నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆందోళన..! | Spicejet Flight Stopped In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆందోళన..!

Published Sun, Jul 21 2019 1:23 PM | Last Updated on Sun, Jul 21 2019 2:43 PM

Spicejet Flight Stopped In Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉదయం 7.45 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరాల్సిన స్పైస్‌జెట్‌ విమానం ఇంకా కదలడం లేదు. దాంతో 80 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ఎంతకు విమానం కదలకపోవడంతో వారు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్పైస్‌జెట్‌ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాము గంటల తరబడి నిరీక్షిస్తున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగానే విమానం ఆగిపోయిందని స్పైస్‌జెట్‌ సిబ్బంది వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement