న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించింది. అందులో భాగంగానే నేటి నుంచి వందేభారత్ మిషన్ ఫేజ్-3 ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జూలై 1 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా 43 దేశాల నుంచి 60వేల మంది ప్రయాణికుల తరలింపునకు భారత విమానయానశాఖ ఏర్పాట్లు చేసింది. ఎయిరిండియా వివిధ దేశాల నుంచి ప్రయాణికులను తీసుకురావడానికి 300 విమానాలు నడపనుంది. కాగా.. కరోనా ప్రభావంతో యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకే, ఆఫ్రికా దేశాల నుంచి అనేక మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు.
చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment