
శ్రీహరికోట(సూళ్లూరుపేట): నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 24న నిర్వహించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ44 ప్రయోగానికి సంబంధించి మైక్రోశాట్–ఆర్ అనే ఉపగ్రహం ఆదివారం షార్‌కు చేరుకుంది.
బెంగళూరులోని యూఆర్ శాటిలైట్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం బయల్దేరిన ఈ ఉపగ్రహం ఆదివారం సాయంత్రానికి షార్‌కి చేరుకుంది. మొదటి ప్రయోగవేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ44 రాకెట్ అనుసంధానానికి సంబంధించి నాలుగుదశల పనులను పూర్తి చేశారు. ఈ వారంలోనే రాకెట్ శిఖరభాగాన ఉపగ్రహాన్ని అమర్చేందుకు సిద్ధమవుతున్నారు.