29న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 ప్రయోగం  | GSLV F08 experiment on 29th | Sakshi
Sakshi News home page

29న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 ప్రయోగం 

Published Tue, Mar 27 2018 2:41 AM | Last Updated on Tue, Mar 27 2018 8:18 AM

GSLV F08 experiment on 29th - Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 29న సాయంత్రం 4.56 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 రాకెట్‌ ప్రయోగం నిర్వహించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలుకానుంది.

ఈ ప్రయోగంలో 2,140 కిలోల బరువు కలిగిన జీశాట్‌ 6ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. దీనిపై మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్లో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ(ఎంఆర్‌ఆర్‌) చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రయోగతేదీని, కౌంట్‌డౌన్‌ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement