కాలిఫోర్నియా నుంచి విద్యార్థులు వెనక్కి
ఇమిగ్రేషన్‌లో అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థులకు చుక్కెదురైంది. అక్కడి ఇమిగ్రేషన్ అభ్యంతరంతో వెనక్కి వచ్చిన విద్యార్థులను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ చార్జీలు చెల్లించాలంటూ అధికారులు నిలిపేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ వర్సిటీలో హైదరాబాద్‌కు చెందిన 8 మంది విద్యార్థులకు అడ్మిషన్ లభించింది. దీంతో బుధవారం కాలిఫోర్నియాకు చేరుకున్నారు. అయితే అక్కడ ఇమిగ్రేషన్‌లో యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్‌లో ఉందంటూ, అధికారులు వారిని ఎయిర్ ఇండియా ద్వారా వెనక్కి పంపారు.
ఎయిర్ ఇండియా అథారిటీ.. విద్యార్థులను హాంకాం గ్‌లో దింపేయడంతో 24 గంటలు వారు నరకయాతన అనుభవించారు. అనంతరం విద్యార్థులు తొలు త ఢిల్లీకి, అక్కడ్నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే కాలిఫోర్నియా నుంచి తిరిగొచ్చిన టికెట్ ఖర్చు రూ.1.50 లక్షల చొప్పున చెల్లించాలంటూ రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో నిలిపివేశారు.