Air India Authority
-
బాంబు బెదిరింపుల వేళ.. విమానంలో పేలుడు పదార్థాలు
ఢిల్లీ: దేశంలో వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఓ విమానంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో క్యాట్రిడ్జ్(పేలుడు పదార్థం) దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.వివరాల ప్రకారం.. అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. ప్రయాణీకులందరూ విమానం దిగిన తర్వాత విమానంలోని ఓ సీటులో క్యాట్రిడ్జ్‌ను సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సంస్థలకు చెందిన అధికారులు మాట్లాడుతూ.. ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI916 సీటు జేబులో క్యాట్రిడ్జ్(పేలుడు పదార్థం) దొరికింది. అయితే, అప్పటికే ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు. భద్రతా ప్రొటోకాల్‌ను పాటిస్తూ ఈ విషయంపై ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలుసులు కూడా వెల్లడించారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో విమానాలు, స్కూల్స్, హోటల్స్‌కు బాంబు బెదిరింపు కాల్స్ పెరిగిన విషయం తెలిసిందే. పలువురు ఆకతాయిలు.. ఫేర్ బెదిరింపు కాల్స్ చేయడంతో ఈ ఘటనపై అధికారులు, పోలీసులు కూడా దృష్టిసారించారు. ఇక, గడిచిన 20 రోజుల్లో మొత్తం 600కుపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. ఈ బెదిరింపులన్నీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇలాంటి బెదిరింపులపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది."One ammunition cartridge was found in the pocket of a seat of our flight AI916 after it had landed from Dubai at Delhi on 27 October 2024 and all passengers had safely disembarked. A complaint was immediately lodged with the Airport Police by Air India strictly adhering to the… pic.twitter.com/INwG7Kf9K5— ANI (@ANI) November 2, 2024 -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా ఆగిపోయిన విమానం
కృష్ణాజిల్లా: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో ఆ విమానం నిలిచిపోయింది. విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 177 మంది ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం రన్‌వేపైనే నిలుచుని ఉంది. ప్రయాణికులను తిరిగి లాంజ్‌లోకి తరలించారు. సాంకేతిక లోపాన్ని అధికారులు సరిచేస్తున్నారు. రాత్రి 8 గంటలకు ప్రయాణికులను ఢిల్లీ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
డిసెంబరే టార్గెట్.. ఎయిరిండియాను అమ్మేయడానికే
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమ్మేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఎఎమ్) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియా నష్టాలు 2020 మార్చి 31 నాటికి రూ. 70,820 కోట్లకు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు వ్యూహాత్మక పెట్టుబడుల కోసం బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డీఐపీఎఎమ్ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఎయిర్ ఇండియాకు వ్యతిరేకంగా న్యూయార్క్ కోర్ట్‌లో కొనసాగుతున్న విచారణ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అవసరమైతే బిడ్డర్లకు ప్రభుత్వం హామీ ఇస్తుందని బిజినెస్ టైమ్స్‌తో డీఐపీఎఎమ్ ప్రతినిధులు చెప్పినట్లు కొన్ని కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా,ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయితే ఈ ఏడాదిలోనే అమ్మేయడం ఖరారైనట్లేనని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆదుకోండి, నన్ను అమ్మొద్దు ప్లీజ్
రుణ భారాలను తగ్గించుకోడానికి ఎయిర్ ఇండియా 2015 నుంచి 2021 జూలై నాటికి 115 ఆస్తులను విక్రయించిందని, తద్వారా రూ.738 కోట్లు సమకూర్చుకుందని పౌర విమానయాన శాఖమంత్రి వీకే సింగ్ లోక్‌సభకు తెలిపారు. లీజ్ రెంటల్ ఆదాయంగా ఎయిర్ ఇండియాకు వార్షికంగా రూ.100 కోట్లు అందుతున్నట్లు కూడా వెల్లడించారు. ప్రాజెక్ట్ రాయల్ అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను అమ్మేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రూ.60,074 వేల కోట్ల అప్పుల్లో ఉంది. అయితే ఆ రుణ భారం నుంచి బయటపడేందుకు కేంద్రం ఎయిరిండియాను అమ్మేందుకు ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించింది. అందుకు 64రోజుల సమయం ఇచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. ఇదే సమయంలో 'ప్రాజెక్ట్ రాయల్' పేరుతో ఎయిర్ ఇండియా వ్యాల్యూ ఎంత ఉందనేది తెలుసుకుంటున్నారు. ఈ వ్యాల్యూషన్ అంతా నాలుగు పద్దతుల్లో జరుగుతుంది. ఇతర విమాన సంస్థలు వ్యాల్యూ ఎలా ఉంది? ఎయిరిండియా సర్వీసుల కోసం చేసిన ఖర్చు ఎంత? ఎయిరిండియాకు వచ్చిన మొత్తాన్ని ఏ పర్పస్ కింద ఖర్చు చేశారు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? నికర ఆస్తులు ఎంత? వాటి మొత్తం వ్యాల్యూ ఎంత అనే విషయాల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. మరోవైపు ఎయిరిండియా అమ్మకాలతో ఆ సంస్థలో పనిచేస్తున్న పదివేల మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నష్టాల నుంచి బయటపడేలా భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేయాలని కోరుతున్నారు. మరి ఎంతమేరకు సఫలం అవుతుందో చూడాల్సి ఉండగా.. ఎయిరిండియా ను సొంతం చేసుకునేందుకు టాటా, స్పైస్‌జెట్ ప్రమోటర్ అయిన అజయ్‌సింగ్ తో పాటు మరో నాలుగు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఏఏఐకు రూ.30,069 కోట్ల ఆదాయం తన జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టులు లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ఎయిర్‌పోర్టుల నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ.30,069 కోట్ల ఆదాయాన్ని పొందినట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి లోక్సభుకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. హైదరాబాద్‌సహా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, నాగపూర్లలో పీపీపీ నమూనాలో ఏఏఐ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. 2020–21లో ప్రభుత్వం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రూ.856 కోట్లను రాయితీ ఫీజుగా పొందిందనీ ఆయన తెలిపారు. ఏఏఐ పౌర విమానయాన శాఖ కింద పనిచేసే సంగతి తెలిసిందే. -
43 దేశాల నుంచి 60వేల మంది స్వదేశానికి..
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించింది. అందులో భాగంగానే నేటి నుంచి వందేభారత్ మిషన్ ఫేజ్-3 ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జూలై 1 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా 43 దేశాల నుంచి 60వేల మంది ప్రయాణికుల తరలింపునకు భారత విమానయానశాఖ ఏర్పాట్లు చేసింది. ఎయిరిండియా వివిధ దేశాల నుంచి ప్రయాణికులను తీసుకురావడానికి 300 విమానాలు నడపనుంది. కాగా.. కరోనా ప్రభావంతో యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకే, ఆఫ్రికా దేశాల నుంచి అనేక మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు. చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం -
ప్రధాని కోసం ప్రత్యేక విమానం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశంలోని అత్యంత ప్రముఖుల పర్యటనల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు బీ 777 విమానాలు ఈ సెప్టెంబర్‌లో ఎయిర్ ఇండియా సంస్థకు అందనున్నాయి. ఈ మేరకు బోయింగ్ సంస్థ నుంచి సమాచారం అందినట్లు సోమవారం అధికారులు తెలిపారు. నిజానికి ఆ విమానాల డెలివరీ జూలైలోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా జాప్యం చోటు చేసుకుందన్నారు. ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా, భారత వైమానిక దళానికి చెందిన పైలట్లు నడుపుతారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం ‘ఎయిర్ ఇండియా వన్’ పేరుతో ఉన్న బీ 747 విమానాలను వినియోగిస్తున్నారు. ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లే నడుపుతున్నారు. వీవీఐపీ ప్రయాణాలు లేని సమయాల్లో ఈ విమానాలు సాధారణ వాణిజ్య ప్రయాణాలకు కూడా వినియోగిస్తున్నారు. అయితే, ఈ బీ 777 విమానాల్లో ఇకపై వీవీఐపీలు మాత్రమే ప్రయాణిస్తారు. ఈ రెండు విమానాలు 2018లోనే కొన్ని నెలల పాటు ఎయిర్ ఇండియా వాణిజ్య ప్రయాణాల్లో భాగంగా ఉన్నాయి. తరువాత వాటిని వీవీఐపీ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మార్పులు చేయాలని కోరుతూ బోయింగ్ సంస్థకు తిరిగి పంపించారు. బీ 777 విమానాల్లో ‘లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్(ఎల్ఏఐఆర్సీఎం) పేరుతో అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ, సెల్ఫ్ ప్రొటెక్షన్ స్వీట్స్(ఎస్పీఎస్) ఉంటాయి. 19 కోట్ల డాలర్ల విలువైన ఈ రెండు రక్షణ వ్యవస్థలను భారత్‌కు అమ్మేందుకు అమెరికా ఈ ఫిబ్రవరిలో ఆంగీకరించింది. -
కాలిఫోర్నియా నుంచి విద్యార్థులు వెనక్కి
ఇమిగ్రేషన్‌లో అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థులకు చుక్కెదురైంది. అక్కడి ఇమిగ్రేషన్ అభ్యంతరంతో వెనక్కి వచ్చిన విద్యార్థులను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ చార్జీలు చెల్లించాలంటూ అధికారులు నిలిపేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ వర్సిటీలో హైదరాబాద్‌కు చెందిన 8 మంది విద్యార్థులకు అడ్మిషన్ లభించింది. దీంతో బుధవారం కాలిఫోర్నియాకు చేరుకున్నారు. అయితే అక్కడ ఇమిగ్రేషన్‌లో యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్‌లో ఉందంటూ, అధికారులు వారిని ఎయిర్ ఇండియా ద్వారా వెనక్కి పంపారు. ఎయిర్ ఇండియా అథారిటీ.. విద్యార్థులను హాంకాం గ్లో దింపేయడంతో 24 గంటలు వారు నరకయాతన అనుభవించారు. అనంతరం విద్యార్థులు తొలు త ఢిల్లీకి, అక్కడ్నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే కాలిఫోర్నియా నుంచి తిరిగొచ్చిన టికెట్ ఖర్చు రూ.1.50 లక్షల చొప్పున చెల్లించాలంటూ రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో నిలిపివేశారు.