
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో)సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగవేదిక (షార్) నుంచి ఆదివారం రాత్రి 10.07 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ42 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం మధ్యాహ్నం 1.07 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. షార్ కేంద్రంలోని బ్రహ్మప్రకాష్ హాల్‌లో ఎంఆర్‌ఆర్ కమిటీ చైర్మన్ కాటూరి నారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మిషన్ సంసిద్ధతా సమావేశాలు నిర్వహించారు.
లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఎస్.పాండ్యన్ ఆధ్వర్యంలో ప్రయోగానికి 33 గంటల ముందు శనివారం మధ్యాహ్నం 1.07 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించాలని నిర్ణయించారు. పీఎస్‌ఎల్‌వీ సీ42 ద్వారా యునైటెడ్ కింగ్‌డం (బ్రిటన్)కు చెందిన 889 కిలోల బరువు కలిగిన నోవాసార్, ఎస్1–4 అనే రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment