శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురు వారం సాయంత్రం 4.56కు ప్రయో గించనున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారం భించేందుకు మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. ఎంఆర్‌ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆ«ధ్వర్యంలో షార్‌లోని బ్రహ్మప్రకాశ్ హాల్లో మంగళవారం సమావేశం జరిగింది.
27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం సాయంత్రం 4.56 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించనున్నామని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్‌ఆర్ సమావేశం అనంతరం ప్రయోగ బాధ్యతలను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) చైర్మన్ పి.కున్హికృష్ణన్‌కు అప్పగించారు. బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment