మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితేనే వారిపై కఠిన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కథనాలు వెలువరించిన వికీపీడియా మాతృసంస్థ వికీమీడియా ఫౌండేషన్‌కు 2 మిలియన్ రబుల్స్(రూ.26 లక్షలు) జరిమానా విధించింది రష్యన్ కోర్టు.
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు సంబంధించిన ఆర్టికల్స్‌ను తొలగించాలని రష్యా డిమాండ్ చేసినట్లు చెప్పారు రష్యాలోని వికీమీడియా ఫౌండేషన్ చీఫ్ స్టానిస్లావ్ కోజ్లోవ్స్కీ. వాటిని తొలగించకపోవటం వల్లే జరిమానా విధించిందని, దీనిపై వికీమీడియా ఫౌండేషన్ అప్పీలు చేస్తుందని వెల్లడించారు. మరోవైపు.. వికీపీడియాలో ప్రచురించిన రెండు ఆర్టికల్స్ కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అవి ‘రష్యా దండయాత్ర సమయంలో ఉక్రెయిన్ ప్రజల అహింసాత్మక ప్రతిఘటన’, ‘రష్యా 2022 ఉక్రెయిన్ దండయాత్ర సమాచారం’.
ఉక్రెయిన్‌పై చేపట్టిన యుద్ధాన్ని ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌గా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది రష్యా. గతంలో ఏప్రిల్ 26 వికిమీడియా ఫౌండేషన్‌కు మొత్తం 5 మిలియన్ రబుల్స్ జరిమానా విధించింది రష్యన్ కోర్టు. ఇలాంటి ఆర్టికల్స్ ప్రచురించటంపైనే ఆ చర్యలు తీసుకుంది పుతిన్ సర్కార్.
ఇదీ చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి
Comments
Please login to add a commentAdd a comment