సాక్షి, న్యూఢిల్లీ: డ్రైవరు అవసరం లేకుండా తనంతట తాను నడుపుకుంటూ వెళ్లే ‘టెస్లా’ కంపెనీ కార్లు ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల మార్కెట్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ కంపెనీకి చెంది మూడో మాడల్ కార్లో మంగళవారం నాడు ఓ సాంకేతిక లోపం కనిపించింది. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆ కారును కారు యజమాని ఓ యాప్ ద్వారా తన వద్దకు రమ్మని ఆదేశం ఇచ్చారు. పార్కింగ్ స్థలం నుంచి క్షేమంగా రోడ్డు మీదకు వచ్చిన ఆ కారు ఎలా వెళ్లాలో తెలియక కాస్త కంగారు పడింది. రాంగ్ రూటులో డౌన్‌లోకి వెళ్లి తికమక పడింది. కాసేపు ఆగిపోయింది, మళ్లీ స్టార్టు చేసుకొని పక్కకు వెళ్లింది. బ్రిటిష్ కొలంబియాలోని రిచ్‌మండ్ రోడ్డులో కనిపించిన ఈ సీన్‌ను పాదాచారులెవరో గుర్తించి వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.
దీని మీద వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించిన కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ఇప్పటీ వరకు కార్ల యజమానులు యాప్ ద్వారా ఇచ్చిన దాదాపు ఐదున్నర లక్షల ఆదేశాలను తమ కార్లు కచ్చతంగా పాటించాయని, ఈ ఒక్క కారు విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ డ్రైవర్ అవసరం లేని కార్లు తమను నిర్దిష్ట ప్రాంతాల్లో దించి, అవంతట అవే పార్కింగ్ స్థలాలకు వెళ్లి పార్కు చేసుకోవడం, తాము సందేశం ఇవ్వగానే పార్కింగ్ స్థలం నుంచి తమ వద్దకు రావడం ఎంతో బాగుండడమే కాకుండా ఎంతో థ్రిల్లింగాగా కూడా ఉందని పలువురు వీటిని కొన్న ఎక్కువ మంది కార్ల యజమానులు ఇంతకుముందే మీడియాతో చెప్పారు. యజమానులను చికాకు పర్చడమే కాకుండా, పాదాచారులను భయపెడుతున్నాయని కొంత మంది యజమానులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment