క్రయోజనిక్‌ దశపై ఇస్రో పట్టు! | Isro eyes on cryogenic engine | Sakshi
Sakshi News home page

క్రయోజనిక్‌ దశపై ఇస్రో పట్టు!

Published Tue, Jun 6 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

క్రయోజనిక్‌ దశపై ఇస్రో పట్టు!

క్రయోజనిక్‌ దశపై ఇస్రో పట్టు!

- కీలకమైన ఇంజిన్, ఇంధనం సొంతంగా అభివృద్ధి
- ఇకపై భారీ రాకెట్లు, బరువైన ఉపగ్రహాల ప్రయోగం ఇస్రో నుంచే


శ్రీహరికోట (సూళ్లూరుపేట): మూడు, నాలుగు టన్నుల బరువుండే భారీ ఉపగ్రహాలను అంత రిక్షంలోకి తీసుకెళ్లగలిగిన ‘జీఎస్‌ఎల్‌వీ (జియో సింక్రనస్‌ లాంచ్‌ వెహికిల్‌)’రాకెట్‌లో అత్యంత కీలకమైన క్రయోజనిక్‌ దశపై ఇస్రో పట్టుబిగించింది. క్రయోజనిక్‌ దశను పూర్తిస్థాయిలో అభి వృద్ధి చేసే ప్రక్రియలో సాంకేతికపరమైన ఇ బ్బందులన్నింటినీ అధిగమించి విజయం సాధించింది. సాధారణ జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ లోని మూడో దశలో ఉండే క్రయోజనిక్‌ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అదే జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 తరహా భారీ రాకెట్‌లో 25 టన్నుల క్రయో ఇంధనం అవస రమవుతుంది. కొన్నేళ్ల కింద జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో ఈ క్రయో వ్యవస్థను పకడ్బందీగా రూపొందించేందుకు కొంత సమయం తీసుకుంది. తాజాగా జీఎస్‌ఎ ల్‌వీ మార్క్‌–3డీ1 ప్రయోగం విజయవంతం కావడంతో క్రయోజనిక్‌ టెక్నాలజీలో ఇస్రోకు పట్టు చిక్కింది.

ఇక భారీ ఉపగ్రహాలు ఇస్రో నుంచే..
గతంలో భారీ ఉపగ్రహాలను ఫ్రెంచిలోని గయా నా కౌరూ అంతరిక్ష పరి శోధన కేంద్రం నుంచి వాళ్ల ఏరియాన్‌ రాకెట్‌ల ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తూ వచ్చారు. కానీ తాజాగా విజ యంతో ఇక నుంచి ఐదు టన్నుల వరకు బరువైన ఉప గ్రహాలను షార్‌ నుంచే పంపించే వెసు లుబాటు కలిగింది. ఇటీవలి వరకు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల కోసం రష్యా తయారు చేసిన క్రయోజ నిక్‌ ఇంజన్లు ఉపయోగించి ఆరు ప్రయో గాలు, సొంతంగా తయారు చేసిన ఒక క్రయో జనిక్‌ ఇంజన్‌తో ఒక ప్రయోగం చేశారు. ఇందు లో జీఎస్‌ఎల్‌వీ–డీ1 పేరుతో 2001 ఏప్రిల్‌ 18న చేసిన మొట్ట మొదటి ప్రయోగంలో 2 వేల కిలోల బరువైన జీశాట్‌–01 సమాచార ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఈ ఏడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో రెండు విఫలమ య్యాయి. 2010 ఏప్రిల్‌ 15న సొంత క్రయోజనిక్‌ ఇంజన్లతో కూడిన జీఎ స్‌ఎల్‌వీ–డీ3ని ప్రయోగించగా విఫలమైంది. అదే ఏడాది డిసెంబర్‌ 25న రష్యా క్రయోజనిక్‌ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం కూడా విఫలమైంది. దీంతో ఇస్రో దాదాపు రెండేళ్లపాటు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల జోలికే వెళ్లలేదు. అనంతరం సొంతంగా పూర్తిస్థాయి క్రయోజనిక్‌ దశ అభివృద్ధిపై దృష్టి పెట్టింది.

రెండేళ్లకుపైగా కృషి..
క్రయోజనిక్‌ ఇంజన్‌లో ఇంధనంగా ఉపయో గించే లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ హైడ్రోజన్‌లను మైనస్‌ 220, మైనస్‌ 270 డిగ్రీల అతి శీతల పరిస్థితుల్లో ఉంచాల్సి ఉంటుంది. అతి సున్నితమైన ఈ క్రయోజనిక్‌ ప్రక్రియలో బాలారిష్టాలను దాటేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అవిరళ కృషి చేశారు. చివరికి విజయం సాధిం చారు. సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్‌ ఇంజిన్లతో చేసిన నాలుగు ప్రయోగాలు వరు సగా విజయాలు సాధించాయి. సోమవారం చేసిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1తో ఇందులో ఇస్రో పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. మామూలు జీఎస్‌ఎల్‌వీలో మూడో దశలో ఉండే క్రయోజనిక్‌ దశలో 12.5 టన్నుల క్రయో ఇంధనాన్ని వాడతారు. అదే జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3లో క్రయోజనిక్‌ దశలో 25 టన్నులు (సీ–25) ఇంధనం ఉపయోగించారు. ఈ క్రయోజనిక్‌–25 వ్యవస్థను అభివృద్ధి చేయడా నికి దాదాపు రెండేళ్లు పట్టింది.

పకడ్బందీగా బందోబస్తు
జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 ప్రయోగం సందర్భంగా షార్‌ వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. షార్‌ మొదటిగేట్‌లో అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అటకానితిప్ప వద్ద ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నుంచి షార్‌ వరకు ప్రతి కిలోమీటరుకు ఇద్దరు చొప్పన భద్రతా సిబ్బందిని మోహరిం చారు. షార్‌ కేంద్రానికి చుట్టూరా, సము ద్రం వైపు నుంచి కూడా బందోబస్తు ఏర్పా టు చేశారు. మరోవైపు మెరైన్‌ సిబ్బంది కూడా తీర గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement