ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ యువకుడు తాను చనిపోతానని ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో చెప్పాడు. జీవితంపై విరక్తి వచ్చి, ఒంటరితనం భరించలేక బలవన్మరణానికి పాల్పడాలనుకున్నాడు. అయితే పోలీసులు ఈ వీడియో చూసిన వెంటనే అప్రమత్తమయ్యారు.
ఈ యువకుడు ఎక్కడున్నాడో గుర్తించి కాపాడాలని డిప్యూటీ కమిషనర్ స్మార్తన పాటిల్ పోలీసులను ఆదేశించారు. వెంటనే వాళ్లు యువకుడు ఉండే ప్రాంతాన్ని గుర్తించి వెళ్లారు. అక్కడ వెతుకుతుండగా.. అతడు రోడ్డుపక్కన ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు.
పోలీసులు వెంటనే అతడ్ని తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ ఇండాల్కర్ అతనికి కౌన్సిలింగ ఇచ్చి ధైర్యం చెప్పారు. దీంతో యువకుడు ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నాడు. అనంతరం పోలీసులు యువకుడ్ని స్నేహితుడికి అప్పగించి ఇంటికి పంపారు.
చదవండి: దారుణం.. రెండో భార్యను చంపి 50 ముక్కలు చేసిన భర్త!
Comments
Please login to add a commentAdd a comment