షార్‌లో సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ సీ51
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 28న పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనుంది. ఉదయం 10.23కు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి 21 ఉపగ్రహాలతో ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. పలు వర్సిటీల విద్యార్థులు యూనిటీ శాట్స్ అనే పేరుతో తయారు చేసిన సతీష్ ధవన్ శాట్–1, జిట్ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్, శ్రీశక్తి శాట్, సింధు నేత్ర, ఆనంద్ అనే ఉపగ్రహాలతో పాటు పలు ఉపగ్రహాలను ఇస్రో పంపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment