
కృష్ణాజిల్లా: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో ఆ విమానం నిలిచిపోయింది. విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 177 మంది ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం రన్‌వేపైనే నిలుచుని ఉంది. ప్రయాణికులను తిరిగి లాంజ్‌లోకి తరలించారు. సాంకేతిక లోపాన్ని అధికారులు సరిచేస్తున్నారు. రాత్రి 8 గంటలకు ప్రయాణికులను ఢిల్లీ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment