టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 20 వేల మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో రక్షణ బృందం నిరంతరం రెస్క్యూ చర్యలు కొనసాగిస్తోంది. అక్కడున్నవారికి ప్రతి క్షణం ఆ శిథిలాల కింద గుండె పగిలే దృశ్యాలతో తీవ్ర నిరాశలో ఉన్న వారికి ఓ ఘటన అవధులు లేని ఆనందాన్ని కొనితెచ్చింది. ఈమేరకు రెస్క్యూ సిబ్బంది భవనాల కింది ఉన్న వారిని రక్షించే పనిలో ఉండగా..ఓ కుప్ప కూలిన భవం కింద ఉన్న వ్యక్తులను కోసం గాలిస్తున్నారు.
ఐ తే అనహ్యంగా ఆ శిథిలాల కింద ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సజీవంగా బయటపడటంతో అక్కడ ఉన్న వారి అందరీ ముఖాల్లో కన్నీళ్లతో కూడిన సంతోషం వెల్లవిరిసింది. అక్కడ ఉన్న వారంతా తమవారిని పోగోట్టుకుని నిరాశలో ఉన్నప్పటికీ.. ఒక కుటుంబమైన తమలా కాకుండా అందరూ సజీవంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులతో సహా పెద్దలు కూడా సురక్షితంగానే ఉన్నారు.
ఆ కుటంబం క్షేమంగా ఉందని తెలియంగానే వారంతా.. గాడ్ ఈజ్ గ్రేట్, ఇది నిజంగా నమ్మలేని నిజం అంటూ ఆనందంతో గట్టిగా నినాదాలు చేశారు. రెస్క్యూ సిబ్బంది వారందర్నీ హుటాహుటినా ఆస్పత్రికి తరలించి తక్షణ చికిత్స అందించింది. అందకు సంబంధించిన వీడియోని సిరియా డిఫెన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఒక అద్భుతమైన క్షణం అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
A true miracle...the sounds of joy embrace the sky... joy beyond belief.
— The White Helmets (@SyriaCivilDef) February 7, 2023
An entire family was rescued from under the rubble of their house this afternoon, Tuesday, February 7, in the village of Bisnia, west of #Idlib.#Syria #earthquake pic.twitter.com/Cb7kXLiMjT
Comments
Please login to add a commentAdd a comment