one web Company
-
ఇస్రోకి చేరిన 36 వన్‌వెబ్ ఉపగ్రహాలు
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌కి చెందిన 36 ఉపగ్రహాలు శ్రీహరికోటలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కి చేరుకున్నాయి. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ–షార్) నుంచి జీఎస్ఎల్వీ–ఎంకే ఐఐఐ రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించనున్నారు. ఇందుకోసం వన్‌వెబ్ సంస్థ .. ఇస్రోలో భాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)తో చేతులు కలిపింది. ఈ ఏడాది మరో విడత, వచ్చే ఏడాది మరో మూడు విడతలు లాంచింగ్‌లు ఉంటాయని వన్‌వెబ్ తెలిపింది. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) ఉపగ్రహాల ద్వారా ఇప్పటికే అలాస్కా, కెనడా, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో కనెక్టివిటీ సర్వీసులు అందిస్తున్నట్లు వివరించింది. వన్‌వెబ్‌లో దేశీ దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ ప్రధాన ఇన్వెస్టరుగా ఉంది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటికి! -
శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఇస్రోతో వన్ వెబ్ కీలక ఒప్పందం
ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న యుకె ఆధారిత గ్లోబల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడర్ వన్ వెబ్ సంస్థలో భారతి ఎయిర్టెల్ భారీగా వాటాను కొనుగోలు చేసిన మనకు తెలిసిందే. వన్ వెబ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్ కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు.. కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు. అటువంటి వన్ వెబ్ ప్రాజెక్టు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గురుంచి భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. "భారత నేల నుంచి వన్ వెబ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మేము(వన్ వెబ్) ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాము. ఈ రోజు ఈ ఒప్పందం గురుంచి మీ అందరితో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను" అని సునీల్ మిట్టల్ చెప్పారు. అసలు ఏమిటి వన్ వెబ్ ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రపంచంలో అన్నీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం కేబుల్స్ వేయడం, టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం వన్ వెబ్ ప్రాజెక్టు పేరుతో లండన్ కేంద్రంగా 2012లో జార్జివేలర్ అనే వ్యక్తి స్థాపించాడు. అయితే, ఆ కంపెనీ దివాళా తీసే సమయంలో మన దేశ దిగ్గజ టెలికామ్ కంపెనీ, యుకె ప్రభుత్వం అందులో భారీ వాటాను దక్కించుకున్నాయి. (చదవండి: ఎంజీ ఆస్టార్ వచ్చేసింది. ధర ఎంతంటే?) ఇప్పుడు ఆ ప్రాజెక్టు శర వేగంగా దూసుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి దశలో 150 కిలోల బరువున్న 650 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 322 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపించేవారు. కానీ, ఇప్పుడు ఈ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం చేసుకుంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి భూభ్రమణాన్ని 90-120 నిమిషాల్లో పూర్తి చేస్తాయి. వన్ వెబ్ కీ పోటీగా స్పేస్ ఎక్స్ స్టార్ లింకు ప్రాజెక్టు దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా ప్రారంభించింది. -
ఇండియాలో టార్గెట్ ఫిక్స్,స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ ప్రారంభం అప్పుడే
న్యూఢిల్లీ: స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించే యోచనలో ఎలాన్ మస్క్ ఉన్నారని ఇండియా స్టార్‌లింక్ కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో వీటిని ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. భారత్‌లో ప్రీ–ఆర్డర్ల సంఖ్య 5,000 స్థాయిని దాటేసిందని సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించడంపై తమ సంస్థ ఆసక్తిగా ఉందని భార్గవ వివరించారు. బీటా దశలో 50 నుంచి 150 మెగాబిట్ పర్ సెకన్ స్థాయిలో డేటా స్పీడ్ అందిస్తామని స్టార్‌లింక్ చెబుతోంది. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ నేరుగా పోటీపడనుంది. అంతర్జాతీయంగా స్టార్‌లింక్ కనెక్షన్లకు ప్రీ–ఆర్డర్లు 5,00,000 స్థాయిని దాటేసిందని భార్గవ చెప్పారు. దేశీయంగా రాబోయే నెలల్లో ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీకండక్టర్ల కొరత కారణంగా స్టార్‌లింక్ కిట్లను తయారు చేసే వేగం మందగించిందని ఆయన వివరించారు. చదవండి: ‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా ! -
అమెరికా వన్‌వెబ్‌లో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు
టోక్యో: జపాన్‌కు చెందిన టెలికం, ఇంధన దిగ్గజ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్, అమెరికాకు చెందిన వన్‌వెబ్ కంపెనీలో వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ రెండు కంపెనీలు కలిసి ఫ్లోరిడాలో కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీ తక్కువ వ్యయంతో వారానికి 15 కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేస్తుంది. ఈ ఫ్యాక్టరీ కారణంగా ఇంజినీరింగ్, తయారీ, ఇతర రంగాల్లో మొత్తం 3,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా.2018 కల్లా ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తుందని వన్‌వెబ్ భావిస్తోంది.