
షార్‌లోని రెండో ప్రయోగవేదికపై రాకెట్‌ను అనుసంధానం చేసిన దృశ్యం
సూళ్లూరుపేట: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 ఉపగ్రహ వాహకనౌకను ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5.43 గంటలకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ప్రయోగించనున్నారు. దీని ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1ను రోదసీలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో అనుసంధానం పనులు పూర్తయ్యాయి.
అనంతరం వ్యాబ్ నుంచి ఉంబ్లికల్ టవర్(యూటీ) రాకెట్‌ను శనివారం ఉదయం 6 గంటలకు తరలించి రెండో ప్రయోగవేదికకు అనుసంధానం చేశారు. ఈ నెల 3వ తేదీ వరకు అన్నిరకాల పరీక్షలు పూర్తి చేసి అదేరోజున లాంచ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. 3న సాయంత్రం మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ(ఎంఆర్‌ఆర్) సమావేశం జరుగుతుంది. 4వ తేదీ మధ్యాహ్నం 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment