పాకిస్తాన్‌లో నిత్యం ఏదో ఒక అలజడి చోటుచేసుకున్నదనే వార్లలను వింటుంటాం. తాజాగా పాక్‌లోని బలూచిస్థాన్ బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పిషిన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుడుకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు పోలీసులతో సహా 16 మంది గాయపడ్డారు.
పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్‌లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బలూచిస్థాన్‌లోని పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. యాంటీ టెర్రరిజం డిపార్ట్‌మెంట్, బాంబ్ స్క్వాడ్ విచారణ జరిపి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీలు చేశారు.
తాజా ఘటనలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిని ఖండించారు. చిన్నారులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment