14న జీఎస్‌ఎల్వీ మార్క్‌–3డీ 2 ప్రయోగం | GSLV Mark-3D 2 experiment on 14th | Sakshi

14న జీఎస్‌ఎల్వీ మార్క్‌–3డీ 2 ప్రయోగం

Published Mon, Nov 5 2018 12:56 AM | Last Updated on Mon, Nov 5 2018 12:56 AM

GSLV Mark-3D 2 experiment on 14th - Sakshi

హైసిస్‌ ఉపగ్రహం

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో 2 ప్రయోగాలకు సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ ఈ ప్రయోగాలకు వేదికకానుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 14న సాయంత్రం జీఎస్‌ఎల్వీ మార్క్‌–3డీ2 ద్వారా 3,700 కిలోలు బరువు గల కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహంలో కేఏ ఎక్స్‌ కేయూ మల్టీభీమ్‌ అండ్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్‌ఫాండర్లు పంపించడం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి. గ్రామాల్లోని వనరులు, సదుపాయాలు, కావాల్సిన ఏర్పాట్లను గుర్తించి ఇది సమాచారం అందిస్తుంటుంది. ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది.  

నెలాఖరులో పీఎస్‌ఎల్వీ సీ43 ప్రయోగం 
షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల చివరిలో పీఎస్‌ఎల్వీ సీ43 రాకెట్‌ను ప్రయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ద్వారా హైపర్‌ స్పెక్ట్రల్‌ సిస్టం ఇమేజ్‌ శాటిలైట్‌(హైసిస్‌) ఉపగ్రహంతో పాటు 30 విదేశీ ఉపగ్రహాలను పంపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement