
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ డీ6
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్వీ డీ6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్‌డౌన్ ప్రారంభమైన 29 గంటల అనంతరం గురువారం సాయంత్రం 4.52 గంటలకు దీన్ని ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ జీఎస్‌ఎల్వీ డీ6 అంతరిక్షంలోకి దూసుకుపోయింది.
2,117 కిలోలు బరువున్న జీశాట్-6 ఉపగ్రహాన్ని నింగికి మోసుకెళ్లింది. 1,024 సెకన్లకు 170 కిలోమీటర్ల పెరూజీ (భూమికి అతి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) 19.95 డిగ్రీల భూ సమాంతర కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ దశతో రెండోసారి చేస్తున్న ప్రయోగం ఇది.