భువనేశ్వర్: ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేటు సెక్రటరీగా పనిచేస్తున్న వీకే పాండియాన్ ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. సీఎం పట్నాయక్‌కు సన్నిహితుడిగా పాండియన్ పేరు తెచ్చుకున్నారు.
అయితే అధికార పార్టీ ప్రయోజనాల కోసం తన ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో ఇటీవల తరుచూ వివాదాల్లో చిక్కుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసిన పాండియన్.. ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి 190 సమావేశాలు నిర్వహించారు. దీంతో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి అధికారికంగా బీజేడీ పార్టీలో చేరి రాజకీయాలు చేసుకుంటే సరిపోతుందని విమర్శలు గుప్పించాయి
పాండియన్ రాజీనామా కాంగ్రెస్‌కే మేలు
సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సలుజా పాండియన్ స్వచ్ఛంద విరమణ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పని ఇంతకముందే చేయాల్సి ఉండేదని, ఆలస్యం చేశారని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేక తిరిగి సొంత రాష్ట్రానికి వస్తారో తెలియదని.. అయితే బీజేడీలో చేరితే మాత్రం ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఎంతో సహాయం చేసిన వారవుతారని అన్నారు.
రాజకీయాల కోసమే రాజీనామా
తన రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టేందుకే పాండియన్ రాజీనామా చేసినట్లు బీజేపీ చీఫ్ విప్ మోహన్ మాఝీ మండిపడ్డారు. ఇప్పుడు తాను బ్యూరోక్రాట్ ముసుగుతో కాకుండా బహిరంగంగా రాజకీయాలు చేయగలడని, ఒడిశా ప్రజలు అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని తెలిపారు. కాగా తమిళనాడుకు చెందిన పాండియన్ ఒడిశా కేడర్‌కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. స్వచ్ఛంద పదవీ విరమణ కొరుతూ పాండియన్ ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాయగా.. సర్కార్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ ర్యాంకు హోదా
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒకరోజు తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌కు ఒడిశా ప్రభుత్వం కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంఇ 5టీ(ట్రాన్స్‌ఫౄర్మేషనల్ ఇనిషియేటివ్), ‘నబిన్ ఒడిశా’ పథకానికి చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిష్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది పకల్పించినట్లుద సమాచారం. దీంతో పాండియన్ నేరుగా ముఖ్యమంత్రి కింద పని చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment