పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌ ప్రయోగం విజయవంతం | Sriharikota: ISRO Launch PSLV C 53 | Sakshi
Sakshi News home page

Sriharikota: పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

Published Thu, Jun 30 2022 6:12 PM | Last Updated on Thu, Jun 30 2022 6:42 PM

Sriharikota: ISRO Launch PSLV C 53 - Sakshi

సాక్షి, శ్రీహరికోట: నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ53 దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్‌ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్‌–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.
చదవండి: సెట్టింగ్‌ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది..

ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్‌ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement