విరిగిన కేబుల్ కారు.. గాల్లో ఆరుగురి చిన్నారుల ప్రాణాలు.. | Pak Children Among 8 Stranded Mid Air In Cable Car | Sakshi
Sakshi News home page

విరిగిన కేబుల్ కారు.. గాల్లో ఆరుగురి చిన్నారుల ప్రాణాలు.. వీడియో వైరల్..

Published Tue, Aug 22 2023 6:25 PM | Last Updated on Tue, Aug 29 2023 5:12 PM

Pak Children Among 8 Stranded Mid Air In Cable Car - Sakshi

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో కేబుల్ కారు అకస్మాత్తుగా చిక్కుకుపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది దాదాపు 1200 అడుగుల ఎత్తులో కేబుల్ కారులోనే ఉండిపోయారు. లోయలను దాటే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 

సాధారణంగా ఆ ప్రాంతంలో లోయలను కేబుల్ కారు ద్వారానే దాటుతారు. రోజూవారిలాగే నేడు కేబుల్ కారులో 6గురు పాఠశాల పిల్లలతో కలిసి ఎనిమిది మంది ప్రయాణం ప్రారంభించారు. మధ్యకు వెళ్లగానే కేబుల్ కారు ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక బాధితులు అరుపులు మొదలు పెట్టారు. అందులో ఓ వ్యక్తి వద్ద ఫొన్ ఉండగా.. స్థానిక మీడియాకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు. హెలికాఫ్టర్ లేకుండా కేబుల్ కారులో చిక్కుకున్న వారిని రక్షించడం సాధ్యం కాదని భావించి, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. హెలికాఫ్టర్ రంగంలోకి దిగి వారిని సురక్షితంగా రక్షించారు. సాంకేతిక కారణాలతోనే కేబుల్ కారు ఆగిపోయినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.    

ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement