russian court
-
Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు
మాస్కో: సూపర్మార్కెట్లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్మార్కెట్లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్‌లోని స్కూల్‌పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్ రాజ్యంగా మారి ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది. ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్‌లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్‌లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
రష్యా జర్నలిస్టుకు పాతికేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పుబట్టినందుకు వ్లాదిమిర్ కారా–ముర్జా జూనియర్(41) అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్త జైలు పాలయ్యాడు. దేశద్రోహం నేరకింద రష్యా కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై ఇప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది. జైలుశిక్షను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. -
ఉక్రెయిన్ ఎఫెక్ట్: వికీపీడియాకు భారీ జరిమానా
మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితేనే వారిపై కఠిన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కథనాలు వెలువరించిన వికీపీడియా మాతృసంస్థ వికీమీడియా ఫౌండేషన్‌కు 2 మిలియన్ రబుల్స్(రూ.26 లక్షలు) జరిమానా విధించింది రష్యన్ కోర్టు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు సంబంధించిన ఆర్టికల్స్‌ను తొలగించాలని రష్యా డిమాండ్ చేసినట్లు చెప్పారు రష్యాలోని వికీమీడియా ఫౌండేషన్ చీఫ్ స్టానిస్లావ్ కోజ్లోవ్స్కీ. వాటిని తొలగించకపోవటం వల్లే జరిమానా విధించిందని, దీనిపై వికీమీడియా ఫౌండేషన్ అప్పీలు చేస్తుందని వెల్లడించారు. మరోవైపు.. వికీపీడియాలో ప్రచురించిన రెండు ఆర్టికల్స్ కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అవి ‘రష్యా దండయాత్ర సమయంలో ఉక్రెయిన్ ప్రజల అహింసాత్మక ప్రతిఘటన’, ‘రష్యా 2022 ఉక్రెయిన్ దండయాత్ర సమాచారం’. ఉక్రెయిన్‌పై చేపట్టిన యుద్ధాన్ని ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌గా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది రష్యా. గతంలో ఏప్రిల్ 26 వికిమీడియా ఫౌండేషన్‌కు మొత్తం 5 మిలియన్ రబుల్స్ జరిమానా విధించింది రష్యన్ కోర్టు. ఇలాంటి ఆర్టికల్స్ ప్రచురించటంపైనే ఆ చర్యలు తీసుకుంది పుతిన్ సర్కార్. ఇదీ చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి -
బాలికలపై అత్యాచారం: 150 ఏళ్ల జైలుశిక్ష
రష్యన్ బాలికలపై అత్యాచారం చేసి.. ఎవరికైనా చెబితే తల నరికేస్తానని బెదిరించినందుకు అమెరికన్ పౌరుడికి రష్యా కోర్టు 150 ఏళ్ల జైలుశిక్ష విధించింది. యూసెఫ్ అబ్రమోవ్ (58) అనే ఈ వ్యక్తికి అమెరికన్, రష్యన్ పౌరసత్వాలు రెండూ ఉన్నాయి. ఇతడు తరచు రష్యా వస్తూ స్కూళ్లలో చదివే అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్నాడు. 2009 జూన్ నెలలో 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసి, ఎవరికనా చెబితే ఆమె తల నరికి.. దాంతో ఫుట్‌బాల్ ఆడుకుంటానని బెదిరించాడు. కొన్ని నెలల తర్వాత అతడు మళ్లీ రష్యా వెళ్లి, మళ్లీ బాలికలపై అత్యాచారం చేశాడు. పోలీసులకు చెప్పారన్న అనుమానంతో మరోసారి మార్చి నెలలో అక్కడకు వెళ్లి, అమ్మాయిలపై తన అనుచరులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. బాధితులలో ఒక అమ్మాయిని విచారణ సందర్భంగా పిలిచి, అతడిని గుర్తుపట్టాలని కోరగా.. ఆమె అతడిని చూసి పెద్దగా అరుస్తూ నేలమీద కుప్పకూలిపోయింది. తర్వాత కోర్టులో నేల మీద తీవ్రంగా గాయపడిన ఓ జంతువులా పాకుతూనే ఉంది తప్ప లేవలేకపోయిందని జడ్జి రైట్ చెప్పారు. నిందితుడిపై నేరం రుజువైంది కాబట్టి అతడికి 45 ఏళ్ల జైలుశిక్ష విధించాలని కోరగా, జడ్జి మాత్రం 150 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అతడు ఇక విడుదలయ్యే అవకాశం లేదన్న విశ్వాసం బాధితులకు ఉంటుందని జడ్జి చెప్పారు.