Cable Car Tower
-
విరిగిన కేబుల్ కారు.. గాల్లో ఆరుగురి చిన్నారుల ప్రాణాలు..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో కేబుల్ కారు అకస్మాత్తుగా చిక్కుకుపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది దాదాపు 1200 అడుగుల ఎత్తులో కేబుల్ కారులోనే ఉండిపోయారు. లోయలను దాటే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ఆ ప్రాంతంలో లోయలను కేబుల్ కారు ద్వారానే దాటుతారు. రోజూవారిలాగే నేడు కేబుల్ కారులో 6గురు పాఠశాల పిల్లలతో కలిసి ఎనిమిది మంది ప్రయాణం ప్రారంభించారు. మధ్యకు వెళ్లగానే కేబుల్ కారు ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక బాధితులు అరుపులు మొదలు పెట్టారు. అందులో ఓ వ్యక్తి వద్ద ఫొన్ ఉండగా.. స్థానిక మీడియాకు సమాచారం అందించారు. BREAKING: 6 Children, 2 Adults Trapped in Cable Car 1,000+ Feet in air - 8 people have been trapped in a cable car in the town of Battagram in Pakistan for the last 8 hours. - The 6 children were taking the cable car to school with 2 adults when the wires attached to the car… pic.twitter.com/D0tnuI0eNZ — Brian Krassenstein (@krassenstein) August 22, 2023 సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు. హెలికాఫ్టర్ లేకుండా కేబుల్ కారులో చిక్కుకున్న వారిని రక్షించడం సాధ్యం కాదని భావించి, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. హెలికాఫ్టర్ రంగంలోకి దిగి వారిని సురక్షితంగా రక్షించారు. సాంకేతిక కారణాలతోనే కేబుల్ కారు ఆగిపోయినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు! -
3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే..
ఈక్వెడార్: ప్రపంచంలోనే ఎత్తైన ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 75 మంది గంటల తరబడి అందులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు గంటల పాటు శ్రమించి అందులో ప్రయాణిస్తున్న మొత్తం 75 మందిని సురక్షితంగా కిందికి చేర్చగలిగారు. గాల్లో కేబుల్ కార్ ప్రయాణమంటే సాహసం చేస్తున్నామన్న భావం తోపాటు వినోదం కూడా గ్యారెంటీ. మరి అలాంటి కేబుల్ కార్ లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగితే వినోదం కాస్తా విషాదంగా మారిపోతుంది. ఈక్వెడార్ కేబుల్ కార్ లో అచ్చంగా అలాంటి పరిస్థితే నెలకొంది. ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల నుండి నాలుగు వేల మీటర్ల ఎత్తులో రెండు టెర్మినల్స్ మధ్యలో ప్రయాణిస్తుంది. శుక్రవారం 75 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఈ కేబుల్ కార్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక అందులోని వారు అలాగే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. Atrapados sin salida. Falla eléctrica en las cabinas del Teleférico de Quito dejó a 20 personas en el aire. Luego de cinco horas, los Bomberos comenzaron a evacuar a los atrapados. El alcalde Pabel Muñoz llegó al sitio preocupado por lo que estaba pasando. pic.twitter.com/UWa4aEphnS — LaHistoria (@lahistoriaec) July 7, 2023 సుమారు పది గంటల నిరీక్షణ తర్వాత సహాయక బృందాలు గాల్లో కార్ ఆగిన చోటికి చేరుకొని 65 మందిని తాడుల సాయంతో క్షేమంగా కిందికి దించారు. మరో పది మంది మాత్రం కేబుల్ కార్ తిరిగి ప్రారంభమైన తర్వాత సురక్షితంగా కిందికి వచ్చారు. వీడియోలో ప్రయాణికులను రక్షిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. Este final nadie se lo esperaba. Así fue la evacuación de las personas atrapadas durante varias horas en las cabinas del Teleférico de Quito. pic.twitter.com/C9LHaI6Zqw — LaHistoria (@lahistoriaec) July 7, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
వచ్చే ఏడాదిలోగా కేబుల్ కార్ అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పర్యాటకుల సౌలభ్యం కోసం వచ్చే ఏడాది కల్లా ఆధునాతన కేబుల్ కార్‌ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం స్పెయిన్ పర్యటనలో భాగంగా కేబుల్ కార్‌ను పరిశీలించి అందులో తిరిగారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ ఎత్తైన కొండలపై కొలువైన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రక భువన గిరి కోట, దుర్గం చెరువు లాంటి అనువైన పర్యాటక ప్రదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో అధునాతన కేబుల్ కార్‌ను ప్రవేశపెట్టేలా చూస్తున్నామని వివరించారు. పర్యాటక ప్రదేశాలను విదేశీ పర్యాట కులకు పరిచయం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. -
గాల్లోనే ఆరు గంటలు హైరానా
సిమ్లా: ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కేబుల్‌కార్ ఎక్కిన పర్యాటకులు రోప్‌వేలో సాంకేతిక లోపంతో కొన్ని గంటలపాటు తీవ్ర భయాందోళనల మధ్య గాల్లోనే గడపాల్సి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సొలాన్ జిల్లా పర్వానూ సమీపంలోని టింబర్ ట్రయల్ ప్రైవేట్ రిసార్ట్ వద్ద ఢిల్లీకి చెందిన 11 మంది పర్యాటకులు సోమవారం టింబర్ ట్రయల్ కేబుల్ కార్ ఎక్కారు. రోప్‌వేలో సాంకేతిక లోపం కారణంగా అది మధ్యలోనే సుమారు 250 అడుగుల ఎత్తులో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం అక్కడికి చేరుకుని, మరో కేబుల్ కార్ ట్రాలీని అక్కడికి పంపించి, ఒక్కొక్కరికీ తాడు కట్టి క్షేమంగా కిందికి దించింది. 6 గంటలు శ్రమించి అందులో చిక్కుకు పోయిన ఐదుగురు మహిళలు సహా మొత్తం 11 మందిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడినట్లు సీఎం జైరాం ఠాకూర్ చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌తోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఆయన వెంటనే ఘటనాస్థలికి పంపించారని వెల్లడించారు. 1992లోనూ టింబర్ ట్రయల్ వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకోగా, కేబుల్ కార్లో చిక్కుకుపోయిన 10 మందిని ఆర్మీ కాపాడింది. గత ఏప్రిల్‌లో జార్ఖండ్‌లోని త్రికూట్ పర్వతాల వద్ద రోప్‌వే గాల్లోనే నిలిచిపోయింది. ఆర్మీ సుమారు 40 గంటలపాటు శ్రమించి 12 మందిని రక్షించగా మరో ముగ్గురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. చదవండి: Breaking: ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల #HimachalPradesh :- Eleven People are stucked in the Timber Trail due to techanical problem. They have been getting rescued by the management.#Himachal pic.twitter.com/EgMfJy0UPY — Gorish (@IGorishThakur) June 20, 2022 కాగా 1992 అక్టోబర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇదే రోప్‌వేలో 11 మంది ప్రయాణికులు చిక్కుకుపోగా ఆర్మీ, వైమానిక దళం జరిపిన ఆపరేషన్‌లో 10 మందిని రక్షించారు. ఒకరు మరణించారు. అలాగే జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో గత ఏప్రిల్‌లో పర్యాటకులు 40 గంటలకు పైగా కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు. వారిలో ముగ్గురు మరణించారు. -
గాలిలో ప్రాణాలు
దేవగఢ్: జార్ఖండ్ రాష్ట్రం దేవగఢ్ జిల్లాలో ఆదివారం కేబుల్ కార్లు ఢీకొన్న ఘటనలో ఒక పర్యాటకురాలు మృతి చెందగా, 12 మంది గాయాలపాలయ్యారు. హెలికాప్టర్ ద్వారా తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఒకదాని వెంట మరొకటి వెళ్తున్న రెండు కేబుల్ కార్లలో మొదటిది కిందకు జారి వచ్చి వెనకున్న రెండో కేబుల్ కారును బలంగా ఢీకొట్టింది. దేవగఢ్ పట్టణంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి రక్షణ చర్యలు నిలిచే సమయానికి కేబుల్ కార్లలోనే మరో 15 మంది ఉన్నారు. చుట్టూ దట్టమైన అడవి, కొండలు, గుట్టలు ఉండటంతో ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించి ఆదివారం రాత్రి 11 మందిని మాత్రమే కాపాడగలిగింది. మిగిలిన వారు రోప్‌వే కేబుల్ కార్లలోనే అంత ఎత్తులో రాత్రంతా ప్రాణాలరచేతపట్టుకుని గడపాల్సి వచ్చింది. వారికి అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందజేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లతో సోమవారం తిరిగి సహాయక చర్యలను కొనసాగించారు. సాయంత్రం సమయానికి కేబుల్ కార్లలో చిక్కుబడిపోయిన 32 మంది పర్యాటకులను సురక్షితంగా తీసుకురాగలిగారు. కేబుల్ కార్లు ఢీకొనడంతో ఆదివారం తీవ్రంగా గాయపడి ఒక మహిళ చనిపోగా సహాయక చర్యల సమయంలో బెంగాల్‌కు చెందిన ఒక పర్యాటకుడు ప్రమాదవశాత్తు హెలికాప్టర్ నుంచి జారి పడి మృతి చెందారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే మాలిక్ తెలిపారు. క్షతగాత్రులైన మరో 12 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. చీకటి పడటంతో సోమవారం రాత్రి సహాయక చర్యలు నిలిపివేశామన్నారు. మరో 15 మంది ఇంకా కేబుల్ కార్లలోనే ఉన్నారని చెప్పారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు మంగళవారం ఉదయమే తిరిగి ప్రయత్నాలు కొనసాగిస్తామని మాలిక్ పేర్కొన్నారు. రోప్‌వే వ్యవస్థలో తలెత్తిన లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని దేవగఢ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రి తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రమాదం చోటుచేసుకోగా ఆ వెంటనే రోప్‌వే నిర్వాహకులు అక్కడి నుంచి పరారైనట్లు బాధితులు తెలిపారు. ఎత్తైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా 1,100 అడుగుల ఎత్తు, 766 మీటర్ల పొడవైన ‘త్రికూట్ రోప్‌వే’కు దేశంలోనే పొడవైందిగా పేరుంది. 2019 డిసెంబర్లో కశ్మీర్‌లోని గుల్మార్గ్లో రోప్‌వే తెగి కేబుల్ కార్లలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు ముగ్గురు టూరిస్ట్ గైడ్లు ప్రాణాలు కోల్పోయారు. #WATCH | A recce was conducted by one of the helicopters in the morning and operations are underway in coordination with the district administration and NDR to rescue people from ropeway site near Trikut in Deoghar, Jharkhand pic.twitter.com/Mum5Tq73nq — ANI (@ANI) April 11, 2022 (చదవండి: మళ్లీ కరోనా కలకలం.. ఆఫ్‌లైన్ క్లాస్‌లు నిలిపివేత) -
అమాంతం కిందపడిపోయిన కేబుల్ కారు, 13 మంది మృతి
రోమ్: ఉత్తర ఇటలీ ఆదివారం ఓ కేబుల్ కారు తెగిపడి... 13 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడగా... వీరి పరిస్థితి విషమంగా ఉంది. మాగియోర్ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి చూసేందుకు వీలుగా పక్కనే ఉన్న మొటారోన్ పర్వతం పైకి కేబుల్ కారు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరో 100 మీటర్లు వెళితే పర్వత శిఖరంపై దిగుతారనగా... ఒక్కసారిగా కేబుల్ తెగిపోయింది. 15 మంది ప్రయాణికులు కూర్చున్న కేబుల్ కారు అమాంతం కిందపడిపోయి పల్టీలు కొడుతూ చెట్లను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు దూరంగా విసిరేసినట్లుగా పడిపోయారు. 2016లోనే ఈ కేబుల్ లైన్‌ను పునర్నిర్మించారని స్టెసా మేయర్ మార్సెల్లా సెవెరినో తెలిపారు. కరోనా కారణంగా మూతబడిన ఈ పర్యాటక ప్రదేశాన్ని ఇటీవలే తెరిచారని వెల్లడించారు. 1998 తర్వాత జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని మీడియా తెలిపింది. -
జమ్ము కశ్మీర్లో విషాదం
కశ్మీర్ : జమ్ము కశ్మీర్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పర్యాటక స్థలమైన గుల్మార్గ్లో రెండు కేబుల్ కార్ టవర్ల మధ్య ఏర్పాటు చేసిన వైర్లపై భారీ చెట్టు పడింది.దీంతో వైర్ల సహాయంతో వెలుతున్న కేబుల్ కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు యాత్రికులు మృతిచెందారు. భారీ ఈదురు గాలుల దాటికి కేబుల్ కార్ తీగలపై చెట్టు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.