీఎస్ఎల్వీ మార్క్–3, డీ–2 ప్రయోగం ద్వారా జీశాట్–29 అనే ఉపగ్రహాన్ని పంపిస్తామన్నారు. వెంటనే నవంబర్, డిసెంబర్ నెలల్లో పీఎస్ఎల్వీ సీ43, సీ 44 రాకెట్లును ప్రయోగిస్తామన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం 2019 ప్రథమార్థంలో ఉంటుందన్నారు. సూర్యుడిపై పరిశోధనకు నాసాతో ఇస్రో ఇప్పటికే చర్చలు జరుపుతోందని, ఫలప్రదమైతే ఆదిత్య–1 పేరుతో ఉపగ్రహాన్ని పంపడం తమ లక్ష్యమన్నారు. -
సినిమా పేరుతో మోసం
తిరువొత్తియూరు(చెన్నై): సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి 27 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. శివగంగై జిల్లా దేవకోటై కీళవాయిల్ గ్రామం కార్మేఘన్ కుమారుడు పాండియన్ (40) సినిమాల పేరుతో విద్యార్థులను లక్ష్యం చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ట్రిప్లికేన్ దంత వైద్యశాల దగ్గర నిలుచొని ఉన్న మెకానిక్ మణి (21), అతని స్నేహితుడు ఆది (23)లను సినిమాల్లో అవకాశం ఉందంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. విజయ్ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. కొద్ది దూరం తీసుకెళ్లి పాండియన్ కత్తి చూపించి వారి వద్ద వున్న సెల్‌ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో వీరద్దరూ కేకలు వేయడంతో స్థానికులు పాండియన్ చుట్టుముట్టి పట్టుకున్నారు. అతనిని ట్రిప్లికేన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయగా 21న తండయారుపేటలోని విద్యార్థులకు సినిమా ఆశ చూపి 15 సెల్ఫోన్లను, 16న వేలూరు జిల్లా రాణిపేట ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల వద్ద 16 సెల్ఫోన్లను చోరీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు అతని వద్ద నుంచి 27 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారు.