
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధాలవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 29న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 రాకెట్ ప్రయోగిం చేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 11న రాకెట్ మూడోదశ అయిన క్రయోజనిక్ దశ అనుసంధానం పూర్తయింది. దీంతో మూడు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తయ్యాయి.
ఈ మూడు దశల రాకెట్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈనెల 19న రాకెట్ శిఖరభాగాన 2,140 కిలోల బరువు కలిగిన జీశాట్–6ఏ ఉపగ్రహాన్ని అమర్చనున్నారు. అనంతరం రెండు రోజుల పాటు రాకెట్‌కు అన్ని రకాల సాంకేతిక పరీక్షలు నిర్వహించి 23న మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్) నుంచి ప్రయోగవేదిక (ఉంబ్లికల్ టవర్)కు అనుసంధానించే పనులు చేపట్టనున్నారు. అక్కడ సుమారు ఆరు రోజుల పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం 29న సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్యలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment