సూళ్లూరుపేట: చంద్రుని మూలాలు కనుగొనడానికి ఉద్దేశించి భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్–2 ప్రయోగానికి సంబం«ధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్3–ఎం1 రాకెట్ రెండు దశల అనుసంధానం పనులు పూర్తయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 నుంచి చంద్రయాన్–2 ప్రయోగాన్ని పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి జూలై 15న నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రయోగానికి సంబంధించి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఆర్బిటర్ మిషన్ చేరుకున్న విషయం కూడా విదితమే. దీనికి సంబంధించి మంగళవారం బెంగళూరులోని అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయంలో 60 మంది శాస్త్రవేత్తలతో రెండో లూనార్ సైన్స్ మీట్ నిర్వహించారు. ఈ ప్రయోగంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 8 ఆర్బిట్ పేలోడ్స్, మూడు ల్యాండర్ పేలోడ్స్, రెండు రోవర్ పేలోడ్స్ పంపించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.
అంటే ఈనెల 13, 14 తేదీల్లో కూడా చంద్రయాన్–2 ప్రయోగంలో ఇస్రో హెడ్‌క్వార్టర్‌లో సైన్స్ మీట్ నిర్వహించారు. రెండో మారు నిర్వహించిన లూనార్ సైన్స్‌మీట్‌కు వివిధ పరిశోధనా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, ఇస్రో కేంద్రాలు, ప్రయోగశాలలనుంచి సుమారు 60 మంది శాస్త్రవ్తేతలు హాజరయ్యారు. చంద్రయాన్–2లో పంపబోయే నాలుగు పేలోడ్స్ గురించి కూడా వారు చర్చించినట్టు సమాచారం. ఇందులో ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, సింథటిక్ ఆపార్చర్ రాడార్, ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్, మాస్ స్పెక్ట్రోమీటర్ వంటి ఆర్బిటర్ పేలోడ్ల యొక్క డేటా విశ్లేషణ పద్ధతి, పేలోడ్ డేటాను సైన్స్ ఉత్పత్తులకు మార్చడంలో వున్న దశల గురించి వారంతా సమావేశంలో విశ్లేషించారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్‌తో పాటు 60 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment