న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌కి చెందిన 36 ఉపగ్రహాలు శ్రీహరికోటలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కి చేరుకున్నాయి. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డీఎస్‌సీ–షార్) నుంచి జీఎస్‌ఎల్‌వీ–ఎంకే ఐఐఐ రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించనున్నారు. ఇందుకోసం వన్‌వెబ్ సంస్థ .. ఇస్రోలో భాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్)తో చేతులు కలిపింది.
ఈ ఏడాది మరో విడత, వచ్చే ఏడాది మరో మూడు విడతలు లాంచింగ్‌లు ఉంటాయని వన్‌వెబ్ తెలిపింది. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈవో) ఉపగ్రహాల ద్వారా ఇప్పటికే అలాస్కా, కెనడా, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో కనెక్టివిటీ సర్వీసులు అందిస్తున్నట్లు వివరించింది. వన్‌వెబ్‌లో దేశీ దిగ్గజం భారతి ఎంటర్‌ప్రైజెస్ ప్రధాన ఇన్వెస్టరుగా ఉంది.
చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటికి!
Comments
Please login to add a commentAdd a comment