Rubble
-
వయనాడ్ విపత్తు: ఆ 300 మంది ఎక్కడ?
వయనాడ్/కొల్లామ్: కేరళలో కొండచరియలు పడ్డాక కాపాడండంటూ ఆర్తనాదాలు చేసిన వారిని కాపాడిన సహాయక బృందాలు ఇప్పుడు కనిపించకుండా పోయిన వారిపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. ప్రకృతి వినాశక విశాల ఘటనాప్రాంతాల్లో ఇంకా వస్తున్న సెల్‌ఫోన్ సిగ్నళ్ల సాయంతో మనుషుల జాడను గుర్తించే అత్యాధునిక పరికరాలను తెప్పిస్తున్నారు. సెల్‌ఫోన్ చివరి లొకేషన్‌ను అత్యంత ఖచ్చితత్వంతో చూపించే గూగుల్ జీపీఎస్ కోఆర్డినేట్స్, డ్రోన్ ఏరియల్ ఫొటోల సాయంతో శిథిలాలు, కూలిన చెట్లు, బండరాళ్ల మధ్యలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేయనున్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో మరణాల సంఖ్య తాజాగా 300 దాటింది. గుర్తు తెలియని మృతదేహాలకు సామూహిక దహనసంస్కారాలు చేస్తున్నారు.బృందాలుగా ఏర్పడి బరిలోకి..దాదాపు 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరంచేశారు. అత్తమల అరాన్‌మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్ఎస్ఎస్ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, డీఎస్జీ, కోస్ట్‌గార్డ్, నేవీ, స్థానిక యంత్రాంగం, కేరళ పోలీసులు, స్థానికులు, అటవీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సంయుక్తంగా ఈ సంక్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. డ్రోన్ ఆధారిత అత్యాధునిక రాడార్‌ను ఢిల్లీ నుంచి తేనున్నారు. 190 అడుగుల బేలీ తాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తవంతో భారీ యంత్రాలను తెచ్చేందుకు మార్గం సుగమమైంది.కేంద్రం శ్రద్ధతో పట్టించుకోవాలి: రాహుల్గురువారం ఘటనాస్థలిని పరిశీలించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం సైతం పనులను పర్యవేక్షించారు. ‘‘ఇది పెను విషాదం. ఈ ఉదంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో పట్టించుకోవాలి. బాధిత కుటుంబాలకు వేరే ప్రాంతాల్లో శాశ్వత పునరావాసం కల్పించాలి’’ అన్నారు. వారికి కాంగ్రెస్ 100 ఇళ్లు కట్టిస్తుందన్నారు.నిక్షేపంగా ఇల్లు,కుటుంబంఇంతటి విలయం మధ్య ఒక ఇల్లు నిక్షేపంగా ఉండటం రెస్క్యూ టీమ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. పడవెట్టు కున్ను ప్రాంతంలో భారీ కొండచరియలు పడినా అక్కడి ఒక ఇల్లు మాత్రం దెబ్బతినలేదు. అయితే చుట్టుప క్కల అంతా కొండచరి యలు పడిన భయానక దృశ్యాన్ని చూసిన ఆ ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులు ప్రాణభయంతో మంగళవారం నుంచి ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఫలానా ప్రాంతంలో తమ వారి జాడ తెలీడం లేదని బంధువులు ఇచ్చిన సమాచారంతో ఘట నాస్థలికి చేరుకున్న హెలికాప్టర్ బృందం సురక్షిత ప్రాంతానికి తరలించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.పరిమళించిన మానవత్వంరూ.10 వేలు దానమిచ్చిన చిరు టీస్టాల్ యజమానురాలుసర్వం కోల్పోయిన శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి చిన్నపాటి టీస్టాల్ యజమానురాలు సైతం తనవంతు సాయంచేసి దానగుణాన్ని చాటారు. రోడ్డు పక్కన టీ అమ్ముకునే వృద్ధ మహిళ సుబేదా కేరళ విలయ బాధితులకు తనవంతుగా రూ.10,000 ఇచ్చారు. ఈమె దానగుణం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ‘‘ బ్యాంక్ రుణం కట్టేందుకే ఈ డబ్బు దాచా. టీవీలో విషాదవార్త విని మనసు చలించింది. నెలవారీ కిస్తీ(ఈఎంఐ) తర్వాత కడదాం.. ముందు వీళ్లను ఆదుకుందాం అని భర్త సైతం నాకు మద్దతు పలికారు. ఆరోగ్యం సహకరించక వయనాడ్‌దాకా వెళ్లి స్వయంగా ఇచ్చే ఓపికలేక కలెక్టరేట్‌కు వెళ్లి ముఖ్యమంత్రి విపత్తు సహాయనిధిలో జమచేశా’ అని సుబేదా చెప్పారు. వరద బాధితుల సహాయార్ధం గతంలోనూ ఈమె తన నాలుగు మేకలను అమ్మేసి వచ్చిన నగదును విరాళంగా ఇచ్చారు.మేజర్ సీతకు సలామ్కఠిన, విపత్కర, తీవ్ర ప్రతి కూల పరిస్థితుల్లో మహిళలు పనిచేయడం కష్టమనే భావనను ఒక్క ఫొటోతో చెదరగొట్టిన ఆర్మీ మేజర్ సీత అశోక్ శెల్కేకు అందరూ మెచ్చుకుంటున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది మీదుగా 190 అడుగుల బేలీ వంతెనను నిర్మించాల్సిన బాధ్యతను మద్రాస్ ఇంజనీర్ గ్రూప్, సెంటర్ తలకెత్తుకుంది. మేజర్ సీత సారథ్యంలోని జవాన్ల బృందం రేయింబవళ్లూ పనిచేసి 31 గంటల్లోపు వంతెనను నిర్మించింది. వంతెన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన మేజర్ సీత ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ భారత సైన్యం తరఫున ఇక్కడికొచ్చి సాయ పడు తున్నందుకు నాక్కూడా గర్వంగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధి కారులకు, సాయç ³డిన స్థానికులకు నా కృతజ్ఞతలు’ అని సీత అన్నారు. సీత సొంతూరు మహారాష్ట్ర లోని అహ్మద్‌నగర్ దగ్గర్లోని గడిల్‌గావ్. -
2 వేలు దాటిన అఫ్గాన్ మరణాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ పశి్చమ ప్రాంతాన్ని శనివారం కుదిపేసిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్‌ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్‌లో అఫ్గానిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు. అఫ్గాన్‌లో నాలుగో అతి పెద్ద నగరమైన హెరాత్ కేంద్రంగా శనివారం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 2,100కి చేరువలో ఉందని ఆదివారం తాలిబన్ సమాచార, సాంస్కృతిక శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రయాన్ చెప్పారు. మరో 9,240 మందికి తీవ్ర గాయాలయ్యాయని 1,320 ఇళ్లు నేలమట్టమయ్యాయని ఆయన తెలిపారు. డజనుకి పైగా బృందాలు అత్యవసర సహాయ చర్యల్లో మునిగిపోయాయి. కొన్ని గ్రామాల్లోకి సహాయ సిబ్బంది అడుగు పెట్టడానికి కూడా వీల్లేకుండా శిథిలాలతో నిండిపోయాయి. ఎటు చూసినా శిథిలాల్లో చిక్కుకున్న వారి రోదనలే వినిపిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడడానికి సహాయ బృందాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ చేతులనే ఆయుధాలుగా చేసుకొని శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటకి వస్తున్నాయి. మరికొందరు స్థానికులు శిథిలాల మీద పాకుతూ వెళుతూ వాటిని తొలగిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని కాపాడుతున్నారు. హెరాత్‌లో నేలమట్టమైన ఓ ఇంటి శిథిలాల్లో నుంచి ఆదివారం ఒక శిశువును అక్కడి వారు కాపాడుతున్న దృశ్యాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ప్రసారం చేసింది. అక్కడే శిథిలాల నుంచి ఓ మహిళ చేయి బయటికి కనిపిస్తుండటం కూడా రికార్డయ్యింది. ఆ మహిళ చిన్నారి తల్లేనని స్థానికులు తెలిపారు. ఆమె బతికున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధితులకు అందుతున్న సాయం.. అఫ్గాన్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి నుంచి భూకంప బాధితుల్ని కాపాడేందుకు యూనిసెఫ్ దుస్తులు, దుప్పట్లు, టార్పాలిన్లు తదితరాలను పంపించింది. ఐరాస వలసల విభాగం నాలుగు అంబులెన్సులు, వైద్యులు, ఇతర సిబ్బందిని అక్కడి ఆస్పత్రికి పంపించింది. మూడు మొబైల్ వైద్య బృందాలను జెందాజన్ జిల్లాకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ కూడా 80 మంది రోగులకు సరిపోయే అయిదు మెడికల్ టెంట్లను హెరాత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం వంటి సంస్థలు కూడా అత్యవసరాలను అఫ్గానిస్తాన్‌కు అందజేస్తామని ప్రకటించాయి. -
'నమ్మలేని నిజం': శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా..
టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 20 వేల మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో రక్షణ బృందం నిరంతరం రెస్క్యూ చర్యలు కొనసాగిస్తోంది. అక్కడున్నవారికి ప్రతి క్షణం ఆ శిథిలాల కింద గుండె పగిలే దృశ్యాలతో తీవ్ర నిరాశలో ఉన్న వారికి ఓ ఘటన అవధులు లేని ఆనందాన్ని కొనితెచ్చింది. ఈమేరకు రెస్క్యూ సిబ్బంది భవనాల కింది ఉన్న వారిని రక్షించే పనిలో ఉండగా..ఓ కుప్ప కూలిన భవం కింద ఉన్న వ్యక్తులను కోసం గాలిస్తున్నారు. ఐ తే అనహ్యంగా ఆ శిథిలాల కింద ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సజీవంగా బయటపడటంతో అక్కడ ఉన్న వారి అందరీ ముఖాల్లో కన్నీళ్లతో కూడిన సంతోషం వెల్లవిరిసింది. అక్కడ ఉన్న వారంతా తమవారిని పోగోట్టుకుని నిరాశలో ఉన్నప్పటికీ.. ఒక కుటుంబమైన తమలా కాకుండా అందరూ సజీవంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులతో సహా పెద్దలు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఆ కుటంబం క్షేమంగా ఉందని తెలియంగానే వారంతా.. గాడ్ ఈజ్ గ్రేట్, ఇది నిజంగా నమ్మలేని నిజం అంటూ ఆనందంతో గట్టిగా నినాదాలు చేశారు. రెస్క్యూ సిబ్బంది వారందర్నీ హుటాహుటినా ఆస్పత్రికి తరలించి తక్షణ చికిత్స అందించింది. అందకు సంబంధించిన వీడియోని సిరియా డిఫెన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఒక అద్భుతమైన క్షణం అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. A true miracle...the sounds of joy embrace the sky... joy beyond belief. An entire family was rescued from under the rubble of their house this afternoon, Tuesday, February 7, in the village of Bisnia, west of #Idlib.#Syria #earthquake pic.twitter.com/Cb7kXLiMjT — The White Helmets (@SyriaCivilDef) February 7, 2023 (చదవండి: పాక్‌లో దారుణం..కస్టడీలో ఉన్న వ్యక్తిపై హత్యయత్నం) -
90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల శిశువు.
భూకంపం తర్వాత టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరుస భూకంపాల తర్వాత భవన శిథిలాల గుట్టలు ఆ భయానక దృశ్యానికి సాక్షాలుగా నిలిచాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భూ ప్రళయంలో కన్నుమూసిన వారు ఇప్పటి వరకు 25 వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 20 వేల మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మరోవైపు గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయిన శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఘోర విపత్తు ద్వారా కూతురిని కోల్పోయిన తండ్రి, తల్లిని కోల్పోయిన చిన్నారులు, తోబుట్టువులు ఇలా పలు చోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు సజీవంగా బయటపడటం ఊరట కలిగిస్తోంది. మృత్యుంజయులుగా బయటపడుతున్న చిన్నారులు తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. తాజాగా హతయ్ ప్రావిన్సులో శిథిలాల కింద మరో మహిళ, నవజాత శిశువు మృత్యంజయులుగా నిలిచారు. భూకంపం సంభవించిన 90 గంటల తర్వాత శిథిలాల నుంచి తల్లితో సహా యాగిజ్ ఉలాస్ అనే పది రోజుల శిశువును అధికారులు రక్షించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి మరణాన్ని జయించింది చిన్నారి. అనంతరం దుప్పటిలో చుట్టి హతే ప్రావిన్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదే హతే ప్రావిన్స్‌లో భూ ప్రళయం చోటుచేసుకున్న 100 గంటల తర్వాత శిథిలాల నుంచి 3 ఏళ్ల జైనెప్ ఎలా పర్లక్ అనే చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చదవండి: Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత..! -
17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..
టర్కీలో ఘోరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయి శిథిలాల నగరంగా మారింది. ఎటు చూసినా మనసును కలిచి వేసే దృశ్యాలే. తల్లులను పోగొట్టుకున్న చిన్నారులు ఒకవైపు పిల్లలను పోగొట్టుకుని గర్భశోకంతో ఆక్రందనలు చేస్తున్న తల్లిదండ్రులు మరోవైపు. అక్కడి కన్నీటి రోదనలు ప్రకృతే విలపించేలా విషాదంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక వైరల్ ఫోటో అందరి హృదయాలను ద్రవింపచేసింది. ఆ ఫోటోలో ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద తమను కాపాడే వారి కోసం బిక్కు బిక్కుమంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. అందులో ఆ చిన్నారి తన తమ్ముడి తలపై చేయి వేసి శిథిలాల కింద నలిగిపోకుండా కాపాడుతోంది. వాళ్లు అలా శిథిలాల కింద సుమారు 17 గంటల పాటు చిక్కుపోయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన ట్విట్టర్లో.." ఆ ఏడేళ్ల బాలిక తమ్ముడిని రక్షించుకోవడానికి పడుతున్న తాపత్రయం మనసును పిండేస్తుంది. ఈ ఫోటోని ఎవరూ షేర్ చేయలేదు, ఆ చిన్నారి చనిపోక మునుపే షేర్ చేయండి. ఆ చిన్నారులు బతకాలని కోరుకుందాం. పాజిటివ్‌గా ఆలోచిద్దాం" అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు తమ్ముడి మీద ఆ చిన్నారికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతూ..ఏ అక్క చేయని సాహసం చేస్తోంది ఆ చిన్నారి. వారిద్దరూ బతకడమే గాక ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..ట్వీట్లు చేశారు. The 7 year old girl who kept her hand on her little brother's head to protect him while they were under the rubble for 17 hours has made it safely. I see no one sharing. If she were dead, everyone would share! Share positivity... pic.twitter.com/J2sU5A5uvO — Mohamad Safa (@mhdksafa) February 7, 2023 (చదవండి: ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..) -
ఉక్రెయిన్ ఎఫెక్ట్: వికీపీడియాకు భారీ జరిమానా
మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితేనే వారిపై కఠిన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కథనాలు వెలువరించిన వికీపీడియా మాతృసంస్థ వికీమీడియా ఫౌండేషన్‌కు 2 మిలియన్ రబుల్స్(రూ.26 లక్షలు) జరిమానా విధించింది రష్యన్ కోర్టు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు సంబంధించిన ఆర్టికల్స్‌ను తొలగించాలని రష్యా డిమాండ్ చేసినట్లు చెప్పారు రష్యాలోని వికీమీడియా ఫౌండేషన్ చీఫ్ స్టానిస్లావ్ కోజ్లోవ్స్కీ. వాటిని తొలగించకపోవటం వల్లే జరిమానా విధించిందని, దీనిపై వికీమీడియా ఫౌండేషన్ అప్పీలు చేస్తుందని వెల్లడించారు. మరోవైపు.. వికీపీడియాలో ప్రచురించిన రెండు ఆర్టికల్స్ కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అవి ‘రష్యా దండయాత్ర సమయంలో ఉక్రెయిన్ ప్రజల అహింసాత్మక ప్రతిఘటన’, ‘రష్యా 2022 ఉక్రెయిన్ దండయాత్ర సమాచారం’. ఉక్రెయిన్‌పై చేపట్టిన యుద్ధాన్ని ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌గా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది రష్యా. గతంలో ఏప్రిల్ 26 వికిమీడియా ఫౌండేషన్‌కు మొత్తం 5 మిలియన్ రబుల్స్ జరిమానా విధించింది రష్యన్ కోర్టు. ఇలాంటి ఆర్టికల్స్ ప్రచురించటంపైనే ఆ చర్యలు తీసుకుంది పుతిన్ సర్కార్. ఇదీ చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి -
నాగేటి సాలల్లో దోసిళ్లకొద్దీ ‘చరిత్ర’
సాక్షి, హైదరాబాద్ : అది ఓ గ్రామ శివారు ప్రాంతం.. గుట్ట దిగువన పంట చేలలో ఎన్నో రాతిముక్కలు. రాళ్లు కనిపించడంలో వింతేముంది అనుకుంటున్నారా.. అవన్నీ ఓ వైపు మొనదేలి గొడ్డలిని పోలి ఉన్నాయి. కొత్త రాతియుగంలో వేట, చెట్లు నరికేందుకు మానవులు వినియోగించిన గొడ్డళ్లే ఇవి. అయితే ఒకే ప్రాంతంలో వందల సంఖ్యలో ఎందుకున్నాయన్నది ప్రశ్న. దట్టమైన అడవి, కావల్సినన్ని నీటి వనరులు, ఆవాసానికి యోగ్యమైన గుట్టలు.. ఆ ప్రాంతం ఆదిమానవులకు అనువుగా ఉండేది. దీంతో వేల ఏళ్లపాటు మనుగడ సాగించి వారికి అవసరమైన రాతి పనిముట్ల తయారు చేసుకున్నారనేది చరిత్రకారుల వాదన. అందుకే ఇక్కడ తయారై వినియోగించని రాతి గొడ్డళ్లు విస్తారంగా లభిస్తున్నాయి. ఇదంతా క్రీ.పూ.3 వేల ఏళ్ల క్రితం నాటి సంగతట!.. ఈ ప్రాంతంలో భూమి దున్నుతున్నప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ, నలుపు... ఇలా ఎన్నో రంగుల్లో, రకరకాల ఆకృతుల్లో పూసలు దొరుకుతున్నాయి. వీటిలో కొన్ని మట్టితో తయారు కాగా, మరికొన్ని గాజుతో రూపొందినవి. ఇవి కుప్పపోస్తే దోసిళ్లకొద్దీ జమవుతున్నాయి. పూర్తిగా రూపొందినవి, అసంపూర్తిగా ఉన్నవి, పూసల తయారీకి అవసరమైన ముడి సామగ్రి... వీటిని గమనిస్తే ఈ ప్రాంతం పూసల తయారీకి కేంద్రమని తెలుస్తోంది. ఇందులో మట్టి పూసలు శాతవాహనుల కాలానికి సంబంధించి క్రీ.పూ. ఒకటో శతాబ్దానికి చెందినవి కాగా, గాజు పూసలు క్రీ.శ.ఒకటి శతాబ్ది తర్వాతవనేది చరిత్రకారుల మాట. విభిన్న కాలాల చరిత్ర... ఆ ప్రాంతంలో మందపాటి కాగు (కుండ కంటే పెద్దవి) పెంకులు, వాటిల్లో గాజు అంటిన గుర్తులు.. ఇవి గాజు బట్టీకి గుర్తులు. ఆ పక్కనే ముడి ఇనుము ముద్దలు. అవి ఇనుప బట్టీ ఆధారాలు. వెరసి గాజు, ఇనుప పరిశ్రమకు నెలవది. వెరసి.. 5 వేల పరిణామక్రమంలో మానవ మనుగడకు సజీవ సాక్షాలెన్నో. ఒకే ప్రాంతంలో ఇలా విభిన్న కాలాల చరిత్రను కళ్లకు కడుతున్న గ్రామమే సిద్దిపేట జిల్లాలోని కొండపాక. ఆదిమానవుల అడుగుజాడలు, శాతవాహనుల విజయగాధలు, కళ్యాణి చాళక్యుల నిర్మాణాలు, కాకతీయ రాజుల నాటి ఆలయాలు.... కొండపాక ఇప్పుడు చరిత్రకారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుత మండల కేంద్రంగా ఉన్న ఈ గ్రామం చారిత్రక ప్రాధాన్యముందన్న సంగతిని చాలాకాలం క్రితమే చరిత్రకారులు గుర్తించారు. అడపాదడపా పరిశోధనలు చేసి ఆధారాలు సేకరించారు. కానీ ఎక్కువ పర్యాయాలు ఆలయాలు కేంద్రంగానే ఇవి సాగాయి. కానీ శివారు ప్రాంతం మల్లన్నగుట్ట వద్ద మానవ పరిణామ క్రమంపై ఇప్పుడు వెలుగుచూస్తున్న ఆధారాలు కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నాయి. గతంలో కొందరు పరిశోధకులు ఈ దిశగా కొన్ని ఆధారాలు సేకరించగా తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొన్ని ఆధారాలు సేకరించి పరిశీలిస్తున్నారు. నాగేటి చాలు చెప్పే సంగతులెన్నో.... ఆదిమానవులు కూడా సమూహంగా జీవించారనేందుకు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. కానీ, పనిముట్లను ఎవరికి వారుగా తయారు చేసుకుని వేట, వ్యవసాయం సాగించారు. అయితే, ఒకేచోట ఆయుధాలు తయారు చేసుకున్నట్లు చెప్పే ఆధారాలు చాలా తక్కువ. కానీ కొండపాక శివారు మల్లన్నగుట్ట కింద లభిస్తున్న రాతి పనిముట్లు... వేల యేళ్ల క్రితమే రాతి పనిముట్ల తయారీ కర్మాగారం నిర్వహించినట్లు తెలుస్తోందని ఆ బృందం సభ్యులు హరగోపాల్, వేముగంటి మురళి, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం సాగులో ఉండటంతో దున్నినప్పుడల్లా ఈ రాళ్లు వెలుగుచూస్తున్నాయన్నారు. వీటిల్లో గొడ్డళ్లు ఎక్కువగా ఉన్నాయని, రెండువైపులా పదునున్నవి కూడా ఇక్కడ కనిపించినట్లు వెల్లడించారు. ఇక చేలలో ఎక్కడ చూసినా రంగు పూసలు, నాటి గాజు ముక్కలు, గాజు అంటి ఉన్న కుండపెంకులు, టెర్రకోట బొమ్మల ముక్కలు, శాతవాహనుల కాలం నాటి భారీ ఇటుకలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. గతంలో హుస్నాబాద్ సమీపంలోని గాజుల బస్వాపూర్, భువనగిరి సమీపంలోని బస్వాపూర్‌లో గాజుల బట్టీలు వెలుగుచూశాయి. ఇక్కడ తవ్వకాలు జరిపితే బట్టీ నిర్మాణ శిథిలాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. సమీపంలోని గుట్టపై భారీ రాళ్లతో రూపొందించిన గూడు సమాధుల (డోల్మెన్స్) ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. ఇవి ఆదిమానవుల జాడకు సజీవ సాక్ష్యం. ఇక రాతి పనిముట్లు నూరేందుకు వినియోగించే గ్రూవ్స్ కూడా ఉన్నాయి. ఇక కాకతీయ సైనికులు (ఎక్కటీలు) నిర్మించిన త్రికూటాలయం, రుద్రేశ్వరాలయం, మల్లన్నగుట్టపై శిథిల దేవాలయాలు ఉన్నాయి. రుద్రదేవుడు, గణపతి దేవుడి కాలంలో వేయించిన శాసనాలు, కళ్యాణి చాళుక్యుల నాటి మరో శాసనం కూడా ఉంది. కానీ.. ఇప్పటి వరకు పురావస్తుశాఖ ఇక్కడ ఎలాంటి అధ్యయనం నిర్వహించలేదు. వ్యవసాయ పనులతో నాటి చారిత్రక ఆధారాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. భవిష్యత్‌లో అక్కడ ఈ మాత్రం ఆధారాలు కూడా లభించే అవకాశం లేదు. -
కళాశాలకు రావాలంటే బెంబేలు
ఈ గదులు మాకొద్దు సారూ.. శిథిలమైన కళాశాల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియదు బెంబేలెత్తిపోతున్న విద్యార్థులు తరగతుల బహిష్కరణ చెట్ల కిందే కూర్చున్న విద్యార్థులు కళాశాలకు రావాలంటేనే విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. శిథిల భవనంలోనే తరగతులు కొనసాగుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో భవనం పైకప్పు కొద్దికొద్దిగా కూలుతుంది. ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కూలే గదులు మాకొద్దంటూ చెట్ల కిందే కూర్చుంటున్నారు అల్లాదుర్గం జూనియర్ కళాశాల విద్యార్థులు. అల్లాదుర్గం 2001లో అల్లాదుర్గానికి జూనియర్ కళాశాల మంజూరైంది. భవనం లేకపోవడంతో అప్పట్లో ప్రభుత్వం పాఠశాలలో షిప్టు పద్ధతిలో తరగతులు నిర్వహించారు. జెడ్పీహెచ్‌ఎస్‌కు సొంత భవనం నిర్మించడంతో పాత భవనంలో కళాశాల కొనసాగుతోంది. పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పైకప్పు పడుతుంది. గత ఏడాది ఇద్దరు విద్యార్థులపై పడటంతో గాయాలయ్యాయి. మూడు రోజులుగా వర్షాలు కరుస్తుండటంతో భవనం పైకప్పు కూలిపోతుంది. దీంతో విద్యార్థులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. బుధవారం అదే భవనంలో తరగతులు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ చెప్పడంతో విద్యార్థులు తరగతులను బహిష్కరించి చెట్ల కింద కూర్చున్నారు. చెట్ల కింద తరగతులు నిర్వహించకుండా లెక్చరర్లు కార్యాలయంలోనే కూర్చుండిపోయారు. ప్రిన్సిపాల్ తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనంలో షిప్టు పద్ధతిలో కాలేజీ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆరు నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల ¿భవనంలో షిప్టు పద్ధతిలో తరగతులు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. భయంగా ఉంది.. కాలేజీ భవనం శిథిలావస్థకు చేరింది. రోజూ పైకప్పు కూలి పడుతుంది. ఎప్పుడు ప్రమాదం ముంచుకోస్తుందోనని భయపడుతున్నాం. వర్షం పడితే చాలు గదుల్లో నీరు నిండుతుంది. లతీఫ్, విద్యార్థి షిప్టు పద్ధతిలో కొనసాగించాలి.. కళాశాల, జిల్లా పరిషత్ పాఠశాలను షిప్టు పద్ధతిలో కొనసాగించాలి. పాత భవనంలో కూర్చునే ప్రసక్తే లేదు. చదువు కోవాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రవీందర్, విద్యార్థి -
భూకంపం బలాదూర్.. చిన్నారి సేఫ్
భూకంపం ధాటికి పెద్దపెద్ద భవనాలు కూడా కుప్పకూలిపోతాయి. అందులోనూ జపాన్ లాంటి దేశాల్లో భూకంపాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ ఇంట్లో ఉన్నవాళ్లు ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యం. కానీ, గురువారం రాత్రి జపాన్‌లో సంభవించిన భూకంపం బారి నుంచి ఎనిమిది నెలల చిన్నారి సురక్షితంగా బయటపడింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శకలాలను తొలగిస్తున్న రెస్క్యూ టీంకు ఓ చిన్నారి కనిపించింది. భూకంప ప్రభావంతో మషీకీలో కూలిపోయిన ఓ ఇంటి శకలాలను తొలగిస్తుండగా 8 నెలల అమ్మాయిని సిబ్బంది బయటకు తీశారు. అంత భూకంపం వచ్చి, ఇల్లు కూలిపోయినా.. ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమెను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జపాన్ దక్షిణ ప్రాంతంలో సంభవించి భారీ భూకంపదాటికి ఇప్పటి వరకు 9 మంది మృతిచెందగా 800 మందికి పైగా గాయాలయ్యాయి. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9.26 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటలకు) కమమొటో పరిధిలోని మషీకీ పట్టణంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.5గా నమోదైనట్లు జపాన్ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. భూకంపంపై జపాన్ ప్రధానమంత్రి షింజో అబే స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. -
పతన బాటలోనే రూపాయి
మరో 59 పైసలు ఆవిరి... 63.53 వద్ద క్లోజ్ 13 నెలల కనిష్ట స్థాయి ఇది.. ముంబై: రూపాయి పతనం మరింత తీవ్రతరమవుతోంది. వరుసగా రెండోరోజూ దేశీ కరెన్సీ భారీగా పడింది. మంగళవారం డాలరుతో రూపాయి మారకం విలువ మరో 59 పైసలు నష్టపోయింది. క్రితం ముగింపు 62.94తో పోలిస్తే 0.94 శాతం దిగజారి 63.53 వద్ద ముగిసింది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటం.. మరోపక్క ముడిచమురు(క్రూడ్) ధర శరవేగంగా పడిపోతుండటంతో దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం రూపాయి విలువను ఆవిరయ్యేలా చేస్తోంది. కాగా, ఈ పతనానికి అడ్డుకట్టవేయడం కోసం ఆర్బీఐ డాలర్ల విక్రయం ద్వారా కొంత జోక్యం చేసుకున్నప్పటికీ... ఫలితాలివ్వడం లేదని ఫారెక్స్ మార్కెట్ డీలర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నేడు(బుధవారం) 64 స్థాయి దిగువకు పడిపోయే అవకాశం కూడా ఉందనేది వారి అంచనా. సోమవారం కూడా రూపాయి 65 పైసలు క్షీణించింది. వెరసి 2 రోజుల్లో 124 పైసలు(2%) ఆవిరైంది. కాగా, డాలరుతో రూపాయి విలువ దీర్ఘకాలంపాటు 62 దిగువన గనుక కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులేనని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ‘లోటు’ గుబులు... విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) అమ్మకాలు జోరందుకోవడంతో... మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 538 పాయింట్లు, నిఫ్టీ 152 పాయింట్ల చొప్పున పడిపోయాయి. ఇది కూడా దేశీ కరెన్సీ సెంటిమెంట్‌ను దిగజార్చింది. ఇదిలాఉంటే.. నవంబర్ నెలలో భారత్ వాణిజ్య లోటు ఏడాదిన్నర గరిష్టస్థాయిలో 16.8 బిలియన్ డాలర్లకు పెరిగిపోవడం కూడా రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర మంగళవారం మరింత దిగజారి 54 డాలర్లకు(నెమైక్స్ బ్యారల్ రేటు) పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ 60 డాలర్ల దిగువకు చేరింది. రూబుల్ ఆల్‌టైమ్ కనిష్టానికి... క్రూడ్ ధరల పతనం.. ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావంతో రష్యా కరెన్సీ కుదేలవుతోంది. కొద్దిరోజులుగా పతనబాటలోనే ఉన్న డాలరుతో రూబుల్ విలువ.. మంగళవారం ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఏకంగా 18 శాతంపైగా కుప్పకూలి.. 80ని తాకింది. 1998లో ఆర్థిక సంక్షోభం తర్వాత రష్యా కరెన్సీ ఇంతలా కుప్పకూలడం ఇదే తొలిసారి. కాగా, కరెన్సీ క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం సోమవారం పొద్దుపోయాక అకశ్మాత్తుగా రష్యా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీరేటును 10.5 శాతం నుంచి 17 శాతానికి అమాంతం పెంచేసింది. గత గురువారం వడ్డీరే టును 5.5% నుంచి తొలుత 10.5 శాతానికి పెంచి ంది. అయితే, ఈ చర్యలకు ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది రష్యా కరెన్సీ 50% పైగా ఆవిరికావడం గమనార్హం. క్రూడ్, ఇతరత్రా ఇంధన వనరులపైనే అత్యధికంగా ఆధారపడిన రష్యా ఆర్థిక వ్యవస్థ.. తాజా పరిణామాలతో వచ్చే ఏడాదిలో మళ్లీ ఆర్థిక మాంద్యంలో చిక్కుకోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, అంతర్జాతీయంగా డాలరు విలువ బలపడుతుండటంతో... వర్ధమాన దేశాల్లోని ఇతర కరెన్సీలు కూడా తీవ్రంగా క్షీణిస్తున్నాయి.