
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని వికాస్ భవన్ ఆరో అంతస్తులో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని ఎయిర్ కండిషనర్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమాచారం తెలిసిన వెలంటే ఐదు అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి తరలించామని ఢిల్లీ పైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.
ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడికాలేదు. కాగా ఈనెల 6న దక్షిణ ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సీఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐ మరణించగా, పలు కీలక పత్రాలు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. 11 అంతస్థుల పండిట్ దీన్‌దయాళ్ అంత్యోదయ భవన్‌లోని ఐదో ఫ్లోర్‌లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment